For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu July 31st Episode: జగతికి మరో షాకిచ్చిన రిషి.. వసుధార చేయి పట్టుకోగానే కోపంతో!

  |

  ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు సందడి చేస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో నడిచే వీటిలో చాలా తక్కువ వాటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో సీరియళ్లు విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యనే ప్రారంభమై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ దూసుకుపోతోంది 'గుప్పెడంత మనసు' సీరియల్. కొత్త ఆర్టిస్టులతో వచ్చినా ఈ సీరియల్‌కు అభిమానులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో శనివారం ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనకు మెసేజ్ పంపడంపై ఎంతో కోపంగా ఉన్న రిషి.. వసుధారను పిలిచి కాలేజ్‌లోనే క్లాస్ పీకుతాడు. దీంతో ఆమె షాక్‌కు గురవుతుంది. ఆ తర్వాత రిషి పార్టీకి వచ్చినందుకు జగతి ఎంతగానో సంతోషిస్తుంది. అది చూసిన రిషి.. తాను ఎప్పటికీ మారను అని, ఏవీ మర్చిపోనని అంటాడు. ఆ తర్వాత రిషి.. మహేంద్రకు కూడా అక్కడే వార్నింగ్ ఇస్తాడు.

  Intinti Gruhalakshmi July 31st Episode: తులసి ఆశలపై నీళ్లు పోసిన మోహన్.. తాత చనిపోతాడని భయపెట్టి!

   రిషికి జగతి థ్యాంక్స్.. షాకిచ్చాడు

  రిషికి జగతి థ్యాంక్స్.. షాకిచ్చాడు

  ఆఫీస్‌లో అకౌంట్స్ చెక్ చేసుకుంటుంటాడు రిషి. అంతలో అతడి దగ్గరకు జగతి వస్తుంది. ‘సార్.. మిషన్ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన అకౌంట్స్ ఇవి. మీరూ కూడా ఒకసారి చూడండి సార్. థ్యాంక్యూ సో మచ్ రిషి సార్.. నా బర్త్‌డే పార్టీకి వచ్చినందుకు' అంటుంది. దీనికతడు ‘మీ స్థానంలో ఎవరు ఉన్నా వచ్చేవాడిని' అంటూ షాకిస్తాడు. దీనికి జగతి మళ్లీ థ్యాంక్స్ అంటూ వెళ్లిపోతుంది.

   శిరీష్‌ను సలహా అడిగిన వసుధార

  శిరీష్‌ను సలహా అడిగిన వసుధార

  సినిమాకు వెళ్దామన్న శిరీష్‌.. వసుధార కోసం రెస్టారెంట్‌కు వస్తాడు. అప్పుడతన్ని ఓ సలహా చెప్పమని అడుగుతుందామె. ‘ఎందుకు.. ఏమిటి.. ఎవరు అని అడగకు. నాకు చాలా సార్లు సహాయం చేసిన ఓ పెద్దాయన.. నన్ను ఓ సాయం చేయమని కోరారు. అది కష్టమైనదే. కానీ నాకు చేయాలని ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్ చెప్పు' అని శిరీష్‌ను అడుగుతుంది వసుధార.

   కాదని చెప్పమని అంటాడు శిరీష్

  కాదని చెప్పమని అంటాడు శిరీష్

  వసుధార అడిగిన ప్రశ్నకు ‘నీకు ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయి. పైగా అది కష్టమైనది అంటున్నావు. నీ లైఫ్‌కు అది అడ్డుగా ఉంటుంది. నీ లైఫ్‌ కంటే నీకు ఎవరూ ముఖ్యం కాదు. అందుకే నాకు కుదరదు అని చెప్పు. దీనికి మొహమాటం అడ్డొచ్చినా తప్పదు. ఇప్పుడున్న సమస్యలను గుర్తు తెచ్చుకో' అని అంటాడు శిరీష్. ఆ సమయంలోనే అక్కడకు రిషి కూడా ఎంట్రీ ఇస్తాడు.

   వసుధారకు రిషి సలహా.. నో అని

  వసుధారకు రిషి సలహా.. నో అని

  రిషి రావడం రావడమే ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తాడు. అంతలో శిరీష్.. వసుధార చెప్పిన అన్ని విషయాలను అతడికి వివరిస్తాడు. దీంతో కోప్పడిన రిషి ‘ఉదయం ట్యూషన్, తర్వాత కాలేజ్, సాయంత్రం రెస్టారెంట్.. ఇలా బిజీగా ఉన్న నీకు అది అవసరమా? ఆ పెద్ద మనిషికి సహాయం చేయడం కుదరదు అని చెప్పు. లేకుంటే నెంబర్ ఇవ్వు నేను మాట్లాడతా' అంటాడు.

  వసును పట్టుకున్న శిరీష్.. కోపం

  వసును పట్టుకున్న శిరీష్.. కోపం

  రిషి మాట్లాడుతుండగానే వసుధార కాఫీ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్లిపోవాలనుకుంటుంది. అంతలో శిరీష్.. ఆమె చేయి పట్టుకుని ‘కాఫీ ఎవరితోనైనా పంపించు. మనకు టైమ్ అవుతుంది' కదా అంటాడు. అది చూసి ‘దేనికి టైమ్ అవుతుంది' అని అడుగుతాడు రిషి. దీనికి శిరీష్ సినిమాకు వెళ్తున్నామని బదులిస్తాడు. దీంతో రిషి కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతాడు.

  రిషిని అనుమానించిన దేవయాని

  రిషిని అనుమానించిన దేవయాని

  ఇంట్లో రెడీ అవుతోన్న మహేంద్ర దగ్గరకు వచ్చిన దేవయాని ‘వసుధార ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తుంది. తనను కంట్రోల్‌లో పెట్టమని రిషికి చెప్పాలి' అని అంటుంది. దీనికి మహేంద్ర ‘తను ఏమీ చేయడం లేదు. తనను అబ్జర్వ్ చేస్తున్నా. అయినా రిషి మీ పెంపకంలో పెరిగాడు కదా. వేరే వాళ్ల గురించి ఆలోచించకుండా మన పని మనం చూసుకోవడం మంచిది' అంటూ వెళ్లిపోతాడు.

  ఘాటు ఫొటోలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్: అబ్బా అనిపించేలా ఫోజులు.. మామూలుగా లేవుగా!

  FCUK Movie Song 4 Manasu Katha
  వసు గురించి రిషికి ధరణి క్లాస్‌లు

  వసు గురించి రిషికి ధరణి క్లాస్‌లు

  వసుధార సినిమాకు వెళ్లడం గురించి ఆలోచిస్తున్న రిషితో ధరణి మాట్లాడుతుంది. ‘చిన్న గొడవలు టీ కప్పులో తుఫాను లాంటివి. వాటిని ఎక్కువగా చూడకూడదు. అయినా, మాట చాలా ముఖ్యం. ఇప్పటి వాళ్లకు నేరుగా చెబితే నచ్చకపోవచ్చు. నేను ఈ మాటలు చెప్పేది వసు గురించే. తను స్వాతంత్ర భావాలు ఉన్న పిల్ల' అని అంటుంది. దీంతో రిషి ఆలోచనలో పడిపోతాడు.

  English summary
  Guppedantha manasu Serial Episode 204: Rishi Shocks Jagathi About Birthday Party. After That Rishi and Sirish Gave Suggesions to Vasudhara. Then Mahendra Gave Currect Answer to Devayani.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X