»   » ట్రంప్ నాతో ప్రేమలో పడ్డాడేమో..

ట్రంప్ నాతో ప్రేమలో పడ్డాడేమో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాలీవుడ్ నటుడు అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగర్ బహిరంగంగానే మాటల యుద్ధం చేస్తున్నారు. ది సెలబ్రిటీ అప్రెంటీస్ కార్యక్రమంపై మీడియాలో బాహాబాహీకి దిగారు. ట్రంప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది సెలబ్రిటీ అప్రెంటీస్ అనే కార్యక్రమాన్ని అర్నాల్డ్ చేజిక్కించుకొన్నారు. అయితే ఈ కార్యక్రమం అంతగా ప్రజాదరణ చూరగొనకపోవడంతో అప్రెంటీస్ నుంచి తప్పుకోవాలని అర్నాల్ నిశ్చయించుకొన్నారు. దాంతో అర్నాల్డ్‌కు ఇటీవల చురకలంటించారు.

అర్నాల్డ్‌ను తీసేశారు..

అర్నాల్డ్‌ను తీసేశారు..

‘అప్రెంటీస్ కార్యక్రమాన్ని అర్నాల్డ్ స్వచ్ఛందంగా వదులుకోవడం లేదు. రేటింగ్స్ సరిగా లేకపోవడంతో ఆయనను యాజమాన్యం తొలగించింది. అందుకు కారణం నేను కాదు. గొప్ప షో ముగియడం విషాదకరం. ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండో సీజన్‌కు తాను హోస్ట్‌గా రాను' ఇటీవల ట్రంప్ ట్వీట్ చేశారు.

ట్రంప్ ఆందోళన అర్థం కావడం లేదు

ట్రంప్ ఆందోళన అర్థం కావడం లేదు

ట్రంప్ ట్వీట్ ఇటీవల అర్నాల్డ్ స్పందించారు. ఓ రేడియో షోలో మాట్లాడుతూ.. ట్రంప్ ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారో తెలియడం లేదు. ఈ విషయంపై అతిగా స్పందించారు. బహుశా అతను నాతో ప్రేమలో పడ్డాడేమో అని అర్నాల్డ్ ప్రతిస్పందించారు.

ట్రంప్ అలానే చేశారు గదా..

ట్రంప్ అలానే చేశారు గదా..

అంతకుముందు హాలీవుడ్ సెలబ్రీటీలు మెరిల్ స్ట్రిప్, క్రిస్టెన్ స్టెవార్ట్ నుంచి ఈ కార్యక్రమాన్ని ట్రంప్ లాగేసుకొన్నారనే విషయాన్ని అర్నాల్డ్ గుర్తు చేశారు.

.రియాల్టీషోకు ట్రంప్ క్రేజ్

.రియాల్టీషోకు ట్రంప్ క్రేజ్

ది సెలబ్రిటీ అప్రెంటీస్ అనే కార్యక్రమం అమెరికాలో అత్యంత రేటింగ్ ఉన్న టెలివిజన్ ప్రోగ్రాం. ఇది ఒక రియాల్టీ షో. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ హోస్ట్‌గా వ్యవహరించారు. 2017లో ఈ కార్యక్రమాన్ని ట్రంప్ నుంచి అర్నాల్డ్ చేజిక్కించుకొన్నారు.

English summary
The Celebrity Apprentice is an American television reality competition series. It is a variation of The Apprentice series which was hosted by Arnold Schwarzenegger in 2017 and was originally hosted by Donald Trump. In this occassion Trump says that Arnold Schwarzenegger isn't voluntarily leaving the Apprentice, he was fired by his bad (pathetic) ratings, not by me. Sad end to great show."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu