twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: తండ్రి ముందే రిషితో వసుధార రొమాన్స్.. షాక్ అయిన కాలేజీ స్టాఫ్!

    |

    చెరువులో పడవలు వేసేందుకు జగతి-మహేంద్రతో రిషి వస్తాడు. అలాగే తండ్రి చక్రపాణితో కలిసి వసుధార కూడా వస్తుంది. వసుధార, రిషి ఇద్దరు నీటిలో పడవలు వదిలి మనసులో కోరికలు కోరుకుంటారు. రిషితో మళ్లీ కలిసి ఉండాలని వసుధార కోరుకుంటుంది. ఇలా ఇద్దరు కళ్లు మూసుకుని కోరికలు కోరుకుని తెరిచేసరికి ఆ రెండు పడవలు ఒక్క దగ్గర చేరుతాయి. అది చూసిన రిషి, వసుధార ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. వాళ్లను చక్రపాణి, జగతి, మహేంద్రలు కూడా చూసి షాక్ అవుతారు. అప్పుడు రిషి ఈ పొగరు ఏంటీ ఇక్కడికి వచ్చింది. ఇద్దరు ఏం కోరుకున్నారో అని మనసులో అనుకుంటారు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ ఫిబ్రవరి 2 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 676లో ఇంకా ఏం జరిగిందంటే?

     మాటలు గానే మిగిలిపోయాయి..

    మాటలు గానే మిగిలిపోయాయి..

    చెరువు గట్టుపై ఉండి వసుధార, రిషి అలా కొద్దిసేపు చూసుకుంటారు. ఇంతలో రిషితో మాట్లాడేందుకు వసుధార అటువైపు వెళుతుంది. ఏంటీ సర్ ఇక్కడికి వచ్చారు అని వసుధార అడిగితే.. ఏం రాకూడదా.. ఈ చెరువు ఏమైనా నీదా.. అని అంటాడు రిషి. ఏం లేదు సార్.. అని వసుధార అంటే.. ఒకరు చెప్పారు ఇక్కడ కోరికలు కోరుకుని పడవలు వదిలేస్తే అవి జరుగుతాయని అని రిషి అంటాడు. దానికి మరి ఆ చెప్పిన వ్యక్తి రాలేదా అని వసుధార అడిగితే.. ఆ చెప్పిన వారు ఇంకా చాలా మాటలు చెప్పారు. కానీ అవన్నీ మాటలు గానే మిగిలిపోయాయి అని రిషి అంటాడు. తర్వాత ఆ పడవలు కలిసి వెళుతుంటే అవి చూసి ఈ పడవలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో కదా అని వసుధార అంటుంది. మనుషులే ప్రయాయమం చేయడం లేదు కదా.. ఇంకా ఆ పడవలు ఎంత చెప్పు అని రిషి అంటాడు.

     చూసి నడవాలి కదా..

    చూసి నడవాలి కదా..

    పడవపై రిషి సార్ ఏం రాసుంటారు అని వసుధార అనుకుంటూ వెనక్కి చూస్తుంది. రిషి కూడా పడవపై వసుధార ఏం రాసిందో తెలుసుకోవాలని ఉంది అనుకుంటూ వెనక్కి చూస్తాడు. ఏంటీ సార్ వెనక్కి చూస్తున్నారు అని వసుధార అడిగితే.. అదేం లేదు అన్న రిషి.. మరి నువ్వెందుకు వెనక్కి చూశావ్ అని రిషి అంటాడు. ఏం లేదు అని చెప్పిన వసుధార.. సార్.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి ఒక ఐడియా ఉందని చెబితే.. కాలేజీలో మాట్లాడదాం అని రిషి అంటాడు. తర్వాత రిషి షూస్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళితే.. అక్కడ ముల్లు ఉంటాయి. అది చూసిన వసుధార వచ్చి ఆ ముల్లు తీసి పడేస్తుంది. అప్పుడు వసుధార చేతికి ముల్లు గుచ్చుకుని అరుస్తుంది. దానికి ఏమైంది అని రిషి అడిగితే.. ఏం లేదు సార్ అని వసుధార అంటుంది. చూసి నడవాలి కదా అని రిషి అంటాడు. హా చూసి నడవాలి అట అని వసుధార మనసులో అనుకుంటుంది.

    సంజాయిషీ అవుతుంది నాన్న..

    సంజాయిషీ అవుతుంది నాన్న..

