twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: రిషిధారను అడ్డుకున్న రాజీవ్.. వసుధార గురించి అసలు నిజం రిషి తెలుసుకుంటాడా?

    |

    కళ్లు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావ్ అని గుర్తు చేసుకుంటాడు రిషి. మరోవైపు వీఆర్ అని ఉంగరాన్ని చూసుకుంటూ మాట్లాడుకుంటుంది వసుధార. రిషికి కాల్ చేస్తుంది. మినిస్టర్ గారికి దగ్గరికి వెళ్లాలి అనుకుంటున్నాను. మీరు కూడా నాతో వస్తారా అని అడుగుతుంది వసుధార. దీంతో రిషి ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు. తర్వాత కాలేజీ స్టాఫ్ ని పిలుస్తుంది వసుధార. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి చదవమని ఫైల్ ఇస్తుంది. ఇలా మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్‌ జనవరి 26 గురువారం నాటి తాజా ఎపిసోడ్‌ 670లో ఇంకా ఏం జరిగిందంటే?

    ఎవరి పని వాళ్లు చూసుకోండి..

    ఎవరి పని వాళ్లు చూసుకోండి..

    వసుధార ఇచ్చిన ఫైల్ లో చదవడానికి ఎముంది అని నిర్లక్ష్యంగా అంటారు కాలేజీ స్టాఫ్. ఇక్కడే ఫైల్ మొత్తం చదవండి అంటుంది వసుధార. అక్కడే కూర్చుని వసుధార పెళ్లి గురించి అసహ్యంగా మాట్లాడతారు. అవి విని ఫైర్ అవుతుంది వసుధార. నా పెళ్లి గురించి మీకు అనవసరం అని స్ట్రాంగ్ గా సమాధానం చెబుతుంది.

    ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదని ఇచ్చి పడేస్తుంది వసుధార. ఫైల్ చదివి అవగాహన పెంచుకోండి. మినిస్టర్ గారితో మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పేలా ఉండాలని క్లాస్ తీసుకుంటుంది వసుధార. అనంతరం కాలేజీ స్టాఫ్ తో కలిసి మినిస్టర్ గారి దగ్గరికి కారులో వెళుతుంది వసుధార.

    వసుధార పెళ్లి ప్రస్తావన..

    వసుధార పెళ్లి ప్రస్తావన..

    మినిస్టర్ దగ్గరకు వెళుతుండగా దారి మధ్యలో కారు చెడిపోతుంది. దీంతో ఏం చేయాల అని ఆలోచిస్తారు. క్యాబ్ బుక్ చేసుకుందాం అని అంటుంది వసుధారతో వచ్చిన మేడమ్. అప్పుడు మళ్లీ వసుధార పెళ్లి టాపిక్ తీసుకొస్తే అది చెప్పకుండా మాట దాటేస్తుంది వసుధార. ఇంతలో అదే దారిలో రిషి వస్తాడు. వసుధార వాళ్ల కారు ఆగిపోయిన విషయం తెలుసుకుని డ్రాప్ చేయడానికి రమ్మంటాడు.

    వసుధార ఏ సీట్ లో కూర్చుంటుందో అని ఆలోచిస్తాడు రిషి. వసుధార కూడా అదే ఆలోచనతో వెనుక సీట్ లో కూర్చుంటుంది. అప్పుడు రిషి-వసుధార ఇద్దరు బాధపడతారు. ఈలోగా వెనుకు కూర్చున్న కాలేజీ స్టాఫ్ మేడమ్ మళ్లీ వసుధార పెళ్లి గురించి తీసుకొస్తుంది. అసలే రిషి సార్ బాధపడుతుంటే ఈ మేడమ్ ఏంటో.. అనుకుంటుంది. ఈ టాపిక్ వదిలేయండి మేడమ్ అని చెబుతుంది వసుధార.

    నా భార్యను పంపిస్తారా..

    నా భార్యను పంపిస్తారా..

    మినిస్టర్ దగ్గరకు రిషి, వసుధార కారులో వెళుతుండగా అటు వైపు నుంచి రాజీవ్ తన కారుతో వచ్చి అడ్డంగా ఆపుతాడు. రాజీవ్ ను రిషికి ఏం చేయాలో తెలియక కారు ఆపుతాడు. అప్పుడు కారు ఆపొద్దు సార్.. పోనివ్వండి అని కంగారుగా అంటుంది వసుధార. తను వస్తున్నాడు కదా.. అలా ఎలా వెళ్లిపోతాం వసుధార అని కాస్త అసహనంగా అంటాడు రిషి. నాకు మీరు ఇంపార్టెంట్ సార్ అని వసుధార అంటుంది. దీంతో షాక్ అవుతాడు రిషి. తర్వాత ఇద్దరు కారు దిగి రాజీవ్ దగ్గరికి వెళతారు. రిషి సార్.. నా భార్యని నాతో పంపిస్తారా అని రాజీవ్ అంటే.. నేను రాను.. రిషి సార్ తోనే వెళతాను.. అని వసుధార అంటుంది.

    అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రిషి సైలెంట్ గా ఉండిపోతాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో మీకు తెలియాలి సార్.. చెబుతాను వినండి అని వసుధార అంటుంది. ఇదంతా చూస్తుంటే రిషికి వసుధార నిజం చెప్పే అవకాశం కనిపిస్తుంది... కానీ రాజీవ్ అలా చెప్పనిస్తాడో లేదో పూర్తి ఎపిసోడ్ వస్తే గానీ తెలియదు.

    బుధవారం నాటి ఎపిసోడ్ లో..

    బుధవారం నాటి ఎపిసోడ్ లో..

    చీకటిలో రిషి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటాడు. రిషి వెనుకే ఫాలో అవుతుంది వసుధార. అది గమనించిన రిషి.. నా వెనుక ఉన్నది నువ్వే అని తెలుసు.. ముందుకు రా అంటాడు రిషి. మాట్లాడాలి సార్ అని వసుధార అంటుంది. నాకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చేశాయి.. నన్ను విసిగించకు వెళ్లిపో అని కోప్పడతాడు రిషి. వసుధార అసలు విషయం చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా పట్టించుకోడు రిషి.

    ఎందుకు ఇలా చేశావో అర్థం కావడం లేదని బాధపడతాడు రిషి. తనను మాట్లాడనివ్వడం లేదని వసుధార ఫీలవుతుంది. రిషి ఓ బెంచ్ పై కూర్చుని ఎదురుగా కప్పులు పెట్టుకుని అందులో రాళ్లు విసురుతూ ఉంటాడు. వసుధార వచ్చి పక్కనే కూర్చుంటుంంది. దీంతో వెంటనే కోపంగా లేచి వెళ్లిపోతాడు రిషి. వసుధార బాధపడటంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు వసుధార మెడలో తాళి కనపడటంతో మళ్లీ బాధపడతాడు రిషి.

    కోపంలో మాట అన్నా ఓర్చుకో..

    కోపంలో మాట అన్నా ఓర్చుకో..

    ఈరోజు నేను చెబుతాను మీరు వినండి.. అని వసుధార అంటుంది. ఏం జరగనట్టు ఎప్పటిలా ఎలా మాట్లాడుతున్నావ్.. నీకెలా సాధ్యమవుతుందో అనుకుంటాడు రిషి. నాకోసం రెండు నిమిషాలు కేటాయించండి అని వసుధార అంటే.. ఈ టైమ్ లో మాట్లాడటం కరెక్ట్ కాదు.. వెళ్లు అని రిషి అంటాడు. గౌతమ్ సార్ ఫ్లాట్ వైపు మీరెందుకు వచ్చారని అడుగుతుంది వసుధార.. దీంతో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి.

    తర్వాత ఇంటికెళ్లిన వసుధార ఫోన్ పట్టుకుని రిషి అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతుంది. వసుధార కన్నీళ్లు చూసి తండ్రి చక్రపాణి ఓదార్చుతాడు. రిషి సార్ కోపంలో ఓ మాట అన్నా ఓర్చుకో అని చెబుతాడు. అపార్థాలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి తొలగించుకోకుంటే జీవిత ప్రయాణం ప్రమాదం తల్లీ.. ఆలస్యం చేయకు. జరిగినదంతా చెప్పు అంటాడు తండ్రి చక్రపాణి.

    వసుధార ఇలా ఎందుకు చేస్తుంది..

    నీవల్ల కాకపోతే నేను వెళ్లి వాళ్ల కాళ్ల పట్టుకుంటాను అని చెప్పి వసుధారకు ధైర్యం చెబుతాడు చక్రపాణి. నాకు అసలు చెప్పే అవకాశమే ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార. తర్వాత ఉదయం కాలేజీలో రిషి గురించి మాట్లాడుకుంటారు జగతి-మహేంద్ర. అనుకున్న దానికంటే రిషి తొందరగానే గాయం నుంచి బయటకొచ్చాడు అంటాడు మహేంద్ర.

    అందరినీ వదిలి వెళతానని చెప్పి మళ్లీ వెనక్కి రావడం ఆశ్చర్యకరమే కానీ కళ్లెదురుగా వసుధార కనిపిస్తే ఆ గాయం మరింత బాధ కలిగిస్తుంది అని అంటుది జగతి. అసలు వసుధార ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని, రిషి అందరికీ దూరంగా ఉంటున్నాడని బాధపడతాడు మహేంద్ర. రిషి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడమే తనకు మనం చేసే హెల్ప్ అని జగతి అంటుంది.

    English summary
    Guppedantha Manasu Serial January 26 2023 Today Full Episode 670
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X