Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బయటపడ్డ రష్మీ సుధీర్ లవ్: తనే నా అదృష్టం అంటూ.. మొత్తానికి పెళ్లి వరకూ తీసుకెళ్లాడు.!
తెలుగు బుల్లితెరపై కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్.. జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్. ఒంటరిగా ఎంతగానో ఫేమస్ అయిన వీళ్లిద్దరూ.. జంటగా అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, తాజాగా రష్మీ సుధీర్ తమ మధ్య ప్రేమను మరోసారి బయట పెట్టేశారు. నువ్వే నా అదృష్టం అంటూ ఒకరు.. నిన్ను మిస్ అవుతున్నా అంటూ మరొకరు కామెంట్స్ చేసుకోవడం వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే....

అక్కడ కలిసి.. జోడీగా రెచ్చిపోతున్నారు
ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఎంతో మందిని వెలుగులోకి తీసుకు వచ్చింది. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్, కమెడియన్ సుడిగాలి సుధీర్‌ను కూడా బాగా ఫేమస్ చేసింది. వీళ్లిద్దరూ ఆ షోలో కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జంటగా కనిపిస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు.

బుల్లితెరపై ఫేమస్... యూట్యూబ్ జోడీగా
తమ మధ్య ఏదో ఉన్నట్లు కలరింగ్ ఇస్తుంటారు రష్మీ - సుధీర్. తరచూ ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఉంటారు. దీంతో వీళ్లిద్దరూ జంటగా బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. అదే సమయంలో వీళ్లు యూట్యూబ్ జోడీగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి కారణం రష్మీ సుధీర్‌పై ఆ సామాజిక మాధ్యమంలో ఎన్నో కథనాలు రావడమే.. అలా తరచూ వార్తల్లో నిలిచేవారు.

ఈ జంటను బాగా వాడుకుంటున్నారుగా
బుల్లితెరపై రష్మీ గౌతమ్... సుడిగాలి సుధీర్‌కు విఫరీతమైన ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ రొమాంటిక్‌గా కనిపించినా చాలు.. షోకు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే షో మేకర్లు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ జంట కోసం ప్రత్యేకమైన స్క్రిప్టును రాసి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరచూ వీళ్లతో రొమాన్స్ చేయిస్తున్నారు నిర్వహకులు.

మరోసారి బయటపడ్డ రష్మీ సుధీర్ ప్రేమ
రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమాయణం సాగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ వాళ్లు మాత్రం తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెబుతూ ఉంటారు. అదే సమయంలో రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం, డ్యాన్స్ చేయడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రేమను బయట పెట్టుకున్నారీ ఇద్దరు.
ఒకరిపై ఒకరు రొమాంటిక్‌గా కామెంట్లు
బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ'. ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. వచ్చే వారం నుంచి ‘కింగ్ వర్సెస్ క్వీన్స్' పేరిట 13వ సీజన్‌ను మొదలు పెడుతోంది. ఇందులో రష్మీ, టిక్‌టాక్ స్టార్ దీపిక ఒక టీమ్.. సుధీర్, హైపర్ ఆది మరో టీమ్‌గా ఉన్నారు. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రష్మీ సుధీర్ ఒకరిపై ఒకరు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి చేసేయమని డిమాండ్ చేసిన ఆది
ప్రోమో చివర్లో ‘కలిసి డ్యాన్స్ చేసినా ఏం చేసినా అంతా ఒకటే. ఎంతైనా సుధీర్‌ను నేను మిస్ అవుతున్నా' అని రష్మీ కామెంట్లు చేసింది. ఆ వెంటనే స్పందించిన సుధీర్.. ‘నేను కూడా ఎప్పుడూ మిస్ అవుతున్నా నా లక్కీ చార్మ్' అని బదులిచ్చాడు. అక్కడే ఉన్న జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది.. ‘వాళ్లిద్దరికీ త్వరగా పెళ్లి చేసేయండి నాన్న' అంటూ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం విశేషం.