»   » బిగ్ బాస్ డిసప్పాయింట్మెంట్: హరితేజ, ఆదర్శ్‌లకు మాటీవీ మరో ఛాన్స్?

బిగ్ బాస్ డిసప్పాయింట్మెంట్: హరితేజ, ఆదర్శ్‌లకు మాటీవీ మరో ఛాన్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Star Maa Offer To Bigg Boss finalists హరితేజ, ఆదర్శ్‌లకు మాటీవీ మరో ఛాన్స్?

ఆట ఏదైనా, పోటీ ఏదైనా ఆరంభంలోనే ఓడిపోతే వచ్చిన ఫీలింగ్ కంటే..... గెలుపు అంచువరకు వెళ్లి ఓడిపోతే వచ్చే ఫీలింగ్, డిసప్పాయింట్మెంట్ ఓ రేంజిలో ఉంటుంది. బిగ్ బాస్ ఫైనల్స్ వరకు చేరి చివరి నిమిషంలో తాము ఓడిపోయినట్లు తెలుసుకున్న హరితేజ, ఆదర్శ్ పరిస్థితి అలాగే ఉంది.

అయితే 'బిగ్ బాస్' ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఈ ఇద్దరికీ మాటీవీ వారు మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. వచ్చే శని, ఆదివారం నుండి బిగ్ బాస్ స్థానంలో ప్రసారం అయ్యే 'నీతోనే డాన్స్' రియాల్టీ షోలో వీరికి అవకాశం దక్కినట్లు సమాచారం.

అగ్రిమెంట్ కూడా..

అగ్రిమెంట్ కూడా..

స్టార్ మాటీవీ వారు ఇప్పటికే హరితేజ, ఆదర్శ్‌తో డాన్స్ రియాల్టీ షోకు సంబంధించి అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఆదర్శ్, హరితేజ జంటగా...

ఆదర్శ్, హరితేజ జంటగా...

‘నీతోనే డాన్స్' రియాల్టీషో అనేది కపుల్ థీమ్ తో సాగే రియాల్టీ షో. ఈ షోలో ఆదర్శ్, హరితేజ జంటగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం అయితే లేదు.

బిగ్ డిసప్పాయింట్మెంట్

బిగ్ డిసప్పాయింట్మెంట్

బిగ్ బాస్ విజేతను ఎంపిక చేసే క్రమంలో మొత్తం 11 కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఇందులో అత్యధిక ఓట్లు దక్కించుకున్న శివ బాలాజీ విన్ అయ్యారు. శివ తర్వాత అత్యధిక ఓట్లు ఆదర్శ్ కు పడ్డాయి. ఆతర్వాత హరితేజకు పడ్డాయి. ఫలితం తేలాక ఆదర్శ్, హరితేజతో పాటు... వారికి సపోర్టు చేసిన వారు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు.

నీతోనే డాన్స్

నీతోనే డాన్స్

‘నీతోనే డాన్స్' రియాల్టీ షో సెప్టెంబర్ 30 నుండి శని, ఆది వారాల్లో మాటీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. రేణు దేశాయ్, జానీ మాస్టర్, ఆదా శర్మ ఈ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు.

ఉదయభాను రీ ఎంట్రీ

ఉదయభాను రీ ఎంట్రీ

ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా బుల్లితెరకు దూరంగా ఉంటున్న యాంకర్ ఉదయభాను.... ‘నీతోనే డాన్స్' రియాల్టీ షో ద్వారా బెల్లితెరపై మల్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

English summary
Bigg Boss finalists Hari Teja and Adarsh are reportedly going to participate in 'Neethone Dance' Show. Reports say that Star Maa has already completed all the formalities of Agreement with the duo. As it is a couple-themed show, both Adarsh and Hari Teja will participate in the show with their respective partners.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu