twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వాన్ని రేప్ చేశారు, ఇంకా ఎంత మంది బలికావాలి: యాంకర్ రష్మి ఆవేదన

    |

    ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో జరిగిన చిన్నారి ట్వింకిల్ శర్మ హత్య ఘటనపై తెలుగు యాంకర్, నటి రష్మి గౌతమ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇది అత్యంత దారుణమైన ఘటన, ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ హత్య కేసులో నిందితుడు మహ్మద్ జాహిద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్వింకిల్ తల్లిదండ్రులు జాహిద్‌కు రూ. 10వేల రూపాయలు అప్పు ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం స్వాధీనం చేసుకునే సమయానికి సగం కాలిపోయి ఉండటంతో పాటు కుక్కలు పీక్కు తింటున్నాయి. అయితే రేప్ జరుగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

    మానవత్వాన్ని రేప్ చేశారు

    ట్వింకిల్ శర్మ ఘటనపై రష్మి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. హౌ వి వండర్ హౌ యు ఆర్ #జస్టిస్‌ఫర్‌ట్వింకిల్. కఠినమైన చట్టాలు రావడానికి ముందు ఇంకా ఎంత మంది బలికావాలి. మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు' అని మండి పడ్డారు.

    గరుడ పురాణాన్ని అనుసరిస్తూ పబ్లిగ్గా చంపేయాలి

    రష్మి ట్వీట్ మీద పలువురు నెటిజన్లు స్పందించారు. ఇలాంటి దారుణాలు ఆగాలంటే... నేరాలకు పాల్పడిన వారిని అదే ప్రాంతంలో జనం సమక్షంలో చంపేయాలి. వీరిని శిక్షించడానికి గరుడపురాణంలోని పద్దతులను ఉపయోగించాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

    కఠిన చట్టాలు వస్తాయనే నమ్మకం లేదు

    మన దేశంలో ఇంకా కఠినమైన చట్టాలు వస్తాయని మీరు నమ్ముతున్నారా? అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి చట్టాలు వచ్చేదుంటే మొదటి నేరం జరిగినపుడే వచ్చేవి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా రావడం లేదంటే... ఆ విషయంలో మనం ఆశలు వదులుకోవాల్సిందే అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

    మరణ శిక్ష వేసినా నేరాలు జరుగుతూనే ఉంటాయి

    మరణ శిక్ష వేసినా...ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మారాల్సింది మనుష్యుల ఆలోచన విధానం. మనుషుల్లో మార్పు వచ్చినపుడే ఇలాంటి దారుణాలు జరుగడం తగ్గిపోతుందని మరికొందరు వాదిస్తున్నారు.

    English summary
    "Twinkle twinkle little star how we wonder how you are #JusticeForTwinkle. How many more before strict laws come into place. Humanity has been raped." Rashmi Goutham tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X