»   » ఇద్దరు పిల్లల తల్లినని చీప్‌గా.. నాగార్జునతో అలా.. రూమర్లనుపట్టించుకోను.. అనసూయ

ఇద్దరు పిల్లల తల్లినని చీప్‌గా.. నాగార్జునతో అలా.. రూమర్లనుపట్టించుకోను.. అనసూయ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ రంగంలో యాంకర్‌గా అనసూయకు పరిచయం అక్కర్లేదు. న్యూస్ రీడర్‌గా వీక్షకులకు దగ్గరై ఆ తర్వాత జబర్దస్త్‌తో ప్రతి ఇంటికి మరింత చేరువైంది. టెలివిజన్ షోలతో బిజీగా బిజీగా ఉంటునే వచ్చిన సినిమా అవకాశాలను అందిపుచ్చుకొన్నది అనసూయ. పేరు పాత చింతకాయ పచ్చడిలా ఉన్నా.. నేటి యూత్‌కు అనసూయ చెప్పలేనంత క్రేజ్. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విశేషాలను షేర్ చేసుకొన్నారు.

కావాలని కామెంట్ చేసేవారు..

కావాలని కామెంట్ చేసేవారు..

సినీ, టెలివిజన్ రంగాలలో పనిచేస్తున్నాను కాబట్టి నాలాంటి సెలబ్రిటలపై రూమర్లు ఎక్కువగానే ఉంటాయి. తెర మీద అందంగా కనిపించే నన్ను.. కావాలని కొందరు ఇద్దరు పిల్లల తల్లి అని ముఖం మీదే ఏవేవో కామెంట్లు చేసేవారు. చాలా మంది ప్రముఖులతో అఫైర్లు అంటగట్టారు. చాలా చెత్తగా రాశారు. నాపై నా కుటుంబానికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు రాలేదు అని యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది.

త్వరలో ఓ ఇంటిదానిని..

త్వరలో ఓ ఇంటిదానిని..

నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ. గ్లామర్ ఫీల్డులో డబ్బులు, పేరు బాగా వస్తాయి. ఒక అందమైన ఇంటిని కట్టుకోవాలనే కోరిక ఉంది. ఆ ఇంటిలో స్వయంగా పెంచుకొన్న కూరగాయలతో వంటచేసుకొవాలనేది మరో కోరిక ఉంది. త్వరలోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకొంటాను. అందులో సంతోషంగా జీవితాన్ని గడుపుతాను అని అనసూయ తెలిపింది.

నాగార్జునతో అవకాశం అలా..

నాగార్జునతో అవకాశం అలా..

ఓ టీవీ షోలో నన్ను చూసిన దర్శకుడు కళ్యాణ్‌ కురసాల ‘సోగ్గాడే చిన్నినాయనా'లో నటించాలని ఆఫర్ ఇచ్చాడు. ‘నాగార్జున మరదలు పాత్రకు మీరు అయితేనే బాగుంటుంది' అని అన్నాడు. దాంతో నాగ్ సరసన నటించే అవకాశం లభించింది. నాగార్జునను చూస్తూ పెరిగిన నేను ఆయన సినిమాలో నటిస్తాను ఎన్నడూ ఊహించలేదు అని చెప్పారు.

ఆ పాట నా పేరు మీదే..

ఆ పాట నా పేరు మీదే..

సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్‌ చిత్రంలో స్పెషల్‌సాంగ్‌ చేయడానికి కారణం ‘సూయ సూయ... అనసూయ' అనే పాట నా పేరు మీదే ఉండటమే. కెరీర్‌ ఆరంభంలోనే నాపై పాట కట్టడం గ్రేట్‌గా ఫీలయ్యా. అందుకు గీత రచయిత రామజోగయ్యశాస్త్రిగారికి కృతజ్ఞతలు. ఈ మధ్యనే సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాకు ఓకే చెప్పాను అని అనసూయ వెల్లడించింది.

ఆస్తులన్నీ దానం..

ఆస్తులన్నీ దానం..

మా సొంతూరు నల్గొండ జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లి. మా తాత సుందర్‌రావు భూదాన్‌ పోచంపల్లి సర్పంచ్‌గా పనిచేశారు. ఆ ఊళ్లోని 101 దర్వాజల ఇల్లు మాదే. వినోబాభావే పిలుపుతో మా తాత ఆస్తులన్నీ ఇచ్చేశారట. నాన్న రాజకీయ నాయకుడు కావడంతో మా ఇల్లు ఎప్పుడు చూసినా కార్యకర్తలతో సందడిగా ఉండేది అని ఆమె పేర్కొన్నది.

మా నాన్న రాజకీయాల్లో..

మా నాన్న రాజకీయాల్లో..

మా నాన్న సుదర్శన్‌రావు అప్పట్లో యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా పనిచేసేవారు. మాజీ కేంద్ర మంత్రి శివశంకర్‌ కుమారుడు కుమారుడు సుధీర్‌కుమార్‌‌తో (ఎల్బీనగర్‌ మాజీ ఎమ్మెల్యే) కలిసి తిరిగేవారు. ‘దర్శన్‌ అన్న'గా పార్టీలో అందరికీ సుపరిచితుడు. నా బాల్యమంతా హైదరాబాద్‌లోని ఓల్డ్‌ మలక్‌పేట లోనే గడిచింది. అక్కడి సెయింట్‌ ఆన్స్‌లో చదువుకున్నాను. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌గారు మా పొరుగునే ఉండేవారు అని తన మధురస్మృతులను అనసూయ నెమరువేసుకొన్నది.

English summary
Anchor Ansuya is pakka Hyderabadi. she grew up in Malakpet of Hyderabad. She started her carrier as News Reader. Then grabs Television, Film offers within short time. She said in recent interview that.. She never care damn rumours about her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu