Just In
Don't Miss!
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- News
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యాంకర్ ప్రదీప్‌కు హీరోయిన్ లవ్ ప్రపోజల్.. బాగా నచ్చడంతో అందరి ముందు బుక్క కొరికేసింది.!
బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న మేల్ యాంకర్లలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్ల ప్రభావం కనిపిస్తున్న ఈరోజుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో యూత్‌లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వరుస షోల ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇదే తరహాలో కెరీర్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. ఒకవైపు యాంకర్‌గా పని చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోగానూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హీరోయిన్ ప్రదీప్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.?

రెండూ చోట్లా సూపర్ సక్సెస్ అయిన ప్రదీప్
యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు. ఇక్కడ ఎన్నో షోలలో అద్భుతమైన హోస్టింగ్‌తో అలరించాడు. అదే సమయంలో అతడు సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ప్రదీప్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. వాటిలో పవన్ ‘అత్తారింటికి దారేది', బన్నీ ‘జులాయి', నాగ చైతన్య ‘100% లవ్', ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

ప్రదీప్‌లో టాలెంట్‌కు ఇదే ఉదాహరణ
కెరీర్ తొలినాళ్లలోనే ప్రదీప్ అదిరిపోయే హోస్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆడవాళ్ల కోసం రూపొందించిన ‘గడసరి అత్త సొగసరి కోడలు' కార్యక్రమంలో అతడు మెప్పించాడు. ఈ ప్రొగ్రామ్‌కు గానూ ప్రదీప్‌కు బెస్ట్ యాంకర్ మేల్‌గా టీవీ నంది పురస్కారం లభించింది. ఇది మాత్రమే కాదు.. ఇలాంటి ప్రొగ్రామ్‌లు ఎన్నో విజయవంతం అయ్యాయంటే అతడే కారణమని చెప్పవచ్చు.

ఆ షోలో మాత్రం ప్రదీప్ ఉంటే కిక్కే కిక్కు
ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘ఢీ' షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ షోకు ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్నాడు. ఇందులో అతడు టీమ్ లీడర్లు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్, హైపర్ ఆది, వర్షిణిలపై పంచులు వేస్తూ ప్రేక్షకుల పెదాలపై నవ్వులూ పూయిస్తూ ఉంటాడు. అలాగే, జడ్జ్‌లనూ ఆటపట్టిస్తూ ఉంటాడు.
యాంకర్ ప్రదీప్‌కు హీరోయిన్ లవ్ ప్రపోజల్
తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న హీరోయిన్ పూర్ణ.. ప్రదీప్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. అంతేకాదు, మోకాళ్లపై కూర్చుని పూలను కూడా అందించింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. అలాగే, ఇదే వీడియోలో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ నచ్చడంతో అతడిని దగ్గరకు పిలిచి మరీ బుగ్గ కొరకేసిందామె.

కంటెస్టెంట్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది
గతంలో ఇదే షోలో భాగంగా పూర్ణ.. కంటెస్టెంట్ రాజుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు చూపించారు. ఆ ఎపిసోడ్‌లో రాజు.. ఆమెను స్టేజ్‌పైకి పిలిచి మరీ వేలికి ఉంగరం తొడిగేశాడు. దీంతో ఆ వారం ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహా ప్లాన్ చేశారా.? లేక నిజంగానే ఆమె ప్రపోజ్ చేసిందా.? అన్నది తెలియాలంటే బుధవారం వరకు ఆగాల్సిందే.

ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా.?
పూర్ణ అలియాస్ షామ్నా కాసీం శాస్త్రీయ నృత్య కళాకారిణిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత సినీ రంగంలోకి ప్రవేశించింది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ సినిమాలు ‘అవును', ‘అవును 2' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. వీటికి ముందూ తర్వాత ఆమె ఎన్నో సినిమాలు, రియాలిటీ షోలలో పాల్గొనడం ద్వారా పాపులర్ అయింది.

అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ప్రదీప్
ఇప్పటి వరకు యాంకర్‌గా, సహాయ నటుడిగా కనిపించిన ప్రదీప్.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మున్నా అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో అతడు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 1947లో జరిగే పీరియాడికల్ కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.