For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hyper Aadi: హైపర్ ఆదితో హీరోయిన్ ఎంగేజ్ మెంట్.. తేల్చి చెప్పేసిన ముద్దుగుమ్మ

  |

  తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లలో ముందుగా ఉండే పేరు సుడిగాలి సుధీర్. యాంకర్ రష్మి-సుడిగాలి సుధీర్ మధ్య ఏదో కహానీ నడుస్తుందని వార్తలు అయితే వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బుల్లితెర మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్స్ లలో హైపర్ ఆది కూడా ఒకరు. రైటర్ గా, ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, డ్యాన్స్ షోలో టీమ్ లీడర్ గా అతని కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అంతేకాకుండా హైపర్ ఆదికి మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాలో కామెడీ స్కిట్స్ రాసే అవకాశం కూడా వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా హైపర్ ఆదితో తనకు ఎంగేజ్ మెంట్ అయిందని అందరిముందే తేల్చిచెప్పిసింది బ్యూటిఫుల్ హీరోయిన్.

  టీమ్ లీడర్‌గా ప్రమోషన్..

  టీమ్ లీడర్‌గా ప్రమోషన్..

  సినిమా స్ఫూఫ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఆది జబర్ధస్త్‌ షోలోకి రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్టిస్టుగా మారి ఎన్నో స్కిట్లలో చేశాడు. ఇలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో అతడు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ పొందాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లాడు. ఇలా అతడి కెరీర్ జబర్ధస్త్‌గా సాగుతోంది.

  సినిమాల్లోకి కూడా ఎంట్రీ..

  సినిమాల్లోకి కూడా ఎంట్రీ..

  జబర్ధస్త్ షో వల్ల హైపర్ ఆది కెరీర్‌ దిగ్విజయంగా సాగుతోంది. దీంతో అతడికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ తన శైలిని చూపించాడు. ఇలా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్‌ చేశాడు. అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' మూవీతో డైలాగ్ రైటర్‌గానూ మారాడు.

  చాలా గ్యాప్ తర్వాత..

  చాలా గ్యాప్ తర్వాత..

  జబర్ధస్త్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ టీమ్‌ లీడర్‌గా హవాను చూపించిన హైపర్ ఆది.. కొంత కాలం పాటు ఆ షోలో కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్యాప్ తర్వాత అతడు షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలలో కూడా సందడి చేస్తూ ముందుకెళ్తున్నాడు. తద్వారా తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ మరింత హైలైట్ అవుతున్నాడు.

  నాలుగు టీమ్‌లకు పోటీ..

  నాలుగు టీమ్‌లకు పోటీ..

  సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న 'ఢీ 14: డాన్సింగ్ ఐకాన్' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అందులో ఒక టీమ్‌కు హైపర్ ఆది మెంటర్‌గా చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్, రష్మీ వెళ్లిపోయిన తర్వాత పడిపోయిన ఈ షోను.. ఆది తన కామెడీతో విజయవంతం చేయాలని ట్రై చేస్తున్నాడు.

   యూట్యూబ్ లో వీడియోలు హల్ చల్..

  యూట్యూబ్ లో వీడియోలు హల్ చల్..

  అయితే సుధీర్, రష్మీల మధ్య ప్రేమ ఉన్నట్లు టీవీ షోలు, బుల్లితెర ఇండస్ట్రీలో ఉన్నవారు నమ్మే అవకాశాలు ఉన్నాయి. కానీ హైపర్ ఆది విషయంలో ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కడా వినిపించలేదు. కానీ అతనికి పెళ్లి అయిపోయినట్లు రెండు, మూడు సార్లు యూట్యూబ్ లో వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఓ బ్యూటిఫుల్ హీరోయిన్ హైపర్ ఆదితో ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తేల్చి చెప్పింది.

   జడ్జ్ లకు టీమ్ లీడర్లు లైన్ వేయడం..

  జడ్జ్ లకు టీమ్ లీడర్లు లైన్ వేయడం..


  'ఢీ 14: డాన్సింగ్ ఐకాన్' షోలో బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో శ్రద్ధా దాస్ కోసం ఇక హైపర్ ఆది పడే పాట్లు కామెడీగా చూపించి ఎంటర్టైన్ చేస్తారు. ఇందులో భాగంగానే జడ్జ్ లకు టీమ్ లీడర్లు లైన్ వేయడం, వాళ్ల మధ్య ప్రేమ పుట్టుకొస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సందర్భంగా ఆదితో నా ఎంగేజ్ మెంట్ అయిపోయింది అని శ్రద్ధా దాస్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది.

  ఆదితో ఎంగేజ్ మెంట్ అయిపోయింది..

  ఆదితో ఎంగేజ్ మెంట్ అయిపోయింది..

  ఇదంతా 'ఢీ 14: డాన్సింగ్ ఐకాన్' షో అక్టోబర్ 19 ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు. ఆదితో ఎంగేజ్ మెంట్ అయిపోయిందని శ్రద్ధా దాస్ చెప్పడంతో మిగిలిన డ్యాన్సర్లు అందరూ కలిసి హైపర్ ఆదిని శ్రద్ధా దాస్ దగ్గరకు తీసుకెళ్లారు. వేలికి ఉంగరం వంటిది ఏదో తొడిగినట్లు చేశారు. తర్వాత వాళ్లిద్దరిపై పువ్వులతో అక్షింతలుగా వేసి మిగతా వాళ్లు ఆశీర్వదించినట్లుగా చూపించారు.

  English summary
  Heroine Shraddha Das Says Her Engagement With Hyper Aadi In Dhee 14 Dancing Icon Show October 19th 2022 Promo
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X