For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Himaja ఇంట అద్భుతం.. సాయిబాబా విగ్రహం నుంచి విభూది.. నీరు కూడా మారిపోయి!

  |

  తెలుగులో నటిగా కొన్ని సీరియల్స్ లో నటించి అలాగే సినిమాలలో నటించిన హిమజకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరింత ప్రేక్షకులకు చేరువయ్యారు. అయితే ఆమె తన సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఒక వీడియో తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ వివరాల్లోకి వెళితే

  భ్రమేనా

  భ్రమేనా

  సాధారణంగా దేవి- దేవతల విగ్రహాలు పాలు తాగాయని ఒక విగ్రహం నుంచి తేనె వస్తోందని, లేదా కొన్ని విగ్రహాల నుంచి విభూది రాలుతుంది అని, లేదా కొన్ని విగ్రహాలు లేదా చిత్రపటాలు కళ్ళు తెరిచి చూశాయని ఇలా జరిగే ప్రచారాలు చాలా వింటూనే ఉంటాం. దేవుళ్ళ మీద నమ్మకం ఉన్నవారు ఇవంతా నిజమేనని నమ్ముతారు అలాగే కొందరు మాత్రం హేతువాదులు గా ఉంటూ ఇదంతా ఒట్టి భ్రమ అని తేల్చి పారేస్తూ ఉంటారు..

  రమణానంద మహర్షి ఆశ్రమంతో

  రమణానంద మహర్షి ఆశ్రమంతో

  అయితే తన జీవితంలో జరిగిన ఒక సంఘటన తాజాగా బిగ్ బాస్ హిమజా తన ఫాలోవర్స్ తో పంచుకుంది. అంతేకాక ఇక నేను ఎవరినో నిర్మించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం లేదు కేవలం నేను నా కళ్ళతో చూసిన ఒక అద్భుతాన్ని మీ అందరికీ పరిచయం చేయడం కోసమే ఇలా వీడియో చేస్తున్నానని ఆమె వెల్లడించింది.
  ఇక బిగ్ బాస్ హిమజ చెప్పిన దాని ప్రకారం, తమకు 2004 సంవత్సరంలో రమణానంద మహర్షి అనే ఒక స్వామీజీ పరిచయం అయ్యారని వెల్లడించారు.

   విభూది రాలుతుంది

  విభూది రాలుతుంది

  తాము అంతకు ముందే షిర్డీ బాబా భక్తులమే అయినా స్వామీజీ పరిచయం కావడంతో 19 రోజుల పాటు హోమం చేశాము అని చెప్పుకొచ్చారు. ఆ 19 రోజుల పాటు నిత్యం హోమం చేస్తూ భజనలు చేస్తూ సాయి జీవిత చరిత్ర పారాయణ చేసే వాళ్ళమని ఆమె అన్నారు. అలా చేస్తున్న క్రమంలో ఒకరోజు సాయిబాబా విగ్రహాన్ని శుద్ధి పరచే డ్యూటీ తనకు వచ్చిందని ఆ రోజు సాయిబాబా విగ్రహాన్ని శుద్ధి పరుస్తూ ఉండగా విగ్రహం చుట్టూ విభూది రాలుతుంది అన్న విషయం అర్థం అయిందని చెప్పుకొచ్చింది.

   జీవితంలో ఎప్పుడూ చూడలేదు

  జీవితంలో ఎప్పుడూ చూడలేదు

  తనకు ఏం చేయాలో తెలియక తన తల్లిని వెంటనే పిలిస్తే ఆమె ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచిందని అప్పుడు విగ్రహం చుట్టూ ఉన్న గోడ లో నుంచి ఈ విభూతి ఊరుతోంది అనే విషయం తనకు అర్థమైందని అంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విగ్రహం ముందు శుద్ధి కోసం ఉంచిన నీళ్లు మొత్తం తులసి నీళ్లు అయిపోయాయని అలాంటి ఘాటయిన తులసి వాసన వచ్చే నీళ్లు తన జీవితంలో ఇంకెప్పుడూ చూడలేదని కూడా చెప్పుకొచ్చింది.

  నమ్మడం కోసం కాదు

  నమ్మడం కోసం కాదు

  ఈ విషయం చెబుతుంటే నేను ఏదో నమ్మించడానికి చెబుతున్నాను అని మీరు అనుకోవచ్చు అని నేను ఎవరిని నమ్మాలి అని చెప్పడం లేదని ఇలాంటి ఒక అద్భుతమైన ఘటన నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాక అప్పటి నుంచి ఆమె బాబాకు ఇంకా భక్తులము అయిపోయామని ఆమె వెల్లడించారు. అంతేకాక ఆ విగ్రహాన్ని కూడా చూపిస్తూ వీటికి రాళ్లు కూడా తానే పొదిగాను ఈ బాబా విగ్రహం అంటే తనకు చాలా ఇష్టమని కూడా వచ్చింది.

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
   సన్యాసిగా తండ్రి

  సన్యాసిగా తండ్రి

  మరో విషయం ఏమిటంటే తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో ఆమె వివరించింది. తాను సంపాదించటం మొదలు పెట్టాక తన తండ్రికి చాలా ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్ళాలని ప్రోత్సహించానని ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు గా ఉన్నారని చెప్పుకొచ్చింది. మొత్తం మీద హిమజా చెప్పిన ఈ విషయాలు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి అని చెప్పక తప్పదు.

  English summary
  Biggboss Himaja shares a miracle of Saibaba statue in her home
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X