For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: హార్ట్ టచింగ్ గా ఎపిసోడ్.. కూతురి కాళ్లపై పడిన తండ్రి చక్రపాణి, బాధలో రిషి!

  |

  ఆస్పత్రిలో వసుధార రిషి గురించి ఆలోచిస్తూ ఉంటే.. కాలేజీలో తన క్యాబిన్ లో వసుధార ఇలా ఎలా చేసింది అనుకుంటూ రిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరికొకరు వారు కలిసిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటారు. రిషి సార్ కి కాల్ చేద్దాం అని వసుధార అనుకుంటే.. వసుధార గొంతు వినక ఇన్ని గంటలైందా.. కాల్ చేస్తే మాట్లాడుతుందా అని అనుకుంటాడు రిషి. తర్వాత నేను కాల్ చేస్తే సార్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అని అనుకున్న వసుధార తన తండ్రి చక్రపాణి ఇచ్చిన ఫోన్ నుంచి రిషికి కాల్ చేస్తుంది. మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 14 శనివారం నాటి తాజా ఎపిసోడ్‌ 659లో ఇంకా ఏం జరిగిందంటే?

  వసుధార అంటూ రిషి..

  వసుధార అంటూ రిషి..

  రిషి సార్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. అందుకే నాన్న సెల్ నుంచి కాల్ చేస్తాను. రిషి సార్ గొంతుని నా ఫోన్ లో సేవ్ చేసుకుంటాను అని అనుకుంటుంది వసుధార. తండ్రి చక్రపాణి ఫోన్ నుంచి రిషికి కాల్ చేస్తుంది వసుధార. ఏదో కొత్త నెంబర్.. ఇప్పుడు మాట్లాడటం అవసరమా అని అనుకుంటాడు రిషి. తర్వాత ఏదైనా అవసరం అయితే అనే ఆలోచనతో కాల్ లిఫ్ట్ చేస్తాడు రిషి. వసుధార ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి రిషి వాయిస్ సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరు.. ఎవరు.. అంటూ ఒక్కసారిగా వసుధార అని పిలుస్తాడు రిషి. దీంతో తన పేరు చెప్పేసరికి వసుధార షాక్ అవుతుంది. ఫోన్ చేసి ఎవరో మాట్లాడరే అని రిషి అంటాడు. దీంతో కాల్ కట్ చేస్తుంది వసుధార.

  గంధపు చెక్క.. విషపు మొక్క..

  గంధపు చెక్క.. విషపు మొక్క..

  ఏంటీ కట్ చేశారనుకుని తిరిగి వసుధారకు కాల్ చేస్తాడు రిషి. అమ్మో రిషి సార్ కాల్ చేస్తున్నారు.. రాంగ్ నెంబర్ అని చెబుదామా.. వద్దు నా గొంతు గుర్తుపడతారు అని అనుకున్న వసుధార.. పక్కనున్న నర్సుకు ఫోన్ ఇచ్చి రాంగ్ నెంబర్ అని చెప్పమంటుంది. నర్సు అలాగే చేస్తుంది. ఏమైనా ప్రాబ్లమా అని నర్సు అడిగితే లేదని చెబుతుంది వసుధార. తర్వాత హాస్పిటల్ బిల్ కట్టేందుకు వసుధార వెళ్తుంది. రిషీంద్ర భూషణ్ అనే వ్యక్తి బిల్లు కట్టారని చెబుతారు. రిషి సార్ కట్టడం ఏంటని వసుధార ఆలోచిస్తుంటే అప్పుడు జరిగినదంతా వివరిస్తాడు తండ్రి చక్రపాణి. దీంతో సంతోషపడుతుంది వసుధార. తనెంటో తన మంచితనం ఏంటో కళ్లారా చూశానమ్మ. గంధపు చెక్క ఏదో.. విషపు మొక్క ఏదో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. తొందరగా వెళ్లి రిషి సార్ ను కలుసుకో అమ్మా అని అంటాడు తండ్రి చక్రపాణి.

  ఎన్ని సార్లు చెప్పినా మారరా..

  ఎన్ని సార్లు చెప్పినా మారరా..

  మరోవైపు కాలేజీలో మీటింగ్ గురించి మాట్లాడుకుంటారు కాలేజీ స్టాఫ్. వసుధార వచ్చినప్పుడు జగతి మేడమ్ రాలేదు.. జగతి మేడమ్ వస్తున్నప్పుడు వసుధార రావట్లేదు. అసలు వసుధార ఎందుకు రావట్లేదు. వసుధారకు ఏమైంది. అసలు ఈ భూషణ్ ఫ్యామిలీనే ఇంతా అని అంటారు. ఇదంతా పక్కనుంచి విన్న జగతి కోపంగా మేడమ్ అని అరుస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మేడమ్. ఎన్ని సార్లు చెప్పిన మీ వరుస మారాదా. మీకు ఉద్యోగం ఇచ్చి.. జీతాలు ఇస్తుంటే భూషణ్ ఫ్యామిలీనే దూషిస్తున్నారా.. సాలరీలు ఇస్తున్నారు. కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా. మీరేం చిన్న పిల్లలు కాదు కదా మేడమ్. లెక్చరర్స్. ప్రతిసారి వసుధారను టార్గెట్ చేస్తూ మీ మాటలతో బళ్లెంలా తూట్లు పొడిచారు. వసుధార మనసును గాయపరిచారు. ఆమె మీ కూతురు లాంటిదే కదా మేడమ్ అని జగతి అంటుంది.

  జగతి మాటలు విన్న రిషి...

  జగతి మాటలు విన్న రిషి...

  మీరు ఎన్ని సార్లు మీ గురించి రిషికి ఒక్క కంప్లెయింట్ చేయలేదు. కాలేజీ పరువుకు భంగం కలుగకూడదని ఊరుకుంది. వసుధార ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగింది. అలాంటి అమ్మాయిని ఎంకరేజ్ చేయాలని గానీ ఇదేంటి మేడమ్. ఒకరు బాధలో ఉన్నప్పుడు పాజిటివ్ గా చూడాలి కానీ ఇలా సబ్జెక్ట్ దొరికింది కదా అని మాట్లాడుకోవద్దు. అనవసరంగా సాటి స్త్రీని అవమానిస్తే మీకేం వస్తుంది. ఇది మానవత్వం అనిపించుకోదు. రాక్షసత్వం అనిపించుకుంటుంది అని జగతి అంటుంది. ఆ మాటలన్నీ పక్కనున్న రిషి వింటూ ఉంటాడు. తర్వాత కాలేజీ స్టాఫ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జగతి. వీళ్లు చేయాల్సింది అంతా చేసి మనల్ని అంటారేంటి అని ఓ కాలేజ్ స్టాఫ్ మేడమ్ అంటుంది.

  వసుధార కాళ్లపై పడిన తండ్రి..

  వసుధార కాళ్లపై పడిన తండ్రి..

  మరోవైపు ఆస్పత్రి నుంచి వాళ్ల ఇంటికి వెళతారు వసుధార, చక్రపాణి, సుమిత్ర. అప్పుడు ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండటంతో అది చూసి బాధపడుతూ ఉంటారు ముగ్గురు. తర్వాత రాజీవ్ అన్న మాటలు చేసిన పనులు గుర్తు తెచ్చుకున్న చక్రపాణి బాధపడుతాడు. చక్రపాణి దగ్గరికి వెళ్లిన వసుధార ఏం ఆలోచించొద్దు నాన్న అని చెబుతుంది. ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా.. జరిగింది చిన్న విషయం కాదు కదా అని చక్రపాణి అంటే.. వసుధార ఓదార్చుతూ ఉంటుంది. తర్వాత చక్రపాణి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి వసుధార కాళ్ల మీద పడతాడు. అయ్యే నాన్న ఏంటింది.. ముందు పైకి లేవండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది వసుధార.

  బిడ్డను కొట్టి బాధపడిన తల్లిలా..

  బిడ్డను కొట్టి బాధపడిన తల్లిలా..

  నన్ను క్షమించు వసుధార అని ఏడుస్తూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నానని అంటాడు చక్రపాణి. అప్పుడు చేతులు జోడించి క్షమించమని వసుధారను వేడుకుంటాడు చక్రపాణి. తర్వాత ఇంట్లో రాజీవ్ తో గొడవపడినప్పుడు రిషి వాచ్ పక్కన పడిపోయి ఉంటుంది. వాచీ పక్కన పెట్టాలని చూస్తుండగా తన మంగళసూత్రానికి వాచ్ తగులుకుంటుంది. వాచ్ రాకపోయేసరికి బంధం ఎప్పటికీ విడిపోదేమో అని అనుకుంటుంది వసుధార. తర్వాత ఇటు వసుధార.. అటు రిషి ఎవరికి వారే మాట్లాడుకుంటూ ఉంటారు. రాజీవ్ మాటలు, రిషి గొప్పతనాన్ని తలుచుకుని వసుధార బాధపడుతుంది. నేను ఒక లూజర్ ని, కానీ నువ్వు నాకు జెంటిల్ మెన్ అని పేరు పెట్టావ్ అని రిషి అనుకుంటాడు. మరోవైపు బిడ్డను కొట్టి బాధపడిన తల్లిలా ఉంది నా పరిస్థితి అని అంటుంది వసుధార. ఈ పొగరును క్షమించండి అని వసుధార అనుకుంటే.. నువ్వు నన్ను బాధపెట్టావని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా అని రిషి అనుకుంటాడు.

  English summary
  Guppedantha Manasu Serial January 14 2023 Today Full Episode 659
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X