Don't Miss!
- News
KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్లో Aura ఫేస్లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Finance
Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Guppedantha Manasu: మళ్లీ వసుధార వెంటపడ్డ బావ రాజీవ్.. కాలేజీలో చేయిపట్టుకుని మరి అలా!
వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా బాధ్యతలు తీసుకుంటుంది. మరోవైపు వసుధారను ఎలాగైనా ఆపాలని దేవాయని-రాజీవ్ కలిసి మళ్లీ కుట్రలు మొదలు పెడతారు. రిషి వెళ్లిపోతాడు అనుకుంటే వెళ్లలేదు.. వసుధార మళ్లీ వచ్చింది. ఇప్పుడు వాళ్లిద్దరు కలిసిపోతారా అని టెన్షన్ తో రాజీవ్ కి కాల్ చేస్తుంది దేవయాని. రేయ్ ఎక్కడ చచ్చావురా అని దేవయాని అంటే.. రా.. ఏంటీ రా.. నా పేరులో రా ఉంది. కానీ విడిగా రా అంటే బాగోదు. మీ మీద గౌరవం ఉంది. దాన్ని అలాగే ఉండనివ్వండి అసలే మంటమీదున్నాను అని దేవయానిపై రాజీవ్ సీరియస్ అవుతాడు. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ జనవరి 23 సోమవారం నాటి తాజా ఎపిసోడ్ 667లో ఇంకా ఏం జరిగిందంటే?

ప్రాజెక్ట్ హెడ్ గా వసుధార..
రాజీవ్ అలా మాట్లాడేసరికి నేను అంతకంటే మంటమీద ఉన్నాను.. నీకు డబ్బిచ్చాను, అవకాశం ఇచ్చాను.. అయినా చెప్పినా పని చేయకుండా తిరుగుతున్నావ్. అందుకు నిన్ను సార్ అని పిలవాలా.. శాలువా కప్పి సన్మానం చేయాలా అని దేవయాని కోపంగా అంటుంది. అయితే దీనికంటే ముందుగా ప్రాజెక్ట్ హెడ్ కాలేజీలోకి అడుగుపెడుతుంది. జగతికి కాల్ చేసి రమ్మని చెబుతాడు రిషి. సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి షిప్ట్ అవ్వమని చెప్పండి. అలాగే పుష్ప తెచ్చింది.. ఈ క్యారియర్ ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని రిషి చెబుతాడు. నువ్ ఎంత మంచివాడివి.. గొడ్డలితో గంధం చెట్టును నరికినా.. ఆ పరిమళం గొడ్డలికి కూడా అంటుకుంటుంది అని జగతి అనుకుని వెళ్లిపోతుంది.

పుష్ప ఉన్న అలానే చేస్తాడు..
తర్వాత గౌతమ ఫ్లాట్ కీ, క్యారియర్ పట్టుకుని వసుధార దగ్గరికి వెళుతుంది జగతి. తను చెప్పేది వినమని వసుధార అంటే.. ప్రాజెక్ట్ హెడ్ గా ఏమైనా చెప్పు వింటాను, మిషన్ ఎడ్యుకేషన్ హెట్ గా మీకు సౌకర్యాలు కల్పించాలి కాబట్టి రిషి సార్ ఈ కీ ఇచ్చారు అని జగతి చెబుతుంది. రిషి సార్ కి నాపై ఎంతో శ్రద్ధ కదా అని వసుధార అంటే.. నీ ప్లేస్ లో పుష్ప ప్రాజెక్ట్ హెడ్ అయిన ఇలాగే చేస్తాడు రిషి సార్ అని జగతి అంటుంది. మీరేదో కోపంగా ఉన్నారు అని వసుధార అంటే.. ఎవరి కోపాలకు ఎవరినీ బాధ్యులం చేయగలం అని జగతి అంటుంది. తర్వాత మీరిప్పటికే జీవితంలో గొప్ప విజయాలు సాధించారు. మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వెళ్లిపోతుంది జగతి.

థ్యాంక్స్ చెబుదామని వచ్చా..
జరిగింది చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు.. రిషి సార్ కి నాపై ఎంత శ్రద్ధనో.. ఎంతైనా రిషి సార్ జెంటిల్మెన్ కదా అని వసుధార అనుకుంటుంది. తర్వాత రిషి ఉన్న గెస్ట్ హౌజ్ గదిలోకి వెళుతుంది వసుధార. సోఫా పై రిషి కూర్చుని ఉంటాడు. వసుధార రావడంతో లేచి నిల్చుంటాడు. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని రిషి అడిగితే.. ఫ్లాట్ కీస్ ఇచ్చినందుకు, ఎర్పాట్లు చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పి వెళదామని వచ్చాను సార్ అని అంటుంది వసుధార. అప్పుడు జగతికి ఇచ్చి కీ ఇవ్వమన్నది గుర్తు చేసుకుంటాడు రిషి. తర్వాత సార్ మనం మాట్లాడుకోవాలి అని వసుధార అంటుంది.

మనం అనుకోవడం కరెక్ట్ కాదు..
మనం మాట్లాడుకోవాలి అని వసుధార అనడంతో.. ఒక్కసారిగా కోపం తెచ్చుకుని ఆపు అన్నట్లుగా చేయి చూపుతాడు రిషి. మనం అనే పదం వాడకు.. వినలేకపోతున్నాను అని బాధగా అంటాడు రిషి. తర్వాత మనం అనుకోవడం కరెక్ట్ కాదేమో ఇప్పుడు అని రిషి అంటాడు. దీంతో బాధగా వెళ్లిపోతుంది వసుధార. అనంతరం వసుధార వెళ్లిపోతుండగా వెనుక నుంచి రాజీవ్ చేయి పట్టుకుంటాడు. వసు మనం బంధం అప్పుడే తెగిపోలేదు. ఒకసారి నీకు పెళ్లయిందని రిషి సార్ తో అన్నావ్ కదా అని రాజీవ్ అంటాడు. అప్పుడు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి నాకు జరిగిందన్న తన మాటలు గుర్తు చేసుకుంటుంది వసుధార.

రిషి సార్ ని దూరం చేయలేరు..
పెళ్లయిందని అన్నావ్ కదా ఇంకేముందు అని వసుధారతో రాజీవ్ అంటాడు. దీంతో షటప్.. రిషి సార్ ని నా నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదు అని వసుధార స్ట్రాంగ్ గా అంటుంది. దీంతో అలా చూస్తుండిపోతాడు రాజీవ్. దీంతో జనవరి 23 సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లోకి వెళితే.. కాలేజీలో పుష్పతో అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు రిషి. వసుధార భర్తను నువ్ చూశావా అని రిషి అడిగితే.. లేదు సార్ అని చెప్పిన పుష్ప.. అతనెవరో కానీ లక్కీ ఫెలో అంటుంది. వసుధార లాంటి అమ్మాయి భార్యగా దొరకడం అతని అదృష్టం అని చెబుతుంది.