Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bigg Boss Telugu 6: ఇనయా సుల్తానా రెమ్యునరేషన్.. మొత్తం ఎంత ఇచ్చారంటే?
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో ముగింపు దశకు చేరుకుంటున్న కొద్ది ఊహించని ట్విస్ట్ లు అయితే చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు బిగ్ బాస్ నీరసంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ మరికొన్నిసార్లు కంటెస్టెంట్స్ వారి స్ట్రాటజీ తో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంలో ముందుగానే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇనయా సుల్తానా ఎలిమినేట్ అని లీక్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆమె 14 వారాలకు గాను మొత్తం రెమ్యునరేషన్ ఎంత అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

ఆ ఇద్దరిలో..
రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ ఈ వారం ఎలిమినేషన్ లోనే ఆరుగురు ఉన్నారు. అయితే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రావడం ద్వారా అతనికి నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఈ వారం తక్కువ ఓట్ల అందుకున్న వారు తప్పకుండా వెళ్లిపోతారు అని అనుకున్నారు. అందులో కీర్తి శ్రీ సత్య పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోవడం ఖాయం అని అనుకున్నారు.

మొదట్లో లక్కుతో..
అయితే ఊహించిన విధంగా ఇనయా వెళ్లిపోతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఆమె గత రెండు మూడు వారాలా నుంచి ఆమె చాలా బాగా గేమ్ ఆడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వినాయక సుల్తానాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది అని చెప్పవచ్చు. మొదట్లో లక్కుతో వచ్చినప్పటికీ ఆ తరువాత జనాల సపోర్ట్ అందుకునేలా గేమ్ ఆడింది. ఇక గత వారం కూడా ఆమె తన కామెడీ టైమింగ్ తో కూడా ఎంతగానో మెప్పించింది.

అబ్బాయిలతో పోటీపడుతూ
పోటీగా నలుగురు బలమైన అబ్బాయిలు ఉన్నప్పటికీ కూడా ఇనయా సుల్తానా ఏమాత్రం తక్కువ కాకుండా వారితో పోటీ పడింది. ముఖ్యంగా రేవంత్ శ్రీహన్ తో కూడా ఆమె ప్రతి టాస్క్ లో సై అంటూ సత్తా చాటే ప్రయత్నం చేసింది. కానీ ఈ వారం మాత్రం ఇనయా సుల్తానా చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఆమె వెళ్లిపోవడానికి ప్రభావం చూపాయి. అయితే అవి ఏమీ కూడా ఎలిమినేట్ చేసేంత పెద్ద తప్పులేమి కావు. అయినప్పటికీ బిగ్ బాస్ ఆమెను పంపిస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వారికంటే బెస్ట్
ప్రస్తుతం ఉన్న మహిళలలో కూడా ఇనయా సుల్తానా బెస్ట్ కంటెంట్ అని కూడా చెప్పవచ్చు. కీర్తి అయితే సెంటిమెంటుతోనే ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రయత్నం చేసింది. మరో అమ్మాయి శ్రీ సత్య కూడా దాదాపు అదే తరహాలో హైలైట్ అవుతూ వచ్చింది. కానీ ఇనయా సుల్తానా మాత్రమే ప్రతి టాస్క్ లో అబ్బాయిలతో పొట్లాడుతూ వారి కంటే బెస్ట్ ఇచ్చింది. ఆ విషయంలో అయితే ఆమెను మెచ్చుకోవాలి.

రెమ్యునరేషన్ ఎంతంటే..
ఇక బిగ్ బాస్ లో 14 వారాలు ఉన్నందుకు ఆమెకు మంచి రెమ్యునరేషన్ కూడా అందినట్లుగా తెలుస్తోంది. ఆమె వారానికి రూ.15 వేల రూపాయలను అందుకుంటూ వచ్చింది. ఒక విధంగా బిగ్ బాస్ లో ఈసారి అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఇనయా సుల్తానా కూడా ఉంది. ఇక ఆమె మొత్తం 14 వారాలకు గాను రెండు లక్షల పదివేల రూపాయలు సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా టాప్ 5లో ఉంటుంది అనుకున్న సుల్తానా ఇప్పుడు ఎలిమినేట్ అవుతూ ఉండడం ఓ వర్గం వారికి మాత్రం నచ్చడం లేదు.