For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: రిషిధార ప్రేమ దోబుచులాట, వసుపై జగతిఆగ్రహం.. దేవయాని మరో ప్లాన్!

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  అక్టోబర్ 3వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 3వ ఎపిసోడ్ లో..

  పెద్దమ్మకి సారీ చేప్పమమని మహేంద్రతో రిషి అంటాడు. పెద్దమ్మకి మన ఇంట్లో ఇంతపెద్ద అవమానం జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక్క మాట సారీ చెప్పండి. ఇంకేమి అడగను అని చెబుతాడు రిషి. కానీ నేనేమి తప్పు చేయలేదని మహేంద్ర అనడంతో అన్నం తినకుండా రిషి సీరియస్ గా వెళ్తూ జరిగిన దానికి నేను సారీ చెబుతున్నా పెద్దమ్మ అనేసి వెళ్లిపోతాడు.

  దీంతో కోపంగా సారీ వదినగారు అని మహేంద్ర చెబుతాడు. నా కొడుకు కోసం ఎన్ని మెట్లు అయినా దిగుతాను. ఎన్ని సారీలు అయినా చెబుతాను. వాడని పిలవండి. నా కొడుకు ఆకలిగా వెళ్లడం నాకు ఇష్టం లేదు పిలవండి వాడిని అని బతిమిలాడతాడు. తర్వాత దేవయాని వెళ్లి రిషిని భోజనానికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది.

  అక్టోబర్ 4వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 4వ ఎపిసోడ్ లో..

  వసుధారకు ఇచ్చిన టూ వీలర్ పై వీఆర్ అని రాసి ఉంటుంది. జగతి, వసుధార ఇద్దరితో.. మీరిద్దరూ క్యాంప్ కు వెళ్తున్నారా అని మహేంద్ర అడగడంతో లేదు సార్.. మేడమ్ కి ఒంట్లో బాలేదట నేను వెళ్తున్నాను అని వసుధార అంటుంది. నేను కూడా వస్తాను అని మహేంద్ర అనడంతో.. జగతి ఆపి ఇక్కడ మనకు పనులున్నాయి.. రిషిని వెళ్లమని అడుగు అని చెబుతుంది. రిషి క్యాబిన్ కు వెళ్తుంది వసుధార.

  అక్కడ రిషి ఉండడు. ఆ కుర్చీతో అక్కడున్న వస్తువులతో మాట్లాడుతూ ఏంటి విశేషాలు.. జెంటిల్ మెన్ లా ఉంటారు. కానీ వస్తువులేవి సరిగ్గా ఉంచుకోరు అని వస్తువులను సర్దుతూ ఉంటుంది. ఇంతలో వచ్చిన రిషి ఒక మూల నుంచి దొంగచాటుగా వసుధారను వీడియో తీస్తుంటాడు. రిషి సార్ ఎంతో మంచోళ్లు.. ఎంతో ప్రేమ ఉంది. కానీ అంత ముక్కు మీద కోపం ఏంటి ఆ మనిషికి అని అంటుంది వసుధార. ఈ కుర్చీలో కూర్చుందామా.. మన రిషి సారే కదా.. అని రిషి కుర్చీలో కూర్చుంటుంది వసుధార. ఇదంతా వీడియో తీస్తాడు రిషి.

  అక్టోబర్ 5వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 5వ ఎపిసోడ్ లో..

  మహేంద్రకు కాఫీ తీసుకొచ్చిన దేవయాని రిషిధారల గురించి మాట్లాడుతుంది. వసుధారను నువ్ మర్చిపో.. నేను సాక్షిని మర్చిపోతాను.. మన స్థాయికి తగ్గ సంబంధం చూసి గ్రాండ్ గా రిషి పెళ్లి చేద్దాం అని దేవయాని అంటుంది. మహేంద్ర ఏదో చెప్పబోతుండగా.. రిషి ఒప్పుకోడంటావా.. ఒప్పించు మహేంద్ర అని అంటుంది దేవయాని.

  దీనికి ఆ పనేదో మీరే చేయొచ్చుగా అని మహేంద్ర అంటే.. నేను ఏ పని అయినా చేయగలను.. ఎన్నో చేసినదాన్ని ఈ ఒక్క పని చేయలేనా.. కానీ ఎవరు ఏది చేయాలో వాళ్లే చేయాలి.. రిషికి ఎప్పుడు ఏది చెప్పాలో, ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తండ్రిగా బాధ్యత తీసుకుని రిషిని వేరే సంబంధానికి ఒప్పించు.. చెప్పింది మర్చిపోకు మహేంద్ర అని వెళ్లిపోతుంది దేవయాని.

  తర్వాత లోపలకు వెళ్లిన దేవయానికి జగతి ఎదురుపడుతుంది. వెళ్లు వెళ్లు మహేంద్ర ఎందుకో డల్ గా ఉన్నాడు.. మహేంద్రతో సారి చెప్పించగలిగిన దాన్ని నేను ఏదైనా చేయగలనని తెలుసుకోవడం మంచిది అంటుంది దేవయాని. మహేంద్ర దగ్గరికి వెళ్లిన జగతి.. అక్కయ్య ఏమంటోంది అని అడుగుతుంది. దీనికి విషపు నాగు ఎప్పుడూ ఎవర్ని కాటేయాలా అని ఆలోచిస్తుంది అని చెబుతాడు

  అక్టోబర్ 6వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 6వ ఎపిసోడ్ లో..

