For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: జగతి స్థానంలో వసుధార.. ఆడపిల్లగా ఆ పరిస్థితి రావొద్దని కన్నీళ్లు!

  |

  వసుధార, రిషి బయటకు వెళ్తారు. పానీపూరి తినడానికి అలా బయటకు వెళ్తారు. పానీపూరి తింటూ గతంలో కొబ్బరి బొండాలు తాగిన విషయం గుర్తు చేసుకుంటుంది వసుధార. వసుధారను గమనించిన రిషి.. ఏంటీ ఆలోచిస్తున్నావ్. మనం కొబ్బరి బొండాలు తాగిన విషయం గుర్తుకు వచ్చిందా అని రిషి అడుగుతాడు. వసుధార మళ్లీ పానీపూరి గురించి క్లాస్ తీసుకుంటుంది. దీంతో బాబోయ్ వద్దని రిషి అంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 12, 2022 సోమవారం నాటి తాజా ఎపిసోడ్​ 631లో ఏం జరిగిందో చదివేసేయండి.

  గొడవలు పడకుండా మాట్లాడుకుంటుంటే..

  గొడవలు పడకుండా మాట్లాడుకుంటుంటే..

  రిషి, వసుధార పానీపూరి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన బండి అతను మీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతాడు. ఆ మాటకి ఆశ్చర్యపోయిన ఇద్దరు అలా అడిగావ్ ఏంటని అంటారు. గొడవలు పడకుండా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారంటే.. మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వాళ్లని అర్థం అయిందని ఆ బండి వ్యక్తి అంటాడు. దీంతో రిషి మన పెళ్లి గురించి ఆలోచించాలని వసుధారతో చెబుతాడు. వసుధార ఇంట్లో వాళ్ల గురించి, అక్కడి పరిస్థితులు తదితర విషయాలను తలుచుకుని బాధగా ఉంటే పెద్దమ్మతో మాట్లాడతాను అని రిషి ధైర్యం చెబుతాడు.

  ఆడపిల్లగా అలాంటి పరిస్థితి రాకూడదు..

  ఆడపిల్లగా అలాంటి పరిస్థితి రాకూడదు..

  మీ ఊరు, మీ వాళ్లను గుర్తు చేస్తే చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చదువు కోసం పెళ్లి పీటలు మీద నుంచి ధైర్యంగా వచ్చేశావ్. అదే ధైర్యంతో వాళ్లను మన పెళ్లికి ఒప్పిస్తావని అనుకుంటున్నా అని రిషి అంటాడు. ఆడపిల్లకు పుట్టింటి వాళ్లు అండగా ఉంటారు. కానీ ఒక ఆడపిల్లగా తన తండ్రి తప్పులు చెప్పే పరిస్థితి ఎవరకి రాకూడదు. మా నాన్న మంచివాడు. నా చదువు విషయం ఆయనకు ఇష్టం లేదు. ఆయన చెప్పిందే జరగాలి అంటారు. మా అమ్మ కుడా ఆయనకు ఎదురు చెప్పలేదు. నాన్న లేనప్పుడు అమ్మ ధైర్యం చెప్పేది. ఆ ధైర్యమే పెళ్లి పీటల నుంచి బయటకు వచ్చేసేలా చేసింది అని వసుధార అంది.

  ప్రేమగా దగ్గరికీ తీసుకున్న రిషి..

  ప్రేమగా దగ్గరికీ తీసుకున్న రిషి..

  తను చెప్పిందే జరగాలని అనుకునే విచిత్ర మనస్తత్వాలు ఉన్న బావలు వచ్చారు. మా అమ్మ మా అక్కల జీవితాలు అయినట్లుగా నా జీవితం కాకూడదని ధైర్యం చెప్పి.. అమ్మ నన్ను బయటకు పంపించింది. అందరినీ వదిలేసి వచ్చాను. జగతి మేడమ్ మీలాంటి తోడు దొరికాక అనుకున్నది సాధించాను. అక్కడే ఉంటే అక్కడే నా జీవితం ముగిసిపోయేది ఏమో. నేను ఏం చెయ్యాలి. వాళ్లను ఎలా ఒప్పించాలి అని ఏడుస్తుంది వసుధార. వసుధార కన్నీళ్లు చూసి రిషి బాధపడుతూ కర్చీఫ్ ఇవ్వబోతుంటే వద్దని అంటుంది. తర్వాత వసుధార కన్నీళ్లు తుడుస్తాడు రిషి. ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు.

  జగతి స్థానంలో వసుధార..

  జగతి స్థానంలో వసుధార..

  కట్ చేస్తే రిషి వాళ్లు మంత్రి దగ్గరికి వెళతారు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇతర రాష్ట్రాల వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, దానికి హెడ్ గా ఉండలేనని జగతి మెయిల్ చేశారు. తన స్థానంలో వసుధారను పెట్టమని జగతి సూచించినట్లు మంత్రి రిషి వాళ్లకు చెబుతారు. అటు జగతి కూడా తన దగ్గరికి వచ్చిన మేడమ్ వాళ్లకు చెబుతుంది. ఇంత పెద్ద బాధ్యత మోయలేనని వసుధార అంటుంది. కానీ, రిషి మాత్రం జగతి మేడమ్ గైడెన్స్ లో వసుధార చేస్తుందని చెబుతాడు. ఇదే విషయం గురించి ఇంట్లో వాళ్లకు చెబుతాడు రిషి. జగతి మేడమ్ స్థానాన్ని భర్తీ చేసేంత గొప్పదాన్ని కాదని వసుధార అంటుంది.

  నాకన్నా బాగా నడిపించగలవు..

  నాకన్నా బాగా నడిపించగలవు..

  మినిస్టర్ గారు చెప్పింది మాకు సరైనదేనని అనిపిస్తుందని మహేంద్ర కూడా వసుధారకు ధైర్యం చెబుతాడు. దీని గురించి నువ్వేమి ఆలోచించకు.. మేడమ్ బాధ్యతలు నువ్వు తీసుకుంటున్నావని రిషి చెప్పేస్తాడని అంటాడు. వసుధార చిరాకుగా జగతి దగ్గరికి వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ ను తను నడపలేనని వసుధార కంగారుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ ను తనకన్నా బాగా ముందుకు తీసుకెళ్లగలవని జగతి ధైర్యం చెబుతుంది. అప్పుడే వసుధారకు రమ్మని రిషి మెసేజ్ చేస్తాడు. ఎప్పుడు మీ మేడమ్ దగ్గరేనా.. నాకు కూడా కొంచెం కనిపించొచ్చు కదా అని రిషి అంటాడు.

  English summary
  Guppedantha Manasu Serial December 12 2022 Today Full Episode 631
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X