For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 22 Episode: వీడియోతో అడ్డంగా దొరికిన దొంగ.. వసు నిర్ణయానికి వాళ్లంతా షాక్

  |

  చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జగతి పంపిన స్వీట్‌ను తిన్న రిషి.. పదే పదే ధరణికి థ్యాంక్స్ చెబుతాడు. జగతి పుట్టినరోజు త్వరలోనే ఉందని తెలుసుకున్న వసుధార.. దాన్ని ఘనంగా చేయాలనుకుంటుంది. కానీ, దానికి ఆమె ఒప్పుకోదు. స్వీట్ విషయంలో రిషి.. ధరణిని దేవయాని ముందు ఇరికిస్తాడు. ఇక, వసుధారకు శిరీష్ ఫోన్ చేసి దొంగ దొరికేశాడనే న్యూస్ చెబుతాడు.

  శిరీష్ చెప్పిన చోటుకు వచ్చిన రాజీవ్

  శిరీష్ చెప్పిన చోటుకు వచ్చిన రాజీవ్

  దొంగ దొరికాడని శిరీష్ చెప్పడంతో అందరూ ఓ ఇంటికి వస్తారు. ఆ సమయంలో శిరీష్ ఏం చెబుతాడో అని అంతా వేచి చూస్తుంటారు. అంతలో రాజీవ్ అక్కడకు చేరుకుంటాడు. అప్పుడు వసుధార ‘ఏంటి బావ.. నువ్వు ఇక్కడికి వచ్చావు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శిరీష్ ‘నేనే ఆయనను ఇక్కడికి రమ్మన్నాను. దొంగ ఎవరో రాజీవ్ గారికి కూడా తెలియాలి కదా' అని సమాధానమిస్తాడు.

  Intinti Gruhalakshmi July 22nd Episode: తులసికి సాయం చేస్తానన్న నందూ.. లాస్య మరో కన్నింగ్ ప్లాన్

  దొంగ ఎవరో వీడియోలో చూపిన శిరీష్

  దొంగ ఎవరో వీడియోలో చూపిన శిరీష్


  కంగారు కంగారుగా ఉన్న రాజీవ్ ‘దొంగ ఎవరో త్వరగా చెప్పండి సార్' అంటూ శిరీష్‌ను అడుగుతాడు. అప్పుడు ముందు మీకే చెప్తానంటూ ఓ సీసీ టీవీ పుటేజ్ వీడియోను చూపిస్తాడు. అందులో రాజీవ్ ముఖానికి క్లాత్ కట్టుకుని.. డబ్బు దొంగిలించిన దృశ్యాలు కనిపిస్తాయి. దీంతో దొరికిపోయానని రాజీవ్ అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడున్న వాళ్లంతా ఈ వీడియోను చూస్తారు.

  నువ్వా ఆ పని చేసింది? ఛీ ఛీ అంటూ

  నువ్వా ఆ పని చేసింది? ఛీ ఛీ అంటూ

  వీడియోను చూసి దొంగతనం చేసింది రాజీవ్ అని గ్రహించిన వసుధార.. ‘ఛీఛీ నువ్వా ఆ పని చేసింది? ఆ డబ్బులు నీకు ఇవ్వడానికే కదా తెచ్చేది. అలాంటిది వాటినెందుకు దొంగిలించావ్' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు రాజీవ్ ‘డబ్బు తెచ్చిస్తే నువ్వు నాకు దక్కవన్న భయంతో ఈ పని చేశా. నీ మీదున్న ప్రేమే దొంగతనం చేయించింది' అని అంటాడు. దీంతో వసు అసహ్యించుకుంటుంది.

  వసుధారకు రాజీవ్ బ్లాక్ మెయిలింగ్

  వసుధారకు రాజీవ్ బ్లాక్ మెయిలింగ్

  రాజీవ్ పారిపోడానికి ప్రయత్నించగా రిషి అడ్డుగా వస్తాడు. అంతేకాదు, అతడిని అరెస్ట్ చేయమంటూ శిరీష్‌కు చెబుతుంటాడు. దీంతో రాజీవ్ ‘నేను అరెస్ట్ అయితే పిల్లాడి పరిస్థితి ఏంటి వసు? వాడిని ఒంటరోడిని చేయమంటావా చెప్పు? ఈ విషయం తెలిస్తే మీ నాన్నగారి పరువు పోతుంది కదా. ఒక్కసారి ఆలోచించు. నేను తప్పు చేశాను' అంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.

  కాళ్లు పట్టుకున్నా కనికరించని వసు

  కాళ్లు పట్టుకున్నా కనికరించని వసు

  రాజీవ్ బ్లాక్‌ మెయిల్ చేస్తుండగా వసుధార అతడిని అసహ్యించుకుంటూనే ఎన్నో విధాల ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు అతడు ‘ప్లీజ్ వసు.. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. పిల్లాడి కోసం ఆలోచించైనా కంప్లైంట్‌ను వెనక్కి తీసుకో' అంటూ ఒక్కసారిగా ఆమె కాళ్లపై పడిపోతాడు. అయినప్పటికీ ఆమె మాత్రం కనికరించదు. దీంతో శిరీష్ పోలీసులను రమ్మని రాజీవ్‌ను అరెస్ట్ చేస్తాడు.

  న్యూడ్ ఫొటోపై సుమ సంచలన వ్యాఖ్యలు: ఆ స్థానంలో తను ఉంటే ఎలాగుండేదో అంటూ షాకింగ్‌గా!

  వసు సంచలన నిర్ణయం... క్షమాభిక్ష

  వసు సంచలన నిర్ణయం... క్షమాభిక్ష

  ఇది జరిగిన తర్వాత రిషి.. వసుధార పని చేసే రెస్టారెంట్‌కు వస్తాడు. అతడిని ఒక నిమిషం వెయిట్ చేయమంటుంది. అంతలో అక్కడకు శిరీష్ వస్తాడు. అప్పుడు ‘శిరీష్.. నేను కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నా' అంటుంది. దీనికి వాళ్లిద్దరూ షాక్ అవుతారు. చివరికి ఎణ్నో రకాల మాటలు చెప్పి తన నిర్ణయాన్ని ఒప్పుకునేలా చెబుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Guppedantha manasu Serial Episode 196: Rajiv Robbery Recorded in CC TV. Sirish took That Video Clip. Then Arrested Rajiv. After That Vasudhara Wants to Take Back her Complaint.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X