For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 15 Episode: వసుధార సంచలన నిర్ణయం.. ఫ్యూచర్‌లో అదే అవుతానంటూ తేల్చేసింది

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ ధారావాహికలకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. రెస్టారెంట్‌లో గొడవ జరగడంతో రిషికి అమ్మాయిల గురించి తెలీదని వసు కోప్పడుతుంది. దీంతో ఆడవాళ్ల మనస్థత్వాలు తెలుసుకునేందుకు రిషి.. వసుకు ఫోన్ చేస్తాడు. కానీ, దాన్ని జగతి లిఫ్ట్ చేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న రిషి కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత అన్నం కూడా తినకుండా వెళ్లిపోతాడు. కాలేజ్‌లో ఈ విషయంపై జగతిని ప్రశ్నిస్తాడు.

  తల్లి కూడా ఆడదే అని తెలుసుకోవాలి

  తల్లి కూడా ఆడదే అని తెలుసుకోవాలి

  కాలేజ్‌లో ఎదురుపడిన జగతిని ‘ఎక్స్‌క్యూజ్ మీ' అంటూ ఆపుతాడు రిషి. అప్పుడు ‘మీకు మ్యాథ్స్‌లో గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ మేనర్స్ మాత్రం తెలియలేదు. పరాయి వాళ్ల ఫోన్ లిఫ్ట్ చేయకూడదని తెలీదా' అని అంటాడు. అప్పుడు జగతి ‘మీరు ఆడవాళ్ల గురించి తెలుసుకోవాలనుకోవడం మంచిది సార్. కానీ, మీ అమ్మ కూడా ఒక ఆడదే అని తెలుసుకోవాలి' అని పంచ్ వేస్తోంది.

  వసుధార నిర్ణయం కోసం వాళ్లు ఆసక్తి

  వసుధార నిర్ణయం కోసం వాళ్లు ఆసక్తి

  కాలేజ్‌లోని మీటింగ్ హాల్‌లో రిషి, జగతి, మహేందర్ సహా అందరూ కలిసి వసుధార ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చర్చలు జరుపుతుంటారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో దేశంలోని కాలేజ్‌ను ఎంపిక చేసుకుని.. ఆమె కూడా ఇదే సెలెక్ట్ చేస్తుందని అనుకుంటూ ఉంటారు. అందరూ ఆ పనిలో ఉండగా జగతి.. తల్లి గురించి తనతో అన్న మాటలను రిషి గుర్తు చేసుకుంటాడు.

  వసు సంచలన నిర్ణయం.. అంతా షాక్

  వసు సంచలన నిర్ణయం.. అంతా షాక్

  వాళ్లంతా మాట్లాడుకుంటుండగా వసుధార అక్కడకు వస్తుంది. రావడం రావడమే ఆమెను అందరూ ‘ఏ కాలేజ్‌లో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యావు? ఏ దేశం వెళ్లబోతున్నావు' అని అడుగుతారు. అప్పుడు వసు ‘నేను ఏ దేశంలో చదవాలనుకోవడం లేదు. మా మాతృ దేశంలోనే ఇక్కడే ఈ కళాశాలలోనే ఉంటాను' అని సమాధానం ఇస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

  వసు.. రిషి మధ్య హోరాహోరీ వాగ్వాదం

  వసు.. రిషి మధ్య హోరాహోరీ వాగ్వాదం

  వసుధార తీసుకున్న నిర్ణయానికి అందరూ అయోమానికి గురవుతారు. ఈ క్రమంలోనే రిషి ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అప్పుడన్నింటికీ సమాధానం చెప్పేసి వెళ్లిపోతుంది. దీంతో రిషి కూడా ఆమె వెంట వెళ్లి ఆపుతాడు. అప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా.. తిట్టినా.. సర్ధి చెప్పినా వసుధార మాత్రం అస్సలు వినదు.

  పాఠాలు చెబుతా... విలువలు నేర్పుతా

  పాఠాలు చెబుతా... విలువలు నేర్పుతా

  చెప్పి చెప్పి విసిగిపోయిన రిషి.. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని వసును ప్రశ్నిస్తాడు. దీనికి ఆమె ‘నేను పాఠాలు చెబుతాను. లెక్చలర్ అవ్వాలనేది నా కల. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే తప్ప గురువు కాలేరు. అవును నేను పాఠాలు చెబుతాను. విలువలు నేర్పుతాను. నాకు స్టేటస్‌లు ఏమీ వద్దు. కార్లు బంగ్లాలు వద్దు' అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.

  రిషి పాఠాలు.. వసు గుణపాఠాలు అంటూ

  రిషి పాఠాలు.. వసు గుణపాఠాలు అంటూ

  వసుధార మాటలను విన్న తర్వాత మహేందర్ ఆమెను అభినందిస్తాడు. జగతితో మాట్లాడుతూ ‘రిషి తనకు పాఠాలు చెబుతున్నా అనుకుంటున్నాడు. కానీ, తనే వాడికి గుణపాఠాలు చెబుతుంది. ఈ వయసులోనే ఇంత క్లారిటీతో ఉందంటే వసుధార చాలా గ్రేట్. తన నిర్ణయం నాకు కరెక్టే అనిపిస్తుంది' అని అంటాడు. దానికి జగతి కూడా సంతోష పడుతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Guppedantha manasu Serial Episode 190: Jagathi Gave Correct Answer to Rishi. Then Vasudhara Told about her Decision for Higher Studies. In That Time Rishi, Mahendar and Jagathi Was Shocked.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X