For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: జగతిపై చక్రపాణి ఉగ్రరూపం.. తల్లికొడుకులను అనరాని మాటలంటూ షాకింగ్ గా!

  |

  దేవయానికి కాల్ చేస్తాడు రిషి. అందరినీ ఒకసారి పిలవమని చెబుతాడు. అందరు వచ్చాక.. వసుధార ఏ క్షణంలోనైనా మనల్ని బయలుదేరమని చెప్పొచ్చు రెడీగా ఉండండని రిషి చెబుతాడు. దీంతో ఇంట్లో అందరూ సంతోషపడితే.. దేవయాని మాత్రం షాక్ అవుతుంది. మొత్తానికి రిషి గుడ్ న్యూస్ చెప్పాడని ఫణీంద్ర అంటే.. ఏం తీసుకెళ్లాలని మహేంద్ర అంటాడు. జగతి-మహేంద్ర సంతోషం చూసి కళ్లుకుంటుంది దేవయాని. లాడ్జిలో ఉన్న రిషి.. వసుధార ఫొటో చూస్తూ వసుధార.. నీ రాక నా జీవితంలో అద్భుతం. లేదు నువ్వే ఒక అద్భుతం అని అనుకుంటాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ డిసెంబర్ 30, 2022 శుక్రవారం నాటి తాజా ఎపిసోడ్​ 647లో ఏం జరిగిందో చదివేసేయండి.

  నువ్వేంటి ఇక్కడ..

  నువ్వేంటి ఇక్కడ..

  వసుధార ఫొటో చూస్తూ ఆమె గురించి రిషి మాట్లాడుకుంటూ ఉంటాడు. గలగల మాట్లాడుతుంది కొత్త కొత్త విషయాలు చెబుతుంది. చిన్న పిల్లల జ్ఞాపకాలు చెప్పి మురిసిపోతుంది. అంతలోనే గంభీరంగా మాట్లాడుతుంది. వసుధార నా జీవితంలోకి వచ్చాకా నా ప్రపంచమే మారిపోయింది. కానీ ఏంటో డల్ గా కనిపిస్తోంది. నా దగ్గర ఏమైనా దాస్తోందా.. అనుకుంటాడు రిషి. ఇంతలో తలుపు కొట్టిన సౌండ్ వినపడటంతో కాఫీ ప్లీజ్ అంటాడు రిషి. డోర్ దగ్గర రాజీవ్ ని చూసి షాక్ అవుతాడు రిషి. నువ్వేంటి ఇక్కడ అని రిషి అంటే.. ఇది మా మావగారి ఊరు. మీరే ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నారా అంటూ కూల్ గా మంచంపై పడుకుని మీరేందుకు వచ్చారు అని అడుగుతాడు.

  మీ డియరెస్ట్ స్టూడెంట్ పెళ్లి..

  మీ డియరెస్ట్ స్టూడెంట్ పెళ్లి..

  రాజీవ్ అడిగిన ప్రశ్నకు అది నీకు అనవసరం అని రిషి అంటాడు. అలా అంటే ఎలా.. లోక కల్యాణం కోసం కొన్ని తెలుసుకోవాలి కదా.. అయినా మీకింకా నాపై కోపం పోలేదు అని రాజీవ్ అంటే.. ఎక్కువ మాట్లాడుతున్నా వ్ అని రిషి అంటాడు. అయినా అందరూ నన్ను తక్కువ మాట్లాడతావ్ అంటారే.. ఈ ఒక్కసారికీ కాస్త ఎక్కువగానే మాట్లాడుతాను రిషి సార్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అని రాజీవ్ అంటే.. షటప్ అండ్ గెటవుట్ అని రిషి అరుస్తాడు. శుభవార్త చెబుదామని వచ్చాను. మీ డియరెస్ట్ స్టూడెంట్ వసుధార పెళ్లి వార్త కూడా వినరా అని రాజీవ్ అంటాడు. తన పెళ్లితో నీకు సంబంధం లేదు అని రిషి అంటాడు. నాకేం సంబంధం లేదా.. అసలా పెళ్లిలో పెళ్లి కొడుకుని నేనే కదా సార్ అని రాజీవ్ అంటే.. రిషి కోపంతో రాజీవ్ కాలర్ పట్టుకుంటాడు.

  నాకు అధికారం ఉండదా...

  నాకు అధికారం ఉండదా...

