For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam హిమతో నీ పెళ్లి జరిపిస్తా.. ఆ సంగతి నేను చూసుకొంటా.. నిరుపమ్‌కు శౌర్య హామీ

  |

  ఎవరు అడ్డుపడినా నిరుపమ్‌తో హిమ పెళ్లిని జరిపిస్తాను అని సౌందర్య చేసిన సవాల్‌కు కూతురు స్వప్ప ప్రతి సవాల్ విసిరింది. నిరుపమ్, శోభ పెళ్లి చేయడానికి ప్లాన్ చేసి వెడ్డింగ్ కార్డులు కూడా కొట్టించింది. అమ్మమ్మ ఇంటిలో ఉన్న నిరుపమ్.. సౌందర్యకు కాళ్లకు దండం పెట్టుకొంటుంటే.. శోభతో కలిసి దీవెనలు తీసుకోమని చెప్పింది. అయితే నీకు ఏమైనా అర్ధం అవుతుందా అని నిరుపమ్ అంటే... నీకే అర్ధం కావడం లేదు. మీ అమ్మమ్మ, తాత ఆది దంపతులని, ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతలని నమస్కరిస్తున్నావు కదా.. నీవు అనుకొన్న గొప్ప వాళ్ల కాదు. ఇవి శుభలేఖలు మమ్మీ.. డాక్టర్ నిరుపమ్ వెడ్స్ డాక్టర్ శోభ. మొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాను. నా పెద్ద కొడుకు వివాహానికి దూరం నుంచి ఆశీర్వదించండి అంటూ స్వప్న కౌంటర్ ఇచ్చింది. అసలు కథ ఇప్పుడే మొదలైందంటూ శుభలేఖను తల్లికి ఇచ్చింది. దాంతో నిరుపమ్ షాక్ తిన్నాడు. కార్తీకదీపం సీరియల్ 1425 ఎపిపోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  పెళ్లి కార్డును చించి

  పెళ్లి కార్డును చించి

  శుభలేఖ ఇచ్చిన తర్వాత ఇంటిని చూస్తూ... ఇళ్లంతా బావురుమంటున్నది. పెళ్ల కళ లేదేంటి? అయినా పెళ్లి కూతురు నా పక్కన ఉంటే.. మీ ఇంట్లో ఎలా కళ ఉంటుంది అని స్వప్ప అంటే.. శుభలేఖను చించి స్వప్ప ముఖంపై విసిరికొట్టింది. దాంతో నా కొడుకు తలపై అక్షింతలు చల్లమంటే.. పెళ్లి కార్డును చించి నాపై విసిరికొడుతావేంటి అంటూ స్వప్న సెటైర్ వేసింది. నా కొడుకు నిరుపమ్ పెళ్లి మంచిగా చదువుకోవాలని కోరుకోండి అంటూ స్వప్న కామెంట్ చేసింది. దాంతో స్వప్న మళ్లీ మళ్లీ చెబుతున్నాను. నా మనవడు నిరుపమ్‌కు నా మనవరాలి హిమకు నిర్ణయించిన ముహుర్తంలోనే పెళ్లి జరుగుతుంది. దానిని ఎవరు ఆపలేరు అంటూ సవాల్ విసిరింది.

   హిమతోనే నిరుపమ్ పెళ్లి

  హిమతోనే నిరుపమ్ పెళ్లి


  స్వప్న, సౌందర్య మాటలను పక్కనేఈ మాటల వింటున్న శౌర్య బాధ పడి.. వెనుకకు వెళ్లిపోతుంటే.. శౌర్యను చూసి ఇటు రా అంటూ పిలిచింది. శౌర్య నీవు ఏమన్నావు.. హిమ, నిరుపమ్ పెళ్లి నీవే చేస్తానని చెప్పావు కదా.. అన్నావా? లేదా? అదే మాట నీ పొగరుబోతు అత్తతో చెప్పు. చెప్పవే అంటూ మౌనంగా ఉన్న శౌర్యను గద్దించింది. వాళ్లిద్దరికి అసలు విషయం బోధపడుతుంది. హిమతోనే నిరుపమ్ పెళ్లి అని చెప్పు. ఇంట్లోనే శుభకార్యం జరగబోతుందని చెప్పు అంటూ సౌందర్య అంటుంటే.. జరగని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించకు. జరిగేవి నేను చేసి చూపిస్తాను అంటూ నిరుపమ్‌ను స్వప్ప తీసుకొని వెళ్లింది.

