»   » ఆ ఇద్దరి జీవితాల్లోకి తొంగి చూస్తా.. నా కొడుకు దూరమవుతున్నాడు.. ఎన్టీఆర్

ఆ ఇద్దరి జీవితాల్లోకి తొంగి చూస్తా.. నా కొడుకు దూరమవుతున్నాడు.. ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో టెలివిజన్ రంగంలో సరికొత్త పాత్రను పోషించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినీ ప్రేక్షకులను తన నటనతో మైమరిపించిన తారక్‌ బుల్లితెర వీక్షకులను థ్రిల్ చేయడానికి ముందుకొస్తున్నాడు. జూలై 16న ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ లాంచ్ ఈవెంట్‌ను శనివారం మాదాపూర్‌లోని ఓ హోటల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి ముచ్చటించారు.

సవాల్‌గా తీసుకొన్నాను..

సవాల్‌గా తీసుకొన్నాను..

స్క్రిప్ట్ ప్రకారం సినిమాల్లో నటించే తనకు ఎలాంటి స్రిప్ట్ లేకుండా టెలివిజన్‌పై కనిపించే అవకాశం వస్తుందని ఊహించలేదు. టెలివిజన్‌పై హోస్ట్‌గా రాణించడం ఓ సవాల్‌తో కూడుకొన్నది. ఛాలెంజ్‌లను ఫేస్ చేయడం నాకు మొదటి నుంచి అలవాటే. సవాళ్లను ఎదురించడమంటే చాలా ఇష్టం అని ఎన్టీఆర్ అన్నారు. బుల్లితెర ప్రేక్షకులను కూడా సంతృప్తి పరుస్తాననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 చాలా ఒత్తిడి పెరిగింది..

చాలా ఒత్తిడి పెరిగింది..

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్‌ను చూడలేదు. కానీ నా కజిన్ ఒకరు బిగ్‌బాస్ షోకు పిచ్చ ఫ్యాన్. ఓ సారి ఆమెను చూస్తే ఎంత మొత్తంలో ఆ కార్యక్రమంలో ఆమె ఆస్వాదిస్తుందో అర్థమైంది. దాంతో బిగ్‌బాస్ పవర్ ఏంటో తెలిసింది. ఇప్పడు బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం వచ్చినప్పుడు చాలా మంది నన్ను ఆ కార్యక్రమాన్ని చేయాలని చాలా ఒత్తిడి తెచ్చారు. అని ఎన్టీఆర్ అన్నారు.

ఆ రోజుకు ఏది తోస్తే అదే చేస్తాను..

ఆ రోజుకు ఏది తోస్తే అదే చేస్తాను..

బిగ్‌బాస్ షో వెల్ డిజైన్డ్ ప్రోగ్రాం. చాలా లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని ఎలా అధిగమించారు. ఈ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి మీరు చర్యలు తీసుకొన్నారు అనే ప్రశ్నకు స్పందిస్తూ.. దేనికైనా నేను ప్రిపేర్ కావడం అంటూ ఉండదు. ఆ రోజుకు ఏది తోస్తే దానిని చేయడం నాకు అలవాటు. ఇప్పుడంతా నాకు అంతా కొత్తగా ఉంది. డిజైనర్లు సూట్లు ధరించాలని సూచిస్తున్నారు. జీవితంలో ఆ క్షణంలో ఏది ఎదురుపడితే దానిని నేను ఆస్వాదిస్తాను అని అన్నారు.

నా భార్య, కొడుకుల జీవితంలోకి..

నా భార్య, కొడుకుల జీవితంలోకి..

ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఓ ఇంటిలో ఉండే వారిని గమనించడం హోస్ట్‌గా నా రోల్. 70 రోజుల్లో వారి జీవితాల్లో జరిగే సంఘటనలను చూసి నేను దానికి స్పందించాల్సి ఉంటుంది. ఇది పక్కన పడితే నిజజీవితంలో నా భార్య, కొడుకుల జీవితంలో ఏం జరుగుతున్నదో చూడాలనే కోరిక కలుగుతున్నది అని తారక్ చెప్పారు.

 నా కొడుకు నాకు దూరమవుతున్నాడు..

నా కొడుకు నాకు దూరమవుతున్నాడు..

జై లవకుశ, బిగ్‌బాస్ సినిమా షూటింగ్‌ల కారణంగా నా కొడుకును కలువలేకుండా పరిస్థితి ఉంది. అయితే నేను ఉదయం షూటింగ్‌కు వెళ్తే సమయానికి నా కొడుకు నిద్రపోతుంటాడు. రాత్రి ఇంటికి వచ్చే సమయానికి మళ్లీ నిద్రలోనే కనిపిస్తాడు. వాడికి నాకు మధ్య దూరం పెరిగింది. అది ఎంత మొత్తంలో ప్రభావం చూపిస్తున్నదో చూస్తే చాలా భయంగా ఉంది ఎన్టీఆర్ తెలిపాడు

ఆ ఇద్దరి జీవితాల్లో సీక్రెట్స్ చూడాలనుకొంటున్నాను..

ఆ ఇద్దరి జీవితాల్లో సీక్రెట్స్ చూడాలనుకొంటున్నాను..

గతంలో నా కుమారుడు అమ్మ, నాన్నలో ఎవరు ఇష్టమని అడిగితే.. నా పేరు చెప్పేవాడు. ఇప్పడు వాడు వాళ్ల అమ్మ పేరు చెప్తున్నాడు. అంటే వాడికి నాకు మధ్య అంత దూరం పెరిగిపోయింది. ఇంట్లో నేను లేని సమయంలో నా కొడుకు, నా భర్య మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతున్నదో, అమ్మ అని ఇష్టమనేంతగా వారి మధ్య ఉన్న సీక్రెట్స్ చూడాలనే కుతుహలం కలుగుతున్నది అని ఎన్టీఆర్ చలాకీగా సమాధానమిచ్చారు.

English summary
Young Tiger NTR's Bigboss is ready for broadcast on July 16th. In this occassion, Bigboss pre launch event conducted at Madhapur of Hyderabad. He revealed lot of things in Media chat. NTR said he was missing the his son Abhayram with hectic schedule.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu