Just In
- 35 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 2 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 3 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- Sports
ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్
- News
సుప్రీం తీర్పుతో ఎన్నికలపై యూటర్న్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ .. అలా అనలేదట !!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పునర్నవి బర్త్ డేపై హిమజ సెటైర్స్.. స్పందించని ఆ ముగ్గురు!
బిగ్‌బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు. తెలుగులో వచ్చిన మూడు సీజన్లలో అన్నీ సక్సెస్ కాగా.. మూడో సీజన్ పార్టిసిపెంట్స్ మాత్రం మరింత ఫేమస్ అయ్యారు. షో గడిచి ఇన్ని రోజులు కావస్తున్నా.. ఇంకా వారి హల్చల్ తగ్గడం లేదు. ప్రతీ సీజన్ మాదిరిగానే మూడో సీజన్‌లో గ్రూపుల హవా నడిచింది. అందులో ముఖ్యంగా పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్) గ్యాంగ్ ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది. అయితే గత కొంతకాలంగా పునర్నవి వీరితో సరిగా ఉండటం లేదనిపిస్తోంది. ఈ మేరకు రాహుల్, వరుణ్, వితికాలే సందడి చేస్తున్నారు.

గ్యాంగ్ హల్చల్..
మూడో సీజన్‌లో లెక్కలేనన్ని గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. చివరకు పునర్నవి, రాహుల్, వరుణ్, వితికా ఒక జట్టుగా కాగా అలీ రెజా, రవికృష్ణ, హిమజ, శివజ్యోతి ఓ జట్టుగా ఉంటున్నారు. అషూ రెడ్డి అందరితో కలిసి మెలిసి ఉండగా.. శ్రీముఖి మాత్రం వీరెవరితోనూ కలవకుండా దూరంగానే ఉంటోంది.

సోషల్ మీడియాలో వైరల్..
రాహుల్, వరుణ్, వితిక గ్యాంగ్ చేసే సందడి, అలీ రెజా, రవికృష్ణ, హిమజ, శివజ్యోతి గ్యాంగ్ చేసే అల్లరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శివజ్యోతి, హిమజ, రవికృష్ణ ఇళ్లు దగ్గరదగ్గరగా ఉండటంతో ప్రతీ రోజు ఈ ముగ్గురు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితేపునర్నవి మాత్రం గత కొన్నిరోజులుగా అందరికీ దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది.

నేడు పున్ను బర్త్ డే..
నేడు (మే 28) పునర్నవి పుట్టినరోజు. ఈ మేరకు పునర్నవికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హిమజ మాత్రమే పునర్నవి బర్త్ డేపై స్పందించింది. మిగతా కంటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా విష్ చేయలేదు. రాహుల్, వరుణ్, వితిక ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.

విష్ చేసిన హిమజ..
పునర్నవి బర్త్ డేపై హిమజ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే పునర్నవి పున్ను.. నీ హృదయంలోని కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను.. త్వరలోనే నిన్ను కలుస్తాను.. లేట్‌గా విష్ చేస్తున్నందుకు సారీ.. తనతోటి మాట్లాడాకానే కన్ఫర్మేషన్ వచ్చింది' అంటూ పోస్ట్ చేసింది.

స్పందించని ఆ ముగ్గురు..
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రాహుల్, వితికాలు పునర్నవి బర్త్ డేపై స్పందిచంలేదు. నటి కల్పికా గణేష్ పుట్టిన రోజు పార్టీలో మాత్రం రాహుల్ తెగ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పోస్ట్ చేయని వీరు.. రాత్రి వరకు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.