  నిరుపమ్ బావకు శౌర్యకు పెళ్లి

  నిరుపమ్ బావకు శౌర్యకు పెళ్లి

  నిరుపమ్ పెళ్లికి సౌందర్య, స్వప్న చేస్తున్న ప్రయత్నాలు చూసి హిమ ఆందోళన చెందింది. ఈ పెళ్లిని నేను ఆపలేనా అని మనస్తాపానికి గురైంది. నిరుపమ్ బావతో శౌర్య పెళ్లి చేస్తానని గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకొన్నది. చూస్తున్నావా అమ్మా.. చూస్తున్నావా డాడీ.. కళ్లముందే అన్నీ జరుగుతున్నాయి. చూస్తూ ఊరికే ఉండిపోవాలా? ఏదో ఒకటి చేస్తాను. నిరుపమ్ బావకు శౌర్యకు పెళ్లి చేస్తాను అని తల్లిదండ్రుల ఫోటో ముందు మనసులో అనుకొని సౌందర్య పిలుస్తున్న బయటకు వెళ్లింది.

  నిరుపమ్ పెళ్లి చేయాలని

  నిరుపమ్ పెళ్లి చేయాలని

  నిరుపమ్ పెళ్లి చేయాలని పట్టుదలతో ఉన్న స్వప్న మరో ప్లాన్ వేసింది. తన భర్త సత్యంకు చెప్పి మీరు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. ఈ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లాలి. రెండు రోజులు నోరు విప్పకూడదు. విప్పితే.. కేవలం అన్నం తినడానికి, లేదా ఆవులింతకే నోరు తెరువాలి. నేను చెప్పేది మీరు ఫాలో అవ్వాలి. డిమాండ్ అనుకొండి లేదా వార్నింగ్ అనుకొండి.. మీరు ఆ ఇంటికి వెళ్లకూడదు అని స్వప్న చెబితే.. ఏదో చెప్పబోయిన సత్యంను వారించింది.

  రెండు రోజులు నోరు విప్పకూడదు.

  రెండు రోజులు నోరు విప్పకూడదు.

  హిమతోపాటు శౌర్య పెళ్లి చేసేందుకు శౌర్య ప్లాన్ వేసింది. ఓ ఫోటో చూపించి ఎలా ఉన్నాడు అని అడిగితే.. బాగున్నాడు.. ఏం తోలుతాడు. లారీనా? ఆటోనా అని సెటైర్ వేసింది. అయితే అతడు నిరుపమ్ మాదిరిగానే డాక్టర్. తల్లి లేదు. తాతకు తెలిసిన మంచి బిజినెస్ ఫ్యామిలీ. హిమ పెళ్లిలో మీ రెండో మనవరాలి పెళ్లి ఎప్పుడని అడిగితే.. ఏం చెప్పాలి.. అని సౌందర్య అంటే.. మా అమ్మ, నాన్న వచ్చినప్పుడు అని చెప్పు అని ఘాటుగా సమాధానం చెప్పి వెళ్లింది.

  నిరుపమ్‌కు శౌర్య హామీ

  నిరుపమ్‌కు శౌర్య హామీ


  నిరుపమ్‌తో శౌర్య మాట్లాడుతూ... నేను రెండు వైపులా మోసపోయాను అని అంటే.. నేను మొదటి నుంచి హిమనే ప్రేమించాను. నా వల్ల నీకు చాలా కష్టమైంది. కానీ నేను ఫ్రెండ్‌గా ఒకటే కోరుకొంటాను అని నిరుపమ్ అంటే.. ఏమని కోరుకొంటారు. ఈ ఫ్యామిలీకి దూరంగా వెళ్లాలని కోరుకొంటారా? శౌర్య అంటే.. మళ్లీ జన్మ ఉంటే నీ ప్రేమను గెలిపిస్తాను అంటే.. చాలా దగ్గర వాయిదానే పెట్టావు అని శౌర్య అంది. దాంతో నా కంట్రోల్‌లో ఏమీ లేవు. అంటే.. నా జీవితం కూడా నా కంట్రోల్ లేవు అని అన్నాడు. అయితే నీవు నా పెళ్లి జరిపించి.. నాకు ఒక సహాయం చేయాలి అని నిరుపమ్ అడిగితే.. మా అమ్మ, శోభను అడ్డుకొనే శక్తి నీకే ఉంది. నీవే దగ్గర ఉండి.. నా పెళ్లిని నీవే జరిపించాలి అంటే.. ఈ నాటకాలు చూసి విసిగిపోయాను. మీ పెళ్లి జరిపిస్తా.. ఆ శోభ, స్వప్న సంగతి నేను చూసుకొంటాను అని శౌర్య హామీ ఇచ్చింది. దాంతో నన్ను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరిపించమని కోరుకొంటున్నాను అని నిరుపమ్ అంటే.. ఈ పెళ్లి జరుగుతుంది డాక్టర్ సాబ్ అంటూ శౌర్య కన్ఫర్మ్ చేసింది.

  English summary
  Karthika Deepam 8th August Episode number 1425.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X