For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 27 Episode: కన్నీరు పెట్టించిన జగతి తీరు.. పార్టీకి వచ్చిన స్పెషల్ గెస్ట్

  |

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. జగతి పుట్టినరోజు వేడుకలు గురించి తెలుసుకున్న రిషి తండ్రితో గొడవకు దిగుతాడు. ఆ తర్వాత వసుతో గొడవ పడేందుకు ఏకంగా జగతి ఇంటికి వెళ్తాడు. అక్కడకు మహేంద్ర కూడా చేరుకుని రిషిని వెనక్కి తీసుకుని వస్తాడు. అప్పుడు తన భార్య కోసం చేస్తున్న పని అని అంటాడు. ఆ తర్వాత వసు.. ఉదయాన్నే రిషి ఇంటి ముందు కనిపిస్తుంది.

  నన్ను ఎంతో తెలివిగా మోసం చేశావ్

  నన్ను ఎంతో తెలివిగా మోసం చేశావ్

  ఇంటికి వచ్చిన వసుధారతో రిషి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. కోపంతో ఉన్న రిషి ‘నువ్వు నన్ను ఎంతో తెలివిగా మోసం చేశావ్? దాన్ని ఏమని అనాలి? మోసమనా? లౌక్యమనా? ఇంకేమనాలి? బర్త్‌డే అని చెప్పకుండా నాతో కేక్ సెలెక్ట్ చేయించావ్' అంటూ ఫైర్ అవుతాడు. దీనికి ‘నేను సంజాయిషీ ఇచ్చేంత తప్పేమీ చేయలేదు సార్' అని వసు బదులిస్తుంది.

  Intinti Gruhalakshmi July 27th Episode: డబ్బుల కోసం లాస్య కన్నింగ్ ప్లాన్.. తులసికి శశికళ సహాయం

  అది మేడం గొప్ప కాదు.. మీ వ్యక్తిత్వం

  అది మేడం గొప్ప కాదు.. మీ వ్యక్తిత్వం

  ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు వసు ‘నేను మీ పర్సనల్ విషయాలను మాట్లాడను సార్. నా పరిధిలోనే ఉంటాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్. మీరు బర్త్‌డే పార్టీకి వస్తే అది మేడం గొప్పదనం కాదు సార్.. మీ వ్యక్తిత్వం గొప్పదని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఆ కాలేజ్‌కు ఎండీ సార్' అని అంటుంది. దీంతో రిషి ఆలోచనలో పడిపోయాడు.

  ఏ ధైర్యంతో అలా? తప్పేమీ అనలేదు

  ఏ ధైర్యంతో అలా? తప్పేమీ అనలేదు

  కాలేజ్‌లో వసుధార ఏర్పాట్లు చేస్తుండగా.. జగతి అక్కడకు చేరుకుంటుంది. అప్పుడు ‘నువ్వు రిషితో మాట్లాడిన మాటలను మహేంద్ర విని నాకు చెప్పాడు. అయినా ఏ ధైర్యంతో తనలో అలా మాట్లాడావ్? పార్టీకి రమ్మనడం సాహసం అనిపించలేదా?' అని వసుధారను ప్రశ్నించింది జగతి. దీనికి ‘అందులో ధైర్యం ఏముంది మేడం? నా ప్రయత్నం నేను చేశానంతే' అంటూ బదులిస్తుంది.

  దేవయానికి ఫణేంద్ర వార్నింగ్.. రిషికి

  దేవయానికి ఫణేంద్ర వార్నింగ్.. రిషికి

  ఫణేంద్ర, మహేంద్ర కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీ అయి కిందకు వస్తారు. దీంతో దేవయాని ‘ఏంటి మహేంద్ర రిషికి నచ్చని పని చేస్తున్నారు' అని అడుగుతుంది. అప్పుడు మహేంద్ర నసుగుతూ సమాధానం ఇస్తాడు. కానీ, ఫణేంద్ర మాత్రం ‘దేవయాని కాలేజ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పా. అయినా రిషి కాలేజ్ ఎండీ.. వచ్చేది రానిది వాడిష్టం' అని వార్నింగ్ ఇస్తాడు.

  రిషిని మరింత రెచ్చగొట్టిన దేవయాని

  రిషిని మరింత రెచ్చగొట్టిన దేవయాని

  మహేంద్ర, ఫణేంద్ర కాలేజ్‌కు వెళ్లిపోగానే దేవయాని రిషిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ‘నీకు నచ్చని పని చేస్తున్నారని నువ్వైనా వెళ్లడం మానేశావ్. ఇలాగే మాట మీద ఉండు నాన్న' అని అంటుంది. అప్పుడు రిషి.. ‘ఎవరో చెప్పారని, ఎవరో చేశారని కాదు పెద్దమ్మా.. నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాను. ఇప్పుడూ ఎప్పుడూ అలాగే ఉంటాను' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇస్తాడు.

  జగతికి సన్మానం.. కొడుకు కోసం బాధ

  జగతికి సన్మానం.. కొడుకు కోసం బాధ

  ఇక, కాలేజ్‌లో జగతికి ఫణేంద్ర సన్మానం చేస్తాడు. శాలువా కప్పి కేక్ కట్ చేయమని కోరుతాడు. దీనికి జగతి సంతోషించినా.. రిషి రాలేదని మాత్రం బాధ పడుతుంది. ఓ సందర్భంలో కొడుకు వచ్చాడని తలుచుకుంటూ జగతి చూపించిన నటన ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుంది. రిషిని తీసుకు రాలేకపోయామని వసు, మహేంద్ర జగతికి సారీ చెబుతారు. ధరణి మాత్రం పార్టీకి వస్తుంది.

  తారక్‌తో విభేదాలపై నోరు విప్పిన రాజీవ్ కనకాల: దూరం పెరగడానికి కారణమిదే.. ఇబ్బంది పెట్టొద్దన్నానంటూ!

  బర్త్‌డే పార్టీలో స్పెషల్ గెస్ట్.. ఆనందం

  బర్త్‌డే పార్టీలో స్పెషల్ గెస్ట్.. ఆనందం

  రిషి రాకపోయినా అతడు సెలెక్ట్ చేసిన కేక్ కట్ చేస్తూ ఆనంద పడుతుంది జగతి. ఆమెను చూసిన వసుధార, మహేంద్ర, ధరణి ఎంతగానో బాధ పడతారు. అంతలో అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అతడి రాకను చూపిస్తారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కొడుకును చూసి జగతి ఎంతగానో సంతోష పడుతుంది. దీంతో ఎపిసోడ్ పూర్తైయింది.

  English summary
  Guppedantha manasu Serial Episode 200: Vasudhara Ask Rishi to Come Jagathi Birthday Celebrations. Then He Argue with Her. Jagathy Feeling Sad for Rishi Behaviour. That Time He Came to Party.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X