సుడిగాలి సుధీర్ ఫినిష్.. హైపర్ ఆది డిసైడ్.. దొరకాలి గానీ వెంటనే!
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీ వాళ్లందరికీ సినిమా ఛాన్సులు తెచ్చిపెడుతోంది. యాంకర్ అనసూయ మొదలుకొని జబర్దస్త్ పార్టిసిపెంట్స్ వరకు అందరూ సినిమా ఛాన్సులు పట్టేస్తున్నారు. ఈ బాటలోనే కామెడీ పంచ్‌లతో పరేషాన్ చేసే హైపర్ ఆది కూడా హీరో కాబోతున్నాడట.

ఒక్కో కమెడియన్ ఒక్కో టైపులో..
జబర్దస్త్ కామెడీ షో నుంచి వస్తున్న ఒక్కో కమెడియన్ ఒక్కో టైపులో వెండితెరపై కాలుమోపుతున్నారు. కొందరు చిన్న చిన్న పాత్రలు చేస్తే.. మరికొందరు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్లలో సుడిగాలి సుధీర్, ధన్‌రాజ్, శంకర్ లాంటి వాళ్లు హీరోలు అయ్యారు కూడా. ఇదే బాటలో తానూ హీరోనవుతా అంటున్నాడు హైపర్ ఆది.

హైపర్ ఆది డిసైడ్
బుల్లితెరపై తనదైన పంచ్ డైలాగులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది.. ఇప్పుడు వెండితెర హీరో కావాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. ఇప్పటికే చిన్నచిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఏకంగా హీరో అవుతున్నా అంటున్నాడు.

సుధీర్‌తో పరిచయం.. ఆ తర్వాత
ఇటీవలే ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఓపెన్ అయ్యాడు. సుడిగాలి సుదీర్ గురించి మాట్లాడుతూ అతనంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే ఆయన హీరోగా నటించిన చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో సుధీర్‌తో పరిచయం జరిగిందని, ఆ తర్వాత ఇద్దరం కలసి చాలా స్కిట్స్ చేశామని హైపర్ ఆది చెప్పాడు.

దొరికితే రెడీ.. అవకాశం ఉంది
''త్వరలోనే నేను కూడా సుధీర్ లాగే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. నాకు పాటలు, ఫైట్లు అంతగా సెట్ కావు. కానీ ఒకవేళ చేస్తే అవి కూడా కామెడీగా చేసేస్తా. ప్రస్తుతానికి పాటలు, డాన్సులు లేని మంచి కథను ఎంచుకోవాలని భావిస్తున్నాను. ఆ రకమైన కథలే వింటున్నాను. మంచి కథ దొరికితే రెడీ'' అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.


Click it and Unblock the Notifications