    రిషి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు తూలి పడబోతుంటే.. వసుధార వచ్చి పట్టుకుంటుంది. అలా ఇద్దరు కొద్దిసేపు కళ్లలో కళ్లు పెట్టి చూసకుంటారు. అక్కడ తండ్రి చక్రపాణి, జగతి-మహేంద్ర ఉన్న విషయం మరిచిపోయి మరి రొమాన్స్ సాగిస్తారు. తర్వాత ఇద్దరూ తేరుకుంటారు. షూస్ వేసుకుని వెళ్లండి సార్ అని వసుధార అంటుంది. రిషి కారు దగ్గరికి వెళతాడు. ఇంతలో వసుధార దగ్గరికి తండ్రి చక్రపాణి వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు నిజం చెప్పేద్దాం అంటే.. వద్దు నాన్నా.. మనం చెబితే.. సంజాయిషీ అవుతుంది అని చెప్పి వద్దంటుంది వసుధార. తర్వాత అక్కడి నుంచి అందరు వెళ్లిపోతారు. మరోవైపు ఇంట్లో వీళ్లందరూ ఎక్కడికి వెళ్లారు అంటూ ధరణిపై కోప్పడుతుంది. ఇంతలో మహేంద్ర-జగతి ఎంట్రీ ఇవ్వడం చూసి.. ఏంటో ఆది దంపతులు పొద్దున్నే అని అంటుండగా.. రిషి వస్తాడు. రిషిని చూసి షాక్ అయి అలాగే ఆగిపోతుంది దేవయాని.

    రిషికి వసుధార నుంచి మెసేజ్..

    రిషికి వసుధార నుంచి మెసేజ్..

    పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు అని నిలదీస్తుంది దేవయాని. ఇంతలో ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే అడగాలా అని ఫణీంద్ర అంటాడు. మళ్లీ జగతి-మహేంద్రను అడగడంతో.. ఏం లేదు వదినగారు.. కాస్తా మనశ్శాంతి దొరుకుతుందేమో అని బయటకు వెళ్లాం అని మహేంద్ర అంటే.. దొరికిందా మరి. ఆ వసుధారను కాలేజీ నుంచి పంపిస్తే కానీ ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు అని దేవయాని అంటుంది. వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్.. తీయడం కుదరదు అని రిషి అంటాడు. ఇంతలో వసుధార నుంచి రిషికి మెసేజ్ వస్తుంది. కాలేజీలో మీటింగ్ అరెంజ్ చేయమని ప్రాజెక్ట్ హెడ్ గా చెప్పారు అని రిషి చెబుతాడు. తను మనకు ఆర్డర్ వేసే వరకు వచ్చిందా.. అంటూ వసుధారను దేవయాని ఏదేదో అంటే అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. తర్వాత జగతి-మహేంద్ర, ఫణీంద్ర అందరూ కాలేజీకి వెళ్తామని చెప్పి వెళ్లిపోతారు.

    ఒట్టు వేయించుకున్న వసుధార..

    ఒట్టు వేయించుకున్న వసుధార..

    మరోవైపు వసుధార తండ్రి చక్రపాణి.. రిషిధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్లు ఇలాగే ఉంటే అపార్థాలతో దూరం అయిపోతారు. ఏం చేయాలా అనుకుంటూ రిషికి కాల్ చేస్తాడు. వసుధార మెడలో తనకు తానే తాళి కట్టుకుందని ఫోన్ లో గట్టిగా చెబుతాడు చక్రపాణి. కానీ ఫోన్ సిగ్నల్ సమస్య వల్ల రిషికి వినపడదు. ఇంతలో వసుధార వచ్చి చక్రపాణి ఫోన్ కట్ చేస్తుంది. మళ్లీ రిషి కాల్ చేయడంతో.. ఫోన్ కట్ చేసి రాంగ్ నెంబర్ అని మెసేజ్ పెడుతుంది. తర్వాత నాన్న ప్లీజ్ నేను చెప్పేది వినండి.. నన్ను అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు ఇలా చేయకండి. రిషి సార్ అంతట తానే నిజం తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకండి అంటూ తన మీద ఒట్టేపించుకుంటుంది వసుధార. దీంతో ఏం చేయలేక అలా సైలెంట్ గా ఉండిపోతాడు చక్రపాణి.

     షాక్ అయిన కాలేజ్ స్టాఫ్..

    షాక్ అయిన కాలేజ్ స్టాఫ్..

    మరోవైపు రాజీవ్ కి కాల్ చేస్తుంది దేవయాని. ఎక్కడ ఉన్నావ్ అని దేవయాని అడిగితే.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నానని సమాధాం చెబుతాడు రాజీవ్. నిన్ను నమ్ముకున్నందుకు ఒక్క పని కూడా చేయలేదు. అని ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు కాలేజీలో మీటింగ్ జరుగుతోంది. అక్కడకు వెళ్లి వసుధార పరువు తీయాలని చెబుతుంది దేవయాని. దీంతో నేరుగా కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళతాడు రాజీవ్. జగతి-మహేంద్ర, ఫణీంద్రలను పలకరిస్తాడు. మీరు మంచి వాళ్లు మీకు మంచే జరుగుతుంది అంటూ మాట్లాడతాడు రాజీవ్. ఇతను ఇక్కడికి వచ్చాడేంటీ మహేంద్ర అని జగతి అంటే.. అదే నాకు అర్థం కావట్లేదు అని మహేంద్ర అంటాడు. నా భార్య వసుధార ఎక్కడుంది.. మీ అందరికీ నేను ఎవరో తెలియదు కదా.. వసుధార నా భార్య అని రాజీవ్ చెప్పడంతో.. అక్కడున్న కాలేజీ స్టాఫ్ అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

    English summary
    Guppedantha Manasu Serial February 2 2023 Today Full Episode 676
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X