  పిచ్చిపిచ్చిగా మాట్లాడవంటే చంపేస్తాను అని అంటాడు రిషి. అయినా కూడా రాజీవ్ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. రిషి కోపంతో రాజీవ్ ను బయటకు గెంటేస్తాడు. వసుధార మెడలో తాళిబొట్టు చూస్తే అప్పుడు నమ్ముతావేమో కదా రిషి సార్ అని రాజీవ్ అంటాడు. తర్వాత కోపంగా వెళ్లి వసుధార ఫొటో చూసి వాడు ఏం మాట్లాడుతున్నాడో విన్నావా వసుధార. మనిద్దరం ఒకటే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని అనుకుంటాడు రిషి. మరోవైపు వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు చక్రపాణి కూల్ గా మాట్లాడుతూ సుమిత్ర కూతురు పెళ్లి విషయంలో నాకు అధికారం ఉండదా.. ఎవరు మంచివాడు, చెడ్డవాడు, కూతురికి తగినవాడిని చూసే హక్కు లేదా అంటాడు. చక్రపాణి కూల్ గా మాట్లాడటం చూసి వసుధార.. రిషి ఫొటో చూపించడం గురించి చెబుతుంది.

  ఈ పెళ్లి మాత్రం ఒప్పుకోను..

  ఈ పెళ్లి మాత్రం ఒప్పుకోను..


  అమ్మాయి చూపించిన అబ్బాయి చాలా బాగున్నాడు అని సుమిత్ర అనడంతో ఒక్కసారిగా సీరియస్ అవుతాడు చక్రపాణి. కొంచెం కూల్ గా మాట్లాడేసరికి నీకు చులకన అయ్యానా అని గట్టిగా అరుస్తాడు. తన గదిలో కూర్చున్న వసుధార.. జగతి ఇచ్చిన గిఫ్ట్ ను తెరచి చూడగా అందులో మంగళసూత్రం ఉంటుంది. అది చూసి షాక్ అయిన వసుధార తర్వాత సంతోషపడుతుంది. ఇంతలోనే చక్రపాణి కోపంతో వసుధార గదిలోకి వస్తాడు. ఏంటమ్మా పెళ్లికి ఒప్పించమని మీ అమ్మని రాయబారిగా పంపించావా అని అడుగుతాడు. మీరు మీరు ఏం మాట్లాడుకున్నా నాకు అక్కర్లేదు. నేను ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను అని చక్రపాణి అనడంతో వసుధార షాక్ అవుతుంది.

  ఊరు పేరు లేని వాడు కాదు..

  ఊరు పేరు లేని వాడు కాదు..

  నాన్న నేను మీ పెద్దరికం గౌరవిస్తాను. కానీ నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు అని వసుధార అంటుంది. దీంతో వసుధారను ఏం అనలేక సుమిత్రపై సీరియస్ అవుతాడు చక్రపాణి. ఇంతలో జగతి కాల్ చేస్తుంది. అప్పుడు వసుధార చేతిలో నుంచి ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేస్తాడు. వసుధార అక్కడ అంతా ఓకేనా అని జగతి అడగడంతో.. వెంటనే చక్రపాణి గట్టిగట్టిగా అరుస్తాడు. అమ్మ తల్లి టీచరమ్మా అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. రిషి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. అప్పుడు ఊరు పేరు లేని వాడు కాదు.. రిషి నా కొడుకు.. డీబీఎస్టీ కాలేజ్ ఎండీ అని చెప్పడంతో చక్రపాణి షాక్ అవుతాడు.

  నా కన్న కొడుకు..

  నా కన్న కొడుకు..

  ఏం స్కెచ్ వేశావ్ టీచరమ్మా.. అసలు నీ మొగుడు ఎవడో.. నీ సంసారం ఏంటో.. అసలు నీ ఊరు ఏంటో నీకే తెలియదు. ఎవరినో తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పిన నా కూతురు గొంతు కోస్తున్నావా అని అంటాడు చక్రపాణి. చక్రపాణి గారు మర్యాదగా మాట్లాడండి.. రిషి నా కన్న కొడుకు అని జగతి అనడంతో.. అయితే ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను అని అంటాడు వసుధార తండ్రి చక్రపాణి.

  English summary
  Guppedantha Manasu Serial December 30 2022 Today Full Episode 647
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X