Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Guppedantha Manasu: దేవయాని, రాజీవ్ లకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్.. వసుధార మెడలో తాళి!
వసుధారకు జగతి ఫోన్ చేసి మాట్లాడాక కోపంతో ఊగిపోతుంటాడు తండ్రి చక్రపాణి. అప్పుడే రిషి జగతి కొడుకు అని తెలుస్తుంది. దీంతో షాక్ అయిన చక్రపాణి ఆ పెళ్లి జరగనివ్వని భీష్మించుకుంటాడు. వసుధారను గదిలో బంధించి తలుపుకు తాళం వేస్తాడు. వసుధార దగ్గరి నుంచి ఫోన్ కూడా లాక్కుంటాడు. వసుధార తలుపు తీయమని బతిమాలాడుతుంది.
తలుపు తీస్తే పాడే ఎక్కుతాను అని మంచి నీళ్ల బాటిల్ లో విషం కలుపుకుంటాడు చక్రపాణి. తలుపు తీస్తే అది తాగి చస్తానని సుమిత్రను బెదిరిస్తాడు. ఇలా ఆసక్తికర కథా కథనంతో సాగుతోన్న బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరి గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 2, 2023 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 649 ప్రోమోలో ఏం జరిగిందో చదివేసేయండి.

వసు మెడలో తాళి..
గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 2 నాటి ఎపిసోడ్ ప్రోమోలో.. గదిలో వసుధార, రిషి ఇద్దరు ఉంటారు. వసుధార పెళ్లికూతురు దుస్తుల్లో ఉంటుంది. జగతి మేడమ్ ఇచ్చిన తాళిబొట్టును బాక్స్ లో నుంచి తీసి రిషికి ఇస్తుంది. కన్నీళ్లతో చాలా ఎమోషనల్ గా ఆ తాళి బొట్టును ఇస్తుంది వసుధార. తర్వాత వసుధార మెడలో ఆ తాళి బొట్టును రిషి వేస్తాడు.
బ్యాక్ గ్రౌండ్ లో మంగళవాయిద్యాలు వినిపిస్తుంటాయి. అప్పుడు వసుధార సంతోషంతో కనిపించినా సన్నివేశం మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ వసుధార మీది సార్ అని వసుధార అంటే.. మనసుకు హత్తుకుంటాడు రిషి. ఇద్దరు ఆనందంతో మురిసిపోతుండగా ప్రోమో ముగుస్తుంది.

శనివారం నాటి ఎపిసోడ్ లో..
వసుధార గదిలో ఉండి తలుపు తీయ్యమని బతిమిలాడుతూ ఉంటుంది. సుమిత్ర మాత్రం చక్రపాణి బెదిరించిన విషయం గుర్తు చేసుకుని భయపడుతుంది. నాన్న ఊరికే బెదిరిస్తున్నారు. అలా ఏం చేయరు అని సుమిత్ర వసుధారకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ వసుధార మాత్రం వినిపించుకోదు. నాన్న వస్తే బయటకు వెళ్లలేను. కనీసం ఫోన్ అయినా ఇవ్వమని అడుగుతుంది వసుధార. ఫోన్ ఇచ్చే సమయానికి చక్రపాణి పూలదండలు పట్టుకుని ఇంట్లోకి వస్తాడు. రాజీవ్ తో వసుధార పెళ్లి చేస్తున్నా అని చక్రపాణి చెబుతాడు. దీంతో వసుధార, సుమిత్ర ఇద్దరూ షాక్ అవుతారు.

ఫోన్ ఎంతకీ రాకపోయేసరికి..
గదిలో ఉన్న వసుధార మాత్రం రిషి సార్ నే పెళ్లి చేసుకుంటాను అని బతిమిలాడుతుంది. కానీ, చక్రపాణి మాత్రం తన మాట వినకపోతే విషం తాగి చస్తాను అని బెదిరిస్తాడు. దీంతో ఏం చేయలేక సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. చక్రపాణి ఇంట్లో పెళ్లికి అన్నీ రెడీ చేస్తూ ఉంటాడు. అది చూసి తలుపు తీయమని వసుధార వేడుకుంటుంది. ఇంతలో వసుధారకు రిషి ఫోన్ చేస్తాడు. వసుధార నుంచి ఫోన్ ఎంతటికి రాకపోయే సరికి వసుధారకు కాల్ చేస్తాడు రిషి. కానీ చక్రపాణి మాత్రం ఫోన్ ఇవ్వను అని గట్టిగా చెబుతాడు. రిషి చేసిన కాల్ ను లిఫ్ట్ చేస్తుంది సుమిత్ర. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది.
|
కంగారుగా ఫోన్ కట్ చేసి..
"ఏం జరుగుతుంది. మీ బావ వచ్చి ఏదేదో వాగి నీకు తనకు పెళ్లి అని అంటున్నాడు. నేను వస్తున్నాను. భయపడకు. మా వాళ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ బావ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడతాడు. అందుకే నువ్వు వద్దన్నా నేను మీ ఇంటికి వస్తున్నా" అని రిషి కంగారుగా చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో పంతుల్ని తీసుకుని రాజీవ్ ఇంట్లో అడుగుపెడతాడు. పెళ్లి ఏర్పాట్లు చూసి రాజీవ్ నవ్వుకుంటాడు. మీరు ఇంత కష్టపడి పెళ్లి చేస్తున్నారని చూసి సంబరపడిపోతాడు.