Don't Miss!
- News
నాందేడ్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాల్క సుమన్: కేసీఆర్ ఏం చెప్పారంటే.?
- Sports
INDvsAUS : ప్రాక్టీస్‌లో మా ఫోకస్ అంతా దానిపైనే: రాహుల్ ద్రావిడ్
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu: పట్టువీడని తండ్రి, అవమానంతో వసుధార.. దేవయాని ఏం చేయబోతుందంటే?
ఇంట్లో తండ్రి చక్రపాణి అన్న మాటలు చెప్పకుండా రిషికి అబద్ధం చెబుతుంది వసుధార. ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత బాధగా కూర్చుని ఏడుస్తుంటుంది. ఇంతలో తల్లి సుమిత్ర వచ్చి బతిమిలాడుతుంది. పరువు, పేద, గొప్ప అంటూ ఏవేవో చెబుతూ వసుధారకు భోజనం తినిపిస్తుంటుంది. ఎంత కాదనుకున్న ఆయన మీ నాన్నే కదా.. నీకు ఒక విషయం తెలుసా.
అందరికీ నువ్ అంటేనే ఎక్కువ ఇష్టం అని తల్లి సుమిత్ర అనడంతో నిజమా అమ్మా అని అడుగుతుంది వసుధార. ఇంతలో తండ్రి చక్రపాణి ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 27, 2022 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్ 644లో ఏం జరిగిందో చదివేసేయండి.

ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి..
అందరికీ నువ్వే ఇష్టం అని వసుధారకు తల్లి సుమిత్ర చెబుతుండగా తండ్రి చక్రపాణి ఎంట్రీ ఇస్తాడు. వసుధారకు తినిపించే అన్నం ప్లేట్ లాక్కుంటాడు. అదేదో పని మీద వచ్చింది. పని అయిపోగానే వెళ్లిపోతుంది. అప్పుడు మనిద్దరమే ఉంటాం అని చక్రపాణి అంటాడు. ఇంతలో వసుధారకు మళ్లీ ఫోన్ వస్తుంది. అది చూసిన చక్రపాణి.. చూశావా.. ఇంటికి వచ్చిందో లేదో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అంటాడు. ఈ నెలలో ఒక్కసారైనా నీకు ఫోన్ చేసిందా అని అంటూ కోపంగా ఫోన్ విసిరి కొడతాడు చక్రపాణి. అదే సమయానికి జగతి కాల్ చేయడంతో ఫోన్ స్విచాఫ్ వస్తుంది.

అసలు అక్కడ ఏం జరుగుతోంది..
వసుధార ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో జగతి టెన్షన్ పడుతుంది. నవ్వు ఏం బాధపడకు జగతి చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్లింది కదా అని సర్ది చెబుతాడు మహేంద్ర. రిషికి కాల్ చేయమని అంటుంది జగతి. మరోవైపు వసుధార కాల్ కోసం రిషి ఎదురుచూస్తుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది. ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది.
నాకు తిరిగి కాల్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది.. తనే చేస్తుందిలే అనుకుంటాడు రిషి. ఇంతలో దేవయాని ఫోన్ చేయడంతో చెప్పు వసుధార అనగానే నేను మీ పెద్దమ్మని అంటుంది దేవయాని. అప్పుడు అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకుని దేవయాని నవ్వుకుంటూ ఉంటుంది.

రిషిని వసుధార పెళ్లి చేసుకుంటుందా..
రిషితో మాట్లాడాక.. వసుధార బావ రాజీవ్ కి ఫోన్ చేస్తుంది దేవయాని. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని చెప్పినట్లు చేయి అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయాని పోన్ కట్ చేసి.. నేను ఉండగా రిషిని వసుధార పెళ్లి చేసుకుంటుందా.. అది నేను ఉండగా ఎప్పటికీ జరగదు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వసుధార చదువుకున్న కాలేజీకి దగ్గరికి వెళతాడు రిషి. అప్పుడు వసుధార కాలేజీ లోపలికి వెళ్లినట్లు ఊహించుకుంటాడు. దీంతో లోపలికి వెళ్లి చూడగా అక్కడికి ఎవరు రాకపోవడంతో.. అదంతా తన భ్రమ అనుకుని రియలైజ్ అవుతాడు.

నా జీవితంలోకి రాకపోయి ఉంటే..
మొదటిసారి ఇదే కాలేజీలో ఒకరికి తెలియకుండా ఒకరం నేను వసుధార కలుసుకున్నాం. ఎంత మంచి జ్ఞాపకమో. వసుధార నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను ఎన్నో కోల్పోయే వాడిని అనుకుంటూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార ఫోన్ చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చక్రపాణి బయటకు వెళ్తుండగా సుమిత్ర వెళ్లి కాఫీ ఇవ్వడంతో నాకొద్దు అని చెబుతాడు చక్రపాణి. వసుధారతో మాట్లాడండి అని చక్రపాణికి వసుధార తల్లి సుమిత్ర నచ్చ జెప్పిన పట్టించుకోడు. సుమిత్ర చెప్పేది వినిపించుకోకుండా కోపంగా బయటకు వెళ్లిపోతాడు వసుధార తండ్రి చక్రపాణి.
నాకు అహంకారం లేదు..
ఇక అటు కాలేజీ దగ్గర ఉన్న రిషి.. వసుధారకు మళ్లీ కాల్ చేస్తాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో.. టెన్షన్ పడుతూ ఉంటాడు రిషి. ఇలా కరెక్ట్ కాదు.. డైరెక్ట్ గా వసుధార వాళ్ల ఇంటికి వెళ్లాలి అని నిర్ణయించుకుని బయలుదేరుతాడు రిషి. అదే సమయంలో తండ్రితో మాట్లాడుతుంటుంది వసుధార.
నాకు అహంకారం లేదు.. చదువుకోవాలి అనుకున్న నాకు పెళ్లి చేయాలనుకున్నారు అని వసుధార చెబుతుంటే తండ్రి చక్రపాణి ధీర్ఘాలు తీస్తూ వసుధారను అపార్థం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార నీ కూతురు యూనివర్శిటీ టాపర్ వచ్చిందని గర్వంగా చెప్పుకోండి అని అనడంతో పరువు పోయిందని చక్రపాణి అంటాడు.