twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: పంతం నెగ్గించుకున్న దేవయాని.. విడిపోయిన రిషి-ధార, కుమిలిపోతున్న ప్రేమజంట!

    |

    పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రిషి.. వసుధార బతిమిలాడుకుంటాడు. ఒకే ఒక్కటి అడుగుతాను. ఒక్కటి చెప్పు వసుధార. ఆ తాళి ఎవరు కట్టారో చెప్పు అని రిషి ఎంతో ఆవేదనగా అడుగుతాడు. అప్పుడు వసుధార జరిగింది అంతా తలుచుకుంటూ ఉంటుంది. రిషిని ఊహించుకుంటూ ఆ తాళిని తన మెడలో వేసుకోవడం గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత నా ఇష్టంతోనే ఈ తాళి నా మెడలో పడింది.

    మనస్ఫూర్తిగానే నాకు ఈ పెళ్లి జరిగింది. ఇక ఇంతతకుమించి చెప్పాల్సింది ఏం లేదు. మీకు దండం పెడతాను సర్.. ఇక రాకండి అని వసుధార కూడా ఎంతో బాధగా చెబుతుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 10 మంగళవారం నాటి తాజా ఎపిసోడ్‌ 656లో ఇంకా ఏం జరిగిందంటే?

    గడిపిన క్షణాలను తలుచుకుంటూ..

    గడిపిన క్షణాలను తలుచుకుంటూ..

    రిషి అంతలా అడిగి సరికి రిషి మెడలో తాళి కట్టినట్లు ఊహించుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది వసుధార. తర్వాత ఈ తాళి నా ఇష్ట ప్రకారమే పడిందన్న వసుధార మాటలకు రిషి గుండె బద్దలవుతుంది. వసుధారకు తన మనస్ఫూర్తిగానే పెళ్లి జరిగింది అని చెప్పడంతో రిషి ఉక్కిరిబిక్కిరి అవుతాడు. వసుధార చెప్పింది నిజమే అయినా తను చెప్పిన విధానంతో మాత్రం రిషికి గుండె పగిలినంత పని అవుతుంది.

    తడబడిన అడుగులతో వెనక్కి ఎంతో బారంగా, బాధగా వెళ్లిపోతాడు రిషి. అదంతా రాజీవ్ వింటాడు. వసుధారతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ బాధగా కారులో బయలు దేరతాడు రిషి. తర్వాత మంగళవారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

    థ్యాంక్యూ మేడమ్..

    థ్యాంక్యూ మేడమ్..

    మంగళవారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో.. శూన్యంలోకి చూస్తూ అంతా కోల్పోయినట్లుగా ఇంట్లోకి మెల్లిగా అడుగులు వేస్తాడు రిషి. రిషిని చూసి బాధతో ఎలా ఉన్నావో చూడు అని తండ్రి మహేంద్ర అంటాడు. ఉన్నాను కదా డాడ్ అని రిషి అంటాడు. దీంతో అదికాదు రిషి అని జగతి అంటే.. నాకేం చెప్పకండి మేడమ్.. మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకొచ్చినందుకు అప్పుడప్పుడు మనసులో మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను.

    ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలా మేడమ్.. తను జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పించింది. థ్యాంక్యూ మేడమ్ అని ఎంతో బాధగా, కోపంగా చెబుతాడు రిషి. రిషి అలా అనడం చూసి దేవయాని తను అనుకున్నది జరిగిందని సంతోషపడుతుంది. మరోవైపు జైల్లో వసుధార కుమిలిపోతూ ఉంటుంది.

    సోమవారం నాటి ఎపిసోడ్ లో..

    సోమవారం నాటి ఎపిసోడ్ లో..

    దేవయాని ఇంటికి రావడంతో మీకు రిషి ఏమైనా ఫోన్ చేశాడా అని అడుగుతుంది జగతి. దీంతో అదేంటి మీతోపాటు రాలేదా అని దేవయాని అడుగుతుంది. లేదు వదిన గారు రిషి మాకంటే ముందు కారులో బయలుదేరాడు. ఇక్కడకు వచ్చాడనుకున్నాం అని మహేంద్ర అంటాడు. అందుకు ఏంటీ మహేంద్ర మీకు బుద్ధి లేదా అంటూ జగతి, మహేంద్రలపై సీరియస్ అవుతుంది దేవయాని.

    రెండు కార్లు ఉన్నాయి కదా.. రిషిని కూడా మీతోపాటు పిలుచుకుని రావొచ్చు కదా అనడంతో.. మేము ఆ పరిస్థితిలో ఏం చెప్పినా రిషి వినిపించుకోలేదు వదిన అని మహేంద్ర అంటాడు. అంతా రిషిపై నెట్టకండి అని దేవయాని అంటుంది.

    రిషికి ఏమైనా జరగాలి..

    రిషికి ఏమైనా జరగాలి..

    ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్లి వస్తున్నారని దేవయానిని మహేంద్ర అడుగుతాడు. అందుకు తడబడుకుంటూ ఏవో ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అని చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే మహేంద్ర-జగతి అనుమానంగా చూస్తారు. ఏంటీ అలా చూస్తున్నారు అని దేవయాని అనేలోపు.. ఫణీంద్ర ఎంట్రీ ఇస్తాడు. రిషి గురించి ఫణీంద్రకు మహేంద్ర అంతా చెప్పేస్తాడు.

    దీంతో జరిగింది ఏదో జరిగిపోయింది.. వసుధార వాళ్ల జోలికి మనం పోవాల్సిన అవసరం లేదని దేవయాని అంటుంది. తర్వాత రిషి గురించి మాట్లాడుతూ రిషికి ఏమైనా జరగరానిది జరిగితే మీ సంగతి చెబుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని.

    రిషిని కూడా చంపేస్తాను..

    రిషిని కూడా చంపేస్తాను..

    మరోవైపు వసుధార కోసం జైలుకు వెళతాడు రిషి. ఎందుకు వసుధార ఇలా చేస్తున్నావ్. అసలు ఏమైందని బాధపడతాడు. నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్లను. నాకు ఆ సమాధానం తెలియాలి అని అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి బయట ఉండటం చూసిన రాజీవ్ వసుధార దగ్గరికి వెళ్లి మీ రిషి సార్ మళ్లీ వచ్చాడు అని అంటాడు. మళ్లీ ఎందుకు వచ్చారని అనుకుంటుంది వసుధార.

    దీంతో రిషి సార్ కి నేను నిజం చెప్పేస్తాను అనడంతో ఏంటీ వసుధార అలా చెబితే ఒంటరిదానివి అయిపోతావ్ అని రాజీవ్ అంటాడు. మీ అమ్మా నాన్న ఆస్పత్రిలో ఉన్నారు. వాళ్లతోపాటు రిషి ని కూడా చంపేస్తాను. దీంతో ఒంటరిదానివి అవుతావ్ కదా అని బెదిరిస్తాడు రాజీవ్.

    రిషిధార నుంచి విడిపోయిన ధార..

    ఇంతలో అక్కడికి ఎస్సై వస్తాడు. వసుధారతో ఒక్క నిమిషం మాట్లాడతానని అడుగుతాడు రిషి. రిషి ఎంత అడిగిన ఎస్సై ఒప్పుకోడు. నీకు బుద్ది లేదు.. ఆమెకు బుద్ది లేదు అనగానే ఎస్సై కాలర్ పట్టుకుంటాడు రిషి. చూస్తే మంచివాడిలా ఉన్నావ్ ఎందుకు ఇదంతా అని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు ఎస్సై. తర్వాత వసుధారతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంతో వెళ్లి వసుధారను అడుగుతాడు రిషి. ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే జరిగింది అని చెప్పడంతో షాక్ అయిన రిషి గుండె ముక్కలవుతుంది.

    బాధగా వెనుదిరిగి వెళ్లిపోతాడు రిషి. రాజీవ్ నవ్వుకుంటాడు. నన్ను క్షమించండి సార్ అని వసుధార అనుకుంటే.. క్షమించరాని తప్పు చేశావ్ వసుధార అని రిషి బాధపడతాడు. జైలు గోడపై రిషిధార అని పేరు రాసిన వసుధార అందలో ధార అనే పదాన్ని కొట్టివేస్తుంది.

    English summary
    Guppedantha Manasu Serial January 10 2023 Today Full Episode 656..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X