For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సోషల్ మీడియా సెలెబ్రిటీతో హైపర్ ఆది పెళ్లి: ఆ షోలో కలుసుకుని.. ఇప్పుడు ఏకంగా జంటగా కనిపించి!

  |

  హైపర్ ఆది.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా అతడు దాదాపు ఐదేళ్లుగా తనదైన శైలి కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ కమెడియన్.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపును అందుకున్నాడు. ఫలితంగా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది పెళ్లికి రెడీ అయ్యాడు. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన సెలెబ్రిటీతో అతడి వివాహం జరుగుతుంది. అసలేంటా కథ? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అలా వచ్చాడు.. అల్లుకునిపోయాడు

  అలా వచ్చాడు.. అల్లుకునిపోయాడు

  బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్ నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందులో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి ద్వారా ఇందులోకి ప్రవేశించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే టాలెంట్‌ చూపించి టీమ్ లీడర్ అయ్యాడు. దీంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు.

  స్కిట్లకు రెస్పాన్స్... ట్రెండింగ్‌లో ఆది

  స్కిట్లకు రెస్పాన్స్... ట్రెండింగ్‌లో ఆది

  జబర్ధస్త్‌ షోలో ఎన్నో టీమ్‌లు ప్రదర్శన ఇస్తున్నా హైపర్ ఆది స్కిట్లే టాప్‌లో ఉంటాయి. ఎప్పుడూ సరికొత్త అంశాలతో స్కిట్లు చేసే అతడు.. పంచుల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో మునిగేలా చేస్తుంటాడు. అందుకే అతడి టీమ్‌కు సంబంధించిన స్కిట్లకు యూట్యూబ్‌లో భారీ స్పందన వస్తోంది. ఇలా ఎక్కువ వ్యూస్ సాధిస్తూ ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేస్తున్నాడీ కమెడియన్.

  పంచుల వర్షం.. దండయాత్ర చేసేస్తూ

  పంచుల వర్షం.. దండయాత్ర చేసేస్తూ

  టీమ్‌లో ఎంత మంది ఉన్నా వాళ్లందరినీ కనిపించకుండా చేస్తాడు హైపర్ ఆది. అంతలా అతడు ఎదుటి వారిపై గుక్క తిప్పుకోకుండా పంచులు వేస్తూ దండయాత్ర చేస్తుంటాడు. ఇందులో భాగంగానే తన స్కిట్లలో ఎక్కువ శాతం ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే టీమ్ లీడర్లు, జడ్జ్‌లు, యాంకర్లను కూడా వదలిపెట్టకుండా వాళ్లపైనా పంచులు విసురుతుంటాడు.

  అమ్మాయిలను సందడి... వార్తల్లోకి

  అమ్మాయిలను సందడి... వార్తల్లోకి

  హైపర్ ఆది స్కిట్ అంటే పక్కన ఒక అమ్మాయి ఉండాల్సిందే అన్న టాక్ ఉంది. ఆ విధంగా అతడు తన ప్రతి స్కిట్‌లో ఎవరో ఒక యువతిని తీసుకొచ్చి పెర్ఫార్మ్ చేయిస్తుంటాడు. అలా ఇప్పటికే ఎంతో మందిని గెస్టులుగా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిలు కూడా చాలా ఫేమస్ అయ్యారు. అందులో జబర్ధస్త్ వర్ష కూడా ఒకరు. ఆది వల్ల వచ్చిన ఆమె.. ఇప్పుడు షోలో పర్మినెంట్ అయింది.

  ఆ సెలెబ్రిటీతో హైపర్ ఆది వివాహం

  ఆ సెలెబ్రిటీతో హైపర్ ఆది వివాహం

  బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తన హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది. ఈ క్రమంలోనే మరిన్ని ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లోనూ నిలుస్తున్నాడతను. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియా సెలెబ్రిటీ దీపిక పిల్లితో హైపర్ ఆది పెళ్లికి సిద్ధం అయిపోయాడు.

  ఇప్పుడు ఏకంగా జంటగా కనిపించి

  ఇప్పుడు ఏకంగా జంటగా కనిపించి

  వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్ధస్త్ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎప్పటి లాగే హైపర్ ఆదిని హైలైట్ చేశారు. ఇందులో అతడు పెళ్లి కొడుకు గెటప్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా గుర్తింపును తెచ్చుకుని.. ‘ఢీ' షోలో మెంటర్‌గా చేస్తున్న దీపిక పిల్లిని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వీడియో వైరల్ అయిపోయింది.

  వీళ్లతో పాటు యూట్యూబ్ జోడీ కూడా

  వీళ్లతో పాటు యూట్యూబ్ జోడీ కూడా

  ఓ స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది.. దీపిక పిల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులోనే సుడిగాలి సుధీర్‌.. యాంకర్ రష్మీ గౌతమ్‌ను వివాహమాడబోతున్నాడు. ఈ రెండు జంటలనూ జడ్జ్‌లు రోజా, మనో దగ్గరుండి మరీ స్టేజ్ మీదకు తీసుకుని వచ్చారు. దీంతో వచ్చే వారం జరిగే ఎపిసోడ్ సందడిగా సాగబోతుంది. వీళ్లతో పాటు మిగిలిన టీమ్‌ల స్కిట్లు కూడా అదరగొట్టేలా కనిపిస్తున్నాయి.

  English summary
  Telugu Talented Comedian Hyper Aadi Married to Social Media Sensation Deepika Pilli in Jabardasth. This Video Gone Viral in Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X