For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా శోభనం గందరగోళం.. అందుకే తాళి వేసుకొను.. బిగ్‌బాస్‌లో హరితేజ ఫస్ట్ నైట్..

  By Rajababu
  |
  Bigg Boss Telugu : Hariteja Shares Her First Night Incident With Housemates

  తెలుగు బిగ్‌బాస్‌లో భావోద్వేగాల పంటపడుతున్నది. గత 60 రోజులుగా ఇంటికి, కుటుంబ సభ్యులు, స్నేహితులకు, సన్నిహితులకు దూరంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న సెలబ్రిటీలకు కాస్త ఉపశమనం కలిగింది. ఓ పక్క లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడుతూనే మరో పక్క తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసలుబాటును బిగ్ బాస్ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం గేమ్ షోలో అర్చన తల్లి, హరితేజ భర్తతోపాటు ఇద్దరు దొంగలు రావడం బిగ్ బాస్‌లో ప్రత్యేక అంశాలని చెప్పవచ్చు.

  గుక్క పెట్టి ఏడ్చిన అర్చన

  గుక్క పెట్టి ఏడ్చిన అర్చన

  మంగళవారం ఎపిసోడ్‌లోని హౌస్ లోకి ప్రవేశించిన అర్చన తల్లి అందర్ని పేరు పేరునా చనువుగా పలకరించింది. తల్లిని చూసిన ఆనందంలో అర్చన కంటతడి పెట్టింది. చిన్న పిల్లల గుక్క పెట్టి ఏడ్చింది. తల్లితో ఏకాంతంగా అర్చన గడిపింది. నస పెట్టకూడదు. ఏడవ కూడదు. గేమ్ నీ తరహాలోనే ఆడు అని సలహాలు ఇచ్చింది. గతంలో కంటే ఇప్పుడు బాగా ఆడుతున్నావని, గేమ్ గెలువలానే లక్ష్యంతో కాకుండా ప్రేక్షకులకు వినోదం పంచాలని అర్చనకు ఆమె తల్లి సూచించింది.

  దెయ్యం ఎపిసోడ్ బోర్

  దెయ్యం ఎపిసోడ్ బోర్

  నేను చూసిన చూసిన ఎపిసోడ్స్‌లో దెయ్యం ఎపిసోడ్ చెత్తగా ఉంది. చాలా బోరుగా సాగింది అని చెప్పింది. ఏ టాస్క్ లోనైనా వినోదం ఉండాలే ప్లాన్ చేయాలి. స్కూల్ ఎపిసోడ్ అందర్ని ఆకట్టుకొన్నది అని అర్చన తల్లి చెప్పింది. చాలా రకాలుగా తల్లి సలహాలు ఇస్తుండగా, అర్చన విసుక్కోగా.. నేను ఇచ్చే సలహాలు విను.. నీకు కావాల్సినవి నీవు ఇంప్లిమెంట్ చేయి అని చెప్పింది.

  భావోద్వేగానికి గురైన హరితేజ

  భావోద్వేగానికి గురైన హరితేజ

  అర్చన తల్లి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత హరితేజ బంధాలు, అనుబంధాల విషయంలో భావోద్వేగాలకు గురి అయింది. ఆడపిల్ల అంటే ఆఢిపిల్లే అనే వేదాంతానికి గురి అయింది. ఎన్నాళ్లు పెంచినా ఆడపిల్ల ఆడి పిల్లే అని అంటారనే సత్యం అని చెప్పుకొచ్చింది. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని బాధ కరమైన సంఘటనలను గుర్తు చేసుకొన్నది.

  శోభనం రాత్రి మా ఆయన హల్‌చల్

  శోభనం రాత్రి మా ఆయన హల్‌చల్

  నాది ప్రేమ వివాహం. మాది సంప్రదాయపరమైన కుటుంబం. చాలా కట్టుబాట్లు ఎక్కువ. అయితే ఇవన్నీ నా భార్తకు పట్టేవి కాదు. నా పెళ్లి తర్వాత పెద్ద గొడవ జరిగింది. శోభనం రోజు రాత్రి గందరగోళం చోటుచేసుకొన్నది. ఆచారం, సంప్రదాయం ప్రకారం జరగాలని మా వైపు పట్టింపు. కానీ ఆయనకు ఇవేమీ కదురవు. ఇంట్లో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉండగా గొడవ జరిగింది. వారి ముందు సిగ్గు పోయింది అని హరితేజ చెప్పింది.

  వివాహితగా కనిపించడం ఇష్టం లేదు

  వివాహితగా కనిపించడం ఇష్టం లేదు

  నేను తాళి వేసుకోకపోవడానికి కారణం మా ఆయనే. మా ఆయనకు నేను వివాహితగా కనిపించడం ఇష్టం లేదు. ఎప్పుడు నేను ఓ గర్ల్ ఫ్రెండ్ లా కనిపించాలని ఆయన కోరుకొంటాడు. పెళ్లైన వ్యక్తిగా కనిపించడం అసలే ఇష్టం ఉండదు. అని హరితేజ తన సంగతులను తోటి సభ్యులకు వివరించింది.

  భర్త కనిపించడంతో..

  భర్త కనిపించడంతో..

  ఫ్రీజ్, స్లో మోషన్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆట ఆడుతుండగానే హరితేజకు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. స్టోర్ రూమ్ లోకి వెళ్లిన హరితేజకు అందులో తన భర్త కనిపించడంతో నివ్వెరపోయింది. వెంటనే తేరుకొని తన భర్తను వాటేసుకొన్నది. ముద్దులు మునిగిపోయింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి ఇంటిలోకి ప్రవేశించింది. ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత సభ్యులను హరితేజ భర్త పేరు పేరునా పలుకరించాడు.

  నా భార్యను కొడుతున్నావు. ఏంటీ సంగతి?

  నా భార్యను కొడుతున్నావు. ఏంటీ సంగతి?

  సభ్యులు పలుకరించే భాగంగా శివ బాలాజీని ఉద్దేశించి హరితేజ కామెంట్ చేశాడు. ఏంటీ నీవు నా భార్యను కొడుతున్నావు. ఏంటీ సంగతి అని సరదాగా ఆటపట్టించాడు. అనంతరం హరితే.జ తన భర్తతో ఏకాంతంగా గడిపింది. ఇంటి విషయాలను అడిగి తెలుసుకొన్నది. వారిద్దరూ కన్నడ భాషలోనే మాట్లాడుకోవడం గమనార్హం.

  ఇంటిలోకి ఇద్దరు దొంగలు

  ఇంటిలోకి ఇద్దరు దొంగలు

  ఇలా అతిథులతో సమయం గడుపుతూనే ఇంటి సభ్యులు టాస్క్ ఆడారు. ఈ మధ్యలో పప్పుచారుతోపాటు ఫిష్ ఫ్రైని శివబాలాజీ ప్రిపేర్ చేస్తుండగా ఇంటిలోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. సభ్యులు ఫ్రీజ్ అయి ఉండగా దొంగలు ఇంటిలో తిన బండారాలను ఆరగించారు. పప్పుచారుతో పాటు చేపల వేపుడును ఎత్తుకెళ్ళి పోయారు. ఫ్రీజ్ అయి ఉండటం వల్ల వారు ఏమీ చేయలేకపోయారు.

  English summary
  Telugu Bigg boss filled with full of emotions. Its going with very good manners. In Wednesday episode, Archna mother, Hariteja husband visited bigg boss house. In this situation Hariteja shares to her first night incident with housemates. Hariteja revealed some interesting facts in this episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X