  ఒకప్పుడు రిషి వేరు. కాలేజీకి నువ్ వచ్చాక నా జీవితంలోకి నువ్ వచ్చాక ఈ రిషి వేరు. పాఠాలు లెక్కలు చెప్పే నాకు జీవిత పాఠాలు చెప్పావ్. కొత్త లెక్కలు నేర్పావ్. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఆస్తులుగా అందించావ్. చివరి శ్వాస వరకు మనం కలిసి ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఈ దూరం.. శ్వాస ఆగిపోయినట్లు చేస్తోంది. ఎందుకు మన మధ్య ఈ దూరం అని రిషి అడుగుతాడు. నేను కూడా అదే చెబుతున్నాను సార్.. మన మధ్య దూరం లేదు.

  జగతి మేడం అనే చిన్న అభిప్రాయ బేధం ఉంది సార్. జగతి మేడమ్ ని అమ్మా అని పిలిస్తే.. అని అనేలోపు వసుధార అని గట్టిగా అరిచి లేచి నిల్చుంటాడు రిషి. నీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ ప్రస్తావన వద్దని.. నేను ఏం కోల్పోయానో నీకేం తెలుసు.. అని రిషి అంటే.. కోల్పోయిన తల్లి ప్రేమ ఇప్పుడైన పొందుచ్చు కదా.. నిజం తెలుసుకోండి సార్ అని వసుధార అంటుంది. అందుకు నిజం నాకు తెలుసు అని రిషి అనడంతో.. జగతి మేడమ్ ఎందుకు వెళ్లారో మీకు తెలుసా అని వసుధార అంటే.. ఎందుకు వెళ్లిందో కాదు.. నన్ను వదిలేసి వెళ్లారు అంతే.. అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి.

  అక్టోబర్ 7వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 7వ ఎపిసోడ్ లో..

  దసరా, దీపావళికి బొమ్మల కొలువు పెట్టుకుంటే బాగుంటుంది అని వసుధార అంటే నేను కూడా హెల్ప్ చేయనా.. అని రిషి అడుగుతాడు. అందుకు మీకిది రాదు తర్వాత నేర్పిస్తానంటుంది వసుధార. దీంతో ఇటు రా అని వసుధార చేతిలో ఉన్న బొమ్మలను తీసుకుంటాడు రిషి. రాజు రాణి బొమ్మలు పక్కపక్కనే ఉండాలని వసుధార అంటే మరి సైన్యం ఏది అని రిషి అంటాడు. ఇందుకు మీరే నా సైన్యం అంటుంది వసుధార. తర్వాత మన ఇద్దరి మధ్య చిన్న అడ్డుతెర ఉంది. దాన్ని నువ్వు తొలగిస్తావని చూస్తున్నా అని రిషి అంటాడు. నా ఆలోచనలు తప్పు అనిపించవచ్చు కానీ, కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది అని వసుధార అంటుంది.

  నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు.. ఓ చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకింత మొండిపట్టు పడుతున్నావ్.. నేను బంధాలకు, ప్రేమకు విలువ ఇస్తాను అని రిషి అంటే.. అమ్మను అమ్మా అని పిలవడానికి మీకు ఎందుకింత అని వసుధార అంటుంది. నా మనసులో ఉన్నది పదే పదే చెబుతున్నా.. నీకు అర్థం కావడం లేదంటూ కోపంగా వెళ్లిపోతాడు రిషి. సైట్ విజిటింగ్ రిపోర్ట్ అని వసుధార అడిగితే.. జగతి మేడమ్ కి ఇచ్చేసి వెళ్లు అనేస్తాడు రిషి. తర్వాత మీరు జగతి మేడమ్ ని అమ్మా అని పిలుస్తారు.. పిలిచేలా చేస్తాను అని అనుకుంటుంది వసుధార.

  అక్టోబర్ 8వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 8వ ఎపిసోడ్ లో..

  రిషి గురించి వసుధారతో మాట్లాడుతుంది జగతి. ఎంతకాలం ఓపిక పట్టాలి. అసలేం జరుగుతోంది మీ ఇద్దరి మధ్యా అని జగతి అంటే.. మేం బాగానే ఉన్నాం కదా అని వసుధార రిప్లై ఇస్తుంది. ఏం బాగున్నారు. ఎక్కడ బాగున్నారు. నువ్ మహేంద్ర కలిసి గురుదక్షిణ ఒప్పందం చేసుకున్నారు కదా. నేను ఇన్నాళ్లు రిషి మనసుకి గాయం కాకూడదనే జాగ్రత్త పడ్డాను. కానీ, నా భయాన్ని నువ్ నిజం చేస్తున్నావ్.

  నువ్ అసలు ఇక్కడకు రాకుండా ఉంటే బాగుండేది. ఇద్దరు కలిశారు, విడిపోయారు, మళ్లీ కలిశారు.. ఎందుకిలా చేస్తున్నావ్ అని జగతి అంటే మీరేకదా నన్ను ఇక్కడకి రికమండ్ చేసింది. నేనేం చేశానని వసుధార అంటుంది. నీ మొండిపట్టుదల వదులు. రిషి నన్ను అమ్మా అని పిలవకపోతే తప్పేంటి. నువ్ చేస్తోంది అంతకన్నా పెద్దతప్పు.

  మీ బంధం గురించి ఆలోచించు. నీకు రిషి కోపం గురించి తెలియదని జగతి అంటే కోపం కోపమే.. ప్రేమ ప్రేమే.. అని వసుధార రిప్లై ఇస్తుంది. దీంతో స్టాపిట్ అంటూ టైబుల్ పై ఉన్న వస్తువులను విసిరి కొడుతుంది జగతి. దేవయాని మాటలు గుర్తుచేసుకుని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జీవితాలు నాశనం అవుతాయి. నీ మొండితనం తగ్గించుకో అని జగతి అంటుండగా.. మహేంద్ర వస్తాడు.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X