For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 29th Episode: తల్లితో కలవడంపై రిషి క్లారిటీ.. వాళ్లిద్దరిని అక్కడ చూసి షాక్

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో గురువారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పుట్టినరోజు వేడుకలకు రిషి వచ్చి జగతికి శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ, మినిష్టర్ కోరిక మేరకే తాను ఈ పార్టీకి వచ్చానని చివర్లో ట్విస్ట్ ఇస్తాడు. ఆ తర్వాత మహేంద్ర వసుధారతో మాట్లాడుతూ రిషి, జగతిని కలపమని రిక్వెస్ట్ చేస్తాడు. అనంతరం పార్టీకి వెళ్లి తప్పు చేశావని దేవయాని రిషితో అనగా.. అతడు సరైన సమాధానాలు ఇస్తాడు.

  Sankranthi Box Office Fight: ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ మధ్య ఫైట్.. లీకైన రిలీజ్ డేట్స్ ఇవే!

  రిషికి వసుధార మెసేజ్... ఆగ్రహంతో

  రిషికి వసుధార మెసేజ్... ఆగ్రహంతో

  దేవయాని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటుంటాడు రిషి. అంతలో వసుధార అతడికి వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. అందులో జగతికి అతడు ఇచ్చిన పూల బొకే ఫొటో ఉంటుంది. అంతేకాదు, పార్టీకి వచ్చినందుకు థ్యాంక్స్ సార్ అని సందేశం పంపుతుంది. ఇది చూసిన రిషి ఆగ్రహంతో ఊగిపోతాడు. ఆ వెంటనే ఎంత పొగరు అనుకుంటూ ఆమెకు కాల్ చేస్తాడు.

  అది కూడా పెట్టలేకపోయావా అంటూ

  అది కూడా పెట్టలేకపోయావా అంటూ

  వసుధారకు ఫోన్ చేసిన రిషి.. హలో కూడా అనకుండానే కోపంతో తిట్టడం మొదలెడతాడు. ‘ఆ ఫొటో ఎందుకు పెట్టావ్? కేక్ కూడా పెట్టలేకపోయావా? ఆ బొకే ఇప్పుడు నీ ముందు ఉంది. తర్వాత చెత్త బుట్టలో ఉంటుంది. పార్టీలో అది ఇవ్వడం ఆచారం కాబట్టి ఇచ్చాను. నీకు కావాలంటే దాన్ని ఫొటోలు తీసి ఇంట్లో పెట్టుకో. అంతేకానీ, నాకు పెట్టి ఓవర్‌గా రియాక్ట్ అవకు' అని అంటాడు.

  ఎక్కువ ఊహించుకోవద్దని వార్నింగ్

  ఎక్కువ ఊహించుకోవద్దని వార్నింగ్

  వసుధారతో మాట్లాడుతూ పరోక్షంగా వార్నింగ్ కూడా ఇస్తాడు రిషి. ‘ఏదో బొకే ఇచ్చాను అని ఎక్కువగా ఊహించుకోకండి. పూలు ఎలా వాడిపోతాయో. అక్కడ జరిగింది కూడా వెంటనే మర్చిపోతాము. దీన్నే హైలైట్ చేయకు. ఓవర్‌గా రియాక్ట్ అవ్వకు' అంటూ చెబుతాడు. ఆ తర్వాత కాలేజ్‌కు వచ్చి మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. దీంతో వసు ఆశ్చర్యపోతుంది.

  వసుధారకు థ్యాంక్స్ చెప్పిన జగతి

  వసుధారకు థ్యాంక్స్ చెప్పిన జగతి

  జగతి ఇంటి ముందర కూర్చుని వసుధార ఏదో పని చేసుకుంటుంది. అంతలో మహేంద్ర అక్కడకు వచ్చి మేడం ఏం చేస్తుందని అడుగుతాడు. అప్పుడు ఇద్దరూ కలిసి లోపలికి రాగానే.. రిషి ఇచ్చిన బొకే చూస్తూ ఎమోషనల్ అవుతుందామె. అంతేకాదు, వెంటనే వసుధారను కౌగిలించుకుని ఇంతకన్నా థ్యాంక్స్ ఎలా చెప్తాం అంటుంది. దీంతో ఆమెకు రిషి గతంలో హగ్ చేసుకున్నది గుర్తొస్తుంది.

  Intinti Gruhalakshmi July 29th Episode: మళ్లీ తులసి ఇంట్లోకి లాస్య.. నందూతో ఫైట్ తర్వాత నయా ప్లాన్

  ధరణి అడిగిన ప్రశ్నకు రిషి ఆలోచన

  ధరణి అడిగిన ప్రశ్నకు రిషి ఆలోచన


  కాలేజ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతోన్న రిషి దగ్గరకు ధరణి వస్తుంది. అప్పుడామె ‘నువ్వు పార్టీకి రావడానికి వసునే కారణం కదా' అంటుంది. దీంతో రిషి ‘ఎందుకలా అనుకుంటున్నారు? పెద్దమ్మ కూడా అదే అడిగింది. నేను ఎవరి వల్లా మారను వదిన' అంటాడు. దీనికి ధరణి ‘నువ్వు ఒప్పుకోకపోయినా వసుధార మాటల ప్రభావం నీ మీద ఉంది. అది నువ్వే తెలుసుకో' అని చెప్తుంది.

  శిరీష్ ఎంట్రీ.. మహేంద్ర కారులో డ్రాప్

  శిరీష్ ఎంట్రీ.. మహేంద్ర కారులో డ్రాప్

  ఇక, కాలేజ్‌కు వెళ్లేందుకు జగతి రెడీ అవ్వగా.. మహేంద్ర లేటుగా వెళ్దాం అంటాడు. కానీ, ఆమె మాత్రం వసు కోసం వెళ్తా అంటుంది. అప్పుడే శిరీష్ ఎంట్రీ ఇస్తాడు. కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకున్న తర్వాత తన పోలీస్ కారును అక్కడే వదిలేసి మహేంద్ర కారులో వసుధారను తీసుకెళ్లి కాలేజ్‌లో దింపుతాడు. అది చూసిన రిషి షాక్ అవుతాడు. దీంతో ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Guppedantha manasu Serial Episode 202: Vasudhara Sent Message to Rishi. Then He Fired on her. After That Dharani Ask Unexpected Question to Rishi. then After Jagathi Says Thanks to Vasu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X