twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ 9 పై కోర్టులో కేసు

    By Srikanya
    |

    TV9 Logo
    హైదరాబాద్ : టీవీ 9 ఛానెల్ పై వైజాగ్ కు చెందిన బ్యాంక్ అధికారి కుటుంబం కోర్టులో కేసు వేసారు. తమ కుటుంబ పెద్ద ఆత్మహత్యకు టీవీ 9 కారణమైందని వారి ఆరోపణ. తప్పుడు కథనంతో ఓ అమాయకుడి ఉసురు తీసిందని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు టీవీ 9 పై తప్పుడు కథనం విషయంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అక్రమ సంబంధం విషయంలో టీవీ 9 ఒక స్టోరీ ప్రసారం చేయడంతో ఈ వివాదం మొదలైంది. విశాఖలోని ఓ బ్యాంక్ అధికారి, మహిళ మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది అంటూ టీవీ గతంలో ఒక ప్రత్యేక కథనం ప్రసారంచేయటమే ఈ వివాదానికి కారణం అని తెలుస్తోంది.

    తనపై తప్పుడు కథనం ప్రసారం చేయటంతో కలత చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు. దీంతో ఆ ఉద్యోగి కుటుంబీకులు టీవీ 9 పై మండి పడుతున్నారు. టీవీ 9 సీఈఓ, రిపోర్టర్, బాధ్యులపై కేసు నమోదు చేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. మెరుగైన సమాజం కోసం అనే నినాదంతో నడుస్తున్న టీవీ 9 ఇలాంటి ప్రసారాలు చేసే ముందు కాస్త ముందు వెనకా చూసుకోవాలని అంటున్నారు.

    English summary
    Vizag based Bank Family lodges complaint against TV 9 channel. Media owners aim to drive revenues through sensationalizing content to draw more viewers from the buying class of the society.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X