For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘బిగ్‌బాస్‌’లో సంపూకు మెంటల్.. కెమెరాలు పగలుకొట్టి బయటకు వెళ్తా కల్పన.. పిచ్చిపిచ్చిగా.

  By Rajababu
  |

  తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారంలోకి ప్రవేశించింది. బిగ్‌బాస్ ఇంటి నుంచి ఇప్పటికే తొలి కంటెస్టెంట్ సినీ నటి జ్యోతి బయటకు వచ్చింది. వారం రోజుల వ్యవహారం చూస్తే ఇంటిలో సెలబ్రిటీల మధ్య విభేదాలు, గొడవలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరైతే తాము ఇంటి నుంచి బయటకు వెళ్లాలని గోల చేస్తున్నారు. అయితే మంగళవారం ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో సంపూ హిస్టీరియా వచ్చినట్టు బిహేవ్ చేయడం వీక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

  సంపూ, మధుప్రియను బయటకు పంపించే..

  సంపూ, మధుప్రియను బయటకు పంపించే..

  రెండో వారంలో హీరో సంపూ, గాయని మధుప్రియను చాలా మంది ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. తాను తన కుటుంబానికి దూరమైపోతున్నాననే బెంగ సంపూకు, తల్లి గుర్తు వస్తుందనే బాధ మధుప్రియలకు ఎక్కువై పోతున్నది. ఇదే విషయాన్ని కన్ఫెషన్‌ రూమ్‌లో బిగ్‌బాస్‌కు ఇంటి సభ్యులు తెలిపారు. సంపూను, మధు ప్రియను పంపించానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే భావన వీక్షకుల్లో కలుగుతున్నది.

  సంపూ పిచ్చిపట్టినట్టు

  సంపూ పిచ్చిపట్టినట్టు


  వీక్షకులకు ఈ కార్యక్రమంపై ఆసక్తిని పెంచేందుకు మంగళవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను స్టార్ మా ప్రసారం చేసింది. ఈ సన్నివేశాల్లో సంపూ పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. సంపూను కంట్రోల్ చేయడానికి ఇంటి సభ్యులందరూ ప్రయత్నించడం, వారి ముఖాల్లో ఆందోళన కనిపించింది. అయితే ఈ కార్యక్రమంలో ఇది ప్రాంక్ ఎపిసోడా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.

  గతంలో ఆదర్శ్ బాలకృష్ణ కూడా..

  గతంలో ఆదర్శ్ బాలకృష్ణ కూడా..

  గతంలో ఇంటి సభ్యుడు ఆదర్శ్ బాలకృష్ణ కూడా ఇలానే ప్రవర్తించాడు. పిచ్చెక్కినట్టు ప్రయత్నించడం, ఆ తర్వాత కల్పన గదిలోకి తీసుకెళ్లి నచ్చచెప్పడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి అందర్ని షాక్ గురిచేసిన వ్యవహారం అని తేలిపోవడంతో ఇంటి సభ్యులు ఊపిరి తీసుకొన్నారు.

  ఏదైనా జరుగరానిది జరిగితే..

  ఏదైనా జరుగరానిది జరిగితే..

  రెండోవారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియలో సంపూ మానసిక ఆరోగ్యంపై ఇంటి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ ఓ రకమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని ధన్‌రాజ్ చెప్పడం గమనార్హం. ఇంటిలో జరుగరానిది సంపూకు జరిగితే తీరని నష్టం జరుగుతుంది అనే భయాన్ని ధన్ రాజ్ చెప్పడం సంచలనం రేపింది. ఇలాంటి చర్యలు బిగ్‌బాస్‌ను ఆసక్తికరంగా మార్చడానికి చేస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతున్నది.

  కల్పన తీరును జీర్ణించుకోలేక..

  కల్పన తీరును జీర్ణించుకోలేక..


  ఇది ఇలా ఉండగా, కొత్తగా కెప్టెన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కల్పన వ్యవహారం ఇంటి సభ్యులకు నచ్చడం లేదు. ఓవర్‌నైట్‌లో కల్పనలో వచ్చిన మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు కొందరు. కల్పనపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కల్పన ఆవేదనకు గురయ్యారు.

  గోడ దూకి బయటకు వెళ్తా..

  గోడ దూకి బయటకు వెళ్తా..


  బిగ్‌బాస్.. జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చేశాను. వాటిని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. కానీ ఇక్కడి పరిస్థితులు చూస్తే బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చాను అనే భయం వెంటాడుతున్నది. పరిస్థితి ఇలానే కొనసాగితే కెమెరాలు పగులకొడుతా. ఇంటి గొడలు బద్దలుకొట్టి దూకి పారిపోతాను అని కల్పన హెచ్చరించారు.

  బిగ్‌బాస్‌లోకి మళ్లీ జ్యోతీ రానున్నదా?

  బిగ్‌బాస్‌లోకి మళ్లీ జ్యోతీ రానున్నదా?

  ఇక ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్టీఆర్ ఇంటి సభ్యులకు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. జ్యోతిని బయటకు పంపించేటప్పుడు ఎన్టీఆర్ చెప్పినదేమిటంటే.. బిగ్‌బాస్ అనేది చాలా ఆసక్తికరమైన అంశాలకు వేదిక అని.. ఈ క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది అనే హింట్‌ను ఎన్టీఆర్ ఇచ్చారు. అంటే నిన్ను మళ్లీ బిగ్‌బాస్ పిలిపించడానికి అవకాశం ఉంది అని జ్యోతికి చెప్పడమే ఎన్టీఆర్ ఉద్దేశం.

  English summary
  Telugu Version of Bigboss started with High Energy. House filled with emotions. Sampoo, Madhupriya is feeling home sick. They trying to go out as soon as possible. In this juncture, Sampoo behaves like metal. This episode will broadcast on tuesday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X