For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: రిషి నానమ్మ చీర కట్టుకోని వసుధార.. చేయిచేసుకున్న జగతి.. క్రేజీగా ఎపిసోడ్స్

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  అక్టోబర్ 10వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 10వ ఎపిసోడ్ లో..

  వసుధార-రిషి పూలదండలతో వచ్చినట్లు ఊహించుకున్న దేవయాని షాక్ లో ఉంటుంది. తర్వాత దేవయాని భుజం తట్టి లేపిన రిషి.. మీకు మేడమ్ కి సహాయంగా ఉంటుందని వసుధారను తీసుకొచ్చా అని చెబుతాడు. నీ పెళ్లి గురించి ఎప్పటి నుంచో మాట్లాడాలని అనుకుంటున్నా అని దేవయాని చెబుతుంది. ఇందులో మాట్లాడటానికి ఏముంది.

  మా ఇద్దరి బంధం గురించి వసుధార వాళ్ల ఇంట్లో చెప్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఎవరి అనుమతి కూడా అవసరం లేదు. నేనే అన్నీ చూసుకుంటాను. మీకేం శ్రమ ఇవ్వను అని రిషి చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఒకింత ఆవేశానికి గురవుతుంది దేవయాని. తర్వాత జగతి దగ్గరికి వెళ్లిన వసుధార.. ఏమైంది మేడమ్ ఎలా ఉన్నారు అని కంగారుగా అడుగుతుంది. రిషికి నీ మీద కోపం తగ్గిందా అని అడుగుతుంది జగతి.

  రిషి సార్ కోపం, ప్రేమ పాలునీళ్లలా కలిసిపోయే ఉంటాయి అని వసుధార చెబుతుంది. ఇంతలో తనకు మీ గురించి తప్ప వేరే ఆలోచన లేదని మహేంద్ర అంటాడు. మీరు ఎప్పుడు హుషారుగా ఉండాలి, నా మీద అరవాలి అని వసుధార అంటుంది. నేను ఇక్కడ, కాలేజ్ లో హుషారుగా కనిపించిన జగతి మేడమ్ లోపల ఉన్న తల్లి ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది అని బాధపడుతుంది జగతి. వీరి మాటలన్ని అటుగా వెళ్తున్న రిషి ఆగి వింటాడు.

  అక్టోబర్ 11వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 11వ ఎపిసోడ్ లో..

  జగతికి కాఫీ తీసుకెళ్లి ఇస్తాడు రిషి. రిషిని చూసి జగతి కొంచెం ఆశ్చర్యపడుతుంది. మీ ఆరోగ్యం గురించి డాడ్ ని అడిగాను. మీ గురించి డాడ్ టెన్షన్ పడుతున్నారు. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. డాడ్ కోసమైనా. డాడ్ కోసం ఆలోచించాలి. 80 శాతం బాధలు మనుషుల ఆలోచన విధానం వల్లే వస్తాయి. మీరొకటి ఆలోచిస్తున్నారు అది సాధ్యామా అసాధ్యామా అని పక్కన పెడితే.. దానివల్ల మీరు అందరిని బాధపెడుతున్నారు.

  నిజానికి మీరు బాగా ఆలోచిస్తే మీ బాధకు కారణం నేను కాదు.. మీరే.. ఓ పిలుపు కోసం బంధాన్ని బలిపెట్టాలని అనుకోవద్దు. నా దృష్టిలో ఆ పిలుపు ఎప్పుడో దూరమైంది. ఆ బంధం ఎప్పుడో ఒంటరివాడని చేసింది. మీరు పోగొట్టుకున్న పిలుపు విలువ ఎంతో తెలుసా.. నేను పోగొట్టుకున్న బాల్యం అంత. మీకు కావాల్సిన ప్రశాంతత నేను ఇవ్వగలను. కానీ నేను కోల్పోయిన బాల్యం మీరు తెచ్చివ్వగలరా. మిమ్మల్ని మారమని నేను అడగడం లేదు. నా మనసులో మాట చెప్పడానికి వచ్చాను. చిన్నప్పుడే నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయాక వసుధార వచ్చాక జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను.

  ఇప్పుడు ఆ ఒక్క పిలుపు కోసం వసుధారతో బంధాన్ని దూరం చేయకండి. నేను మాట్లాడే మాటలు కటువుగా ఉండొచ్చు. కానీ, అందులో ఏ ఒక్కటి అబద్ధం కాదు. మీ మనసు నొప్పిస్తే క్షమించండి. తల్లి ఆదరణ లేకుండా పెరిగినవాడిని కదా.. దయచేసి డాడ్ ఆనందాన్ని దూరం చేయకండి అని రిషి వెళ్తుండగా.. అక్కడ మహేంద్ర నిల్చొని ఉంటాడు.

  అక్టోబర్ 12వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 12వ ఎపిసోడ్ లో..

  జగతి దగ్గరికి వచ్చిన వసుధార మేడమ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. శరీరం బాగానే ఉంది. కానీ మనసు బాలేదు అని జగతి సమాధానం ఇస్తుంది. జగతి.. ఇక్కడేం మాట్లాడవద్దు అని చెప్పాను కదా అని మహేంద్ర అంటాడు. జగతి మేడమ్ కి ఇష్టమైన పని చేబోతున్నాను అని వసుధార చెబుతుంది. అంటే నాక్కూడా నచ్చుతుందన్నమాట అని మహేంద్ర అంటాడు.

  ఏం చేయబోతున్నావ్. ఒకప్పుడు రిషిని చూస్తే భయం వేసేది. ఇప్పుడు నిన్ను చూస్తే భయం వేస్తుంది అని వసుధారతో అంటుంది జగతి. దీంతో మీరు భయపడే పనులు చేయను.. రిషి సార్ పర్మిషన్ తీసుకోవాలి అని వసుధార అనడంతో గౌతమ్.. ఇక పని అయినట్టే.. అని నిట్టూరుస్తాడు. దానికి అలా ఎందుకు అంటావ్ అని జగతి అంటుంది. నువ్వెక్కడ ఏం చేసిన పర్వాలేదు కానీ ఇంట్లో మాత్రం వదినగారి పర్మిషన్ తీసుకోవాలి అని మహేంద్ర అంటాడు. చూద్దాం సార్.. రిషి సార్ ఉన్నారు కదా అని వసుధార అంటుంది. మరోవైపు రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. రిషి దగ్గరికి వసుధార వెళ్తుంది. ఏంటి ఇక్కడే నిలుచున్నావ్.

  రా.. అంటూ వసుధార చేతిలో ఏముందా అని తొంగి చూస్తాడు రిషి. ఏదో దాచిపెడుతున్నావ్. దాపరికాలు, దాగుడుమూతలు ఆలలేదా అని రిషి అంటాడు. ఏంటీ సార్ అలా మాట్లాడతారు.. గిఫ్ట్ సార్ అని వసుధార సమాధానం ఇస్తుంది. దీనికి నా బర్త్ డే కాదు కదా అని రిషి అంటే.. గిఫ్ట్ ఇవ్వడానికి మనసు ఉంటే చాలు సందర్భం అవసరం లేదు అని వసుధార అంటుంది. తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తాడు రిషి. అందులో ఉన్న రాజు రాణి బొమ్మలు చూసి చాలా బాగున్నాయి వసుధార అని అంటాడు. అవును సార్.. రాజు మీరు.. రాణి నేను.. ఇద్దరం పక్కపక్కనే ఉండాలి అని అంటుంది వసుధార. దీంతో రిషి చాలా సంతోషపడతాడు. తర్వాత ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడానికి రిషిని ఒప్పిస్తుంది వసుధార.

  అక్టోబర్ 13వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 13వ ఎపిసోడ్ లో..

  అందరూ బొమ్మల కొలువు కోసం ప్రిపేర్ చేస్తుంటారు. ఇంతలో అందుకు కావాల్సిన వస్తువుల గురించి దేవయాని అడుగుతుంది. ధరణి వెళ్లి తీసుకొస్తా అంటే.. మీరు ఉండండి మేడమ్ నేను వెళ్లి తీసుకొస్తా అని వెళ్తుంది వసుధార. దీంతో వసుధార.. ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లు అని రిషి చెబితే.. వెనక్కి వచ్చి.. రిషి చేయి పట్టుకుని ఎవరో ఎందుకు.. మీరే తోడు రండి అని తీసుకెళ్తుంది వసుధార. అలా రిషిని వసుధార తీసుకెళ్తే ఎంతో బాగుందని అందరూ అనుకుంటారు. కానీ దేవయాని మాత్రం ఉడికిపోతుంది. తర్వాత వసుధార, రిషి ఇద్దరూ పై రూమ్ కి వెళతారు. ఏంటి అందరిముందు అలా తీసుకొచ్చావ్ అని రిషి అడుగుతాడు. దీంతో నవ్వి ఊరుకుంటుంది వసుధార. ఏంటి నవ్వుతున్నావ్ అని రిషి అంటే కొన్ని సార్లు చిరునవ్వే సమాధానం అని చెబుతుంది వసుధార.

  అక్టోబర్ 14వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 14వ ఎపిసోడ్ లో..

  వాగ్ధానం మర్చిపో అన్న మాటలు తలుచుకుంటూ అయిష్టంగా ఆ చీర తీసుకుని గదిలోకి వెళ్తుంది వసుధార . పైన గదిలోకి వెళ్లి ఆ చీర పక్కన పెట్టేసి ఆలోచనలో పడుతుంది వసుధార. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. ఏంటీ వసుధార ఆలోచిస్తున్నావ్.. చీర కట్టుకో.. అని జగతి అంటుంది. ఈ చీర కట్టుకుంటే సగం ఈ ఇంటికోడలు అయినట్లే కదా.. రిషి సార్ అంటే నాకు ప్రాణమే కానీ, నేను ఇంటి కోడల్ని కావాలంటే దానికి అడ్డంకి మిగిలిపోయింది కదా.. అని వసుధార అంటుంది.

  ఇప్పుడు అవన్ని ఆలోచించే సమయం కాదు కదా అని జగతి అంటుంది. సమయాన్ని సందర్భాన్ని పక్కనపెట్టి సడలింపులు ఇచ్చుకుంటూ పోతే దాన్ని వ్యక్తిత్వం, జీవితం అనరు. మనం ఒకటి నమ్మినప్పుడు కష్టమైనా నిలబడాలి. మధ్యలోనే ఎలా వదిలేస్తాం అని వసుధార అంటుంది. కొన్నిటిని చూసి చూడనట్లు వెళ్లాలి అని జగతి అంటే.. కొన్నింటిని మాత్రమే కాదు.. అన్నింటినీ కదా..రిషి సార్ ని ఎలాంటి మచ్చలేకుండా చూడాలి అనుకుంటున్నాను. ప్రపంచంలో ఎవరైనా తల్లి గొప్పతనం గురించి అనర్గళంగా మాట్లాడతారు.

  అలాంటిది రిషి సార్.. అమ్మ అని కూడా పిలవరు అటే నేను తట్టుకోలేను అని వసుధార అంటుంది. ఎందుకింత మొండిపట్టు.. నా మాట విను.. చీర కట్టుకో.. దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అని జగతి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో మహేంద్ర కూడా ఎంట్రీ ఇస్తాడు. దీనికంతటికీ నేనే కారణం కదా.. నా వల్లే కదా అనుకుంటాడు మహేంద్ర. దీంతో నువ్వెళ్లు మహేంద్ర నేను వస్తానంటుంది జగతి. గురుదక్షిణ అడిగాడు కానీ ఈ విషయం ఇంత పెద్దది అవుతుందని మహేంద్ర అప్పుడు అనుకోలేదు కదా.. నా మాట విను.. అని జగతి అంటుంది. దీంతో ఆలోచనలో పడుతుంది వసుధార.

  అక్టోబర్ 15వ ఎపిసోడ్ లో..

  అక్టోబర్ 15వ ఎపిసోడ్ లో..

  ఆ చీర కట్టుకుంటే ఇంటి కోడలుగా సగం బాధ్యత వచ్చినట్టే కదా మేడమ్.. గురుదక్షిణ ఒప్పందం తీర్చుకోకుండా నేను ఇప్పుడు ఆ చీర కట్టుకుంటే నేను గురుదక్షిణ నుంచి తొలగిపోయినట్టే కదా.. అని వసుధార అనడంతో కోపంతో వసుధారను కొడుతుంది జగతి. అదే సమయంలో అక్కడికి వచ్చిన రిషి మేడమ్ ఏం చేస్తున్నారు.. వసుధార మీద మీరు చేయి చేసుకోవడం ఏంటి అని అరుస్తాడు.

  ఆడపిల్లను కొడతావా ఇదేం పని.. వసుధార మీద చెయి చేసే అర్హత నీకు ఎక్కడిది అంటుంది దేవయాని. ఇదే అవకాశం అనుకుని మా అత్తగారి చీర కట్టుకోమని రిషి తనకు చెప్పాడు. తను కట్టుకోలేదు. అది తన ఇష్టం. ఈ ఇంటి పిల్ల అవ్వాలని తనకు లేదు. అంత మాత్రానా కొట్టాలా.. ఇంటికి కోడలు అవ్వాలని లేదనుకుంటా అంత మాత్రానా కొట్టలా అంటు మాట్లాడుతుంది దేవయాని. ఇంతలో నన్ను క్షమించు వసుధార అని మహేంద్ర చెబుతాడు. దీంతో సార్.. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు. మేడం కొట్టినందుకు నాకు బాధగా ఏం లేదు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది సర్.

  ఇంట్లో ప్రేమలు, బంధాలు ఎక్కువ.. బంధాల కోసం ఆరాటాలు ఎక్కువ అని వసుధార అంటుంటే.. వసుధార నిన్ను.. అని జగతి అంటుంది. జగతి అనేలోపే ఇక చాలు మేడమ్.. అని రిషి దండం పెడతాడు. ఎవరికైనా భరించే శక్తి కొంతకాలమే ఉంటుంది. నేను అలసిపోయాను. విసిగిపోయాను. ఇవన్నీ మనసు ఉన్న వాళ్లకే తెలుస్తుంది. చిన్నప్పుడే కన్న కొడుకుని వదిలేసి వెళ్లిన వాళ్లకు కాదు అని కోపంతో జగతిని అంటాడు. తర్వాత అక్కడి నుంచి వసుధార చేయి పట్టుకుని తీసుకువెళ్లిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే మరి.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X