Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Guppedantha Manasu: బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్ పై రిషి సీరియస్.. తండ్రి చెప్పిన వినకుండా అలా!
మహేంద్ర గౌతమ్ ఇంట్లోనే ఉన్నాడని తెలిసి రిషి కోపంతో ఊగిపోతాడు. డాడీ కోసం పిచ్చోడిలా మారిపోయాను కదరా.. నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా అని నిలదీస్తాడు రిషి. రేయ్ గౌతమ్ నీకు వంద కారణాలు ఉండొచ్చు కానీ, నీ ఫ్రెండ్ ని కదరా.. ఇంత మోసం ఎలా చేశావురా.. దీనికంటే నన్ను కత్తితో పొడిచి చంపేసి ఉంటే ఇంకా బాగుండేది అని బాధపడతాడు రిషి.
నా మాట వినరా అని గౌతమ్ నిజం చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా.. రిషి అస్సలు వినిపించుకోడు. నన్ము నమ్మరా ప్లీజ్ అన్నప్పటికీ.. నువ్ మిత్రద్రోహివి.. జీవితంలో మళ్లీ నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా వెళ్లిపోతాడు రిషి. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 3, 2022 శనివారం నాటి తాజా ఎపిసోడ్ 624లో ఏం జరిగిందో చదివేసేయండి.

ఒక్కరిదేనా తప్పు..
గౌతమ్ ను అనరాని మాటలు అని ఇంటికి బయలుదేరతాడు రిషి. అతనితోపాటు వసుధార ఉంటుంది. ఇద్దరు కారులో ఇంటికి వెళ్తుండగా.. గౌతమ్ సార్ ఒక్కరిదేనా తప్పు అని రిషిని వసుధార అడుగుతుంది. కారణం ఏదైనా కానీ గౌతమ్ నన్ను మోసం చేయకూడదు.. నా బాధ, కన్నీళ్లు చూసి కూడా గౌతమ్ నిజం ఎలా దాచాడు అని రిషి అంటాడు.
మహేంద్ర సార్ చెప్పొద్దంటే తనేం చేస్తారు. ఈ విషయంలో ముగ్గురిదీ తప్పుంది. గౌతమ్ సార్ ఒక్కరినే తప్పుపట్టడం సరికాదు అని వసుధార అంటుంది. వందసార్లు ఆలోచించినా గౌతమ్ నా దగ్గర నిజం దాచడం తప్పు. తప్పు కాదు.. ద్రోహం అని అంటాడు రిషి.

ఇంత త్వరగా వస్తారా..
మరోవైపు ఇంట్లో జగతి, వసుధార, రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చింది. రిషిని వసుధార తనవైపు తిప్పుకుంది. అర్ధరాత్రిల్లు షికారు చేస్తున్నారు. ఇంకా వచ్చినట్లు లేరు. ఏదో ఒకటి చేయాలి. ఇలా వదిలేయకూడదు అని అనుకుంటుంది దేవయాని. ఇంతలో రిషి, వసుధార ఇంట్లోకి వస్తారు.
రిషి కోపంగా ఊగిపోవడంతో ఆగిపోయిన దేవయాని.. వసుధారను అడ్డుకుంటుంది. అప్పుడే వచ్చేశారేంటి.. తెల్లారిన తర్వాత వస్తారనుకున్నా.. లాంగ్ డ్రైవ్ కి వెళ్లారా.. లాంగ్ డ్రైవ్ కి వెళితే ఇంత త్వరగా వస్తారా.. లాంగ్ డ్రైవ్ అంటే దూర ప్రయాణం కదా.. చూస్తా ఎంత దూరం ప్రయాణిస్తావో అని వసుధారతో దేవయాని అంటుంది.

జగతి ఇంట్లో.. నువ్ బయట..
దేవయాని అలా అనడంతో.. ఇప్పుడు రిషి సార్ ఉన్న పరిస్థితుల్లో ఈవిడతో మాట్లాడకపోవడమే మంచిది అనుకుని మేడమ్ నన్ను వెళ్లనివ్వండి అని వసుధార అంటుంది. నువ్వు ఇంట్లోకి వచ్చినా ఆపలేదు. బయటకు వెళ్లినా ఆపడం లేదు. అంతా నీ ఇష్టమే నడుస్తోంది కదా.. ఈ జగతి మళ్లీ వచ్చిందని నీకు బలమొచ్చింది కదా.. జగతి ఇంట్లో ఉంటుంది.
నువ్వు బయట ఉంటావ్. నువ్వు ఇంట్లో ఉంటావ్. జగతి బయట ఉంటుంది. సరే వసుధార అలసిపోయి ఉంటావ్. గుడ్ నైట్. అవును మర్చిపోయాను. ఈసారి లాంగ్ డ్రైవ్ కి వెళ్లినప్పుడు నాకు ముందుగా చెబితే.. తినడానికి ఏమైనా తయారు చేసి పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది దేవయాని.

గౌతమ్ రూమ్ కి వెళితే మనసు పాడయింది..
దేవయాని మేడమ్ ఆవిడ పద్ధతికి విరుద్ధంగా మాట్లాడుతోంది. మళ్లీ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా అనుకుంటుంది వసుధార. మరోవైపు రిషి తండ్రి రూమ్ కి వెళ్లి చూస్తాడు. మహేంద్ర నిద్రపోతున్నాడని తెలిసి వెనక్కి వెళ్లిపోదామనుకునేలోపు మహేంద్ర పిలుస్తాడు. ఏంటీ ఈ అవతారం అని అడుగుతాడు మహేంద్ర. డ్రెస్ పాడైంది.
మార్చుకునేందుకు గౌతమ్ రూమ్ కి వెళితే అక్కడ మనసు పాడయింది అని రిషి చెబుతాడు. ఏమైంది రిషి అని మహేంద్ర అడుగుతాడు. మీరు (మహేంద్ర) అక్కడ ఉన్నట్లు నాకు తెలిసిపోయింది డాడ్ అని తండ్రి మహేంద్ర కొడుకు రిషి అంటాడు.
|
ఫ్రెండ్ ని మోసం చేయడం నేరం..
ఓ విషయం చెప్పడానికి తెలియడానికి చాలా తేడా ఉంటుంది డాడ్. మీరు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారు అని అడగలేదు. మీరు కూడా చెప్పలేదు. కానీ గౌతమ్ నా చిన్నప్పటి ఫ్రెండ్.. నా బెస్ట్ ఫ్రెండ్. వాడు కూడా నా దగ్గర నిజం దాచాడు. మహేంద్ర చెప్పేందుకు ప్రయత్నించినా.. అప్పుడు ఒక ఫ్రెండ్ ని మోసం చేయడం క్షమించరాని నేరం అని అంటాడు రిషి. గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడతాడు.
ఎప్పటికీ గౌతమ్ ని క్షమించలేను అని రిషి అంటాడు. కారణాలు ఏవైనా నేను ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జగతి ఎంత చెప్పినా నేనే వినిపించుకోకుండా, నేనే వినకుండా వెళ్లిపోయాను. గౌతమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు పాపం రిషి గౌతమ్ అని మహేంద్ర అంటే.. గౌతమ్ నిజం దాచడం చాలా పెద్ద తప్పు డాడ్ అని రిషి అంటాడు.