అల్లు అర్జున్ అంటే పిచ్చి.. బన్ని కోసం ఏకంగా 15 రోజులు అలా..
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ అల్లు అర్జున్ (Allu Arjun)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లోని పుష్ప, పుష్ప 2 సినిమాలు మైలురాళ్లుగా మారాయి. ఈ సినిమాల ద్వారా ఆయన పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. బన్నీ సినిమాకు మాత్రమే కాకుండా, అభిమానుల మధ్య సూపర్ స్టార్‌గా ర్యాంక్ పొందారు. అల్లు అర్జున్ క్రేజ్ కేవలం సామాన్యులకే పరిమితం కాకుండా, సెలబ్రెటీల్లో ఎంతో మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి స్టార్ హీరోకి కలవడం, ఆయనతో కలిసి పనిచేయడం ఓ ప్రత్యేకమైన అనుభవం. ఓ నటి బన్నీ కోసం ఏకంగా 15 రోజుల పాటు తిండి మానేసిందట. ఇంతకీ ఆ నటి ఎవరు? ఎందుకోసం?
ఆ నటి ఎవరో కాదు.. సీరియల్ నటి హరితేజ. ఈ అమ్మడు టెలివిజన్ రంగంలో యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు పొందారు. 'మనసు మమత', 'రక్తసంబంధం', 'తాళికట్టు శుభవేళ', 'శివరంజని', 'కన్యాదానం' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకుల మన్ననను గెలుచుకున్నారు. తన సహజ నటన, కామెడీ టైమింగ్, ప్రేక్షకులతో చక్కని కనెక్షన్ కలిగి ఉండటం వల్ల హరితేజ టీవీ ప్రేక్షకుల ఫేవరెట్‌గా నిలిచారు. తదుపరి సినిమాల్లో అడుగు పెట్టిన హరితేజ, చిన్న పాత్రలతో తన ప్రతిభను ప్రదర్శించి, తరువాత కీలక పాత్రల్లో కనిపించారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఆ ఆ' సినిమాలో సమంత పనిమనిషిగా చేసిన పాత్ర ప్రేక్షకులకు ముద్ర వేసింది. ఈ సినిమాలో హరితేజ కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ ద్వారా అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆ తరువాత హరితేజ బిగ్ బాస్ షోతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2017లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తన ఎంటర్టైనింగ్ నేచర్, పాజిటివ్ వైబ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొని, తన ప్రత్యేకతను మరోసారి ప్రదర్శించారు. రెండు సీజన్లలోనూ హరితేజ గేమ్ ప్లే, కామెడీ టైమింగ్, ఎంటర్టైనింగ్ నేచర్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.
తాజాగా హరితేజ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న 'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన అభిమాన హీరో అల్లు అర్జున్ కోసం చేసిన ఓ పనిని బయటపెట్టారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, డీజే సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అల్లు అర్జున్‌ని కలిసేందుకు 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకుని సన్నబడటానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె పూర్తిగా తినకూడదు, డైట్ కచ్చితంగా పాటించాలి అనడం వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
హరితేజ చెప్పిన ప్రకారం.. షూటింగ్ ముందు రోజు రాత్రి స్లీప్ లేకుండా, నెక్స్ట్ డే షూటింగ్‌లో అల్లు అర్జున్ ని కలుసుకోవడం ఒక అనుభవమైన క్షణంగా మారింది. అల్లు అర్జున్ ఆమెను చూస్తూ, "నేను మీ బిగ్ బాస్ షో చూసాను. మీరు మా ఇంట్లో వాళ్లకు మీరు చాలా ఇష్టం. మీరు చాలా బాగా ఆడారు. నాకు కూడా మీ నటన ఇష్టం" అని వ్యాఖ్యానించారు. ఆ కంప్లీమెంట్ తన జీవితంలో మరిచిపోలేని ఘటన అని, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనని అన్నారు హరితేజ.
మరింతగా 'పుష్ప' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హరితేజ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, హరితేజ ఆర్టిస్ట్ గా నాకు ఇష్టం, తెలుగు అమ్మాయి అని సరదాగా చెప్పి, మళ్లీ వేరే చోట వేరే పేరు చెప్పకూడదని పేర్కొన్నారు. అప్పట్లో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హరితేజ వ్యాఖ్యల ప్రకారం.. అల్లు అర్జున్ పై ఆమెకు ఎంత అభిమానం ఉందో అర్థం అవుతుంది. ఓ స్టార్ హీరో చిన్న నటులను ప్రశంసించడం కూడా హర్షించదగ్గ విషయమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











