For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6 Elimination షాకింగ్‌గా ఇనయా ఎలిమినేషన్.. ఎక్కడ దెబ్బ పడిందంటే?

  |

  బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికీ ఈ సీజన్ 96 రోజులు 97 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించేందుకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల్లోఅనూహ్య పరిణామాలు, విచిత్ర సంఘటలు, రొమాన్సులు, అరుపులు, గొడవలు, విభేదాలు, స్నేహం, శత్రుత్వం వంటి అనేక ఎమోషన్స్, సీన్స్ తో బాగానే సాగింది ఈ సీజన్. అలాగే టాప్ లో ఉండే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి ఇంటి బాట పడుతున్నారు. తాజాగా లేడీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్జీవీ బ్యూటి ఇనయా సుల్తానా అస్సలు ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఆ వివరాళ్లోకి వెళితే..

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ

  21 మంది సెలబ్రిటీల ఎంట్రీ

  సెప్టెంబర్ 4న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ను ప్రారంభించారు. ఈ 6 సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావు, రేవంత్‌‌లు 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు.

  నామినేషన్లలో ఆరుగురు..

  నామినేషన్లలో ఆరుగురు..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో 13 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, ఫైమా ఇలా 14 మంది వెళ్లిపోయారు. దీంతో హౌజ్ లో ఏడుగురు మిగిలారు. వీరిలో శ్రీహాన్ తప్పా మిగిలిన ఆరుగురు 14వ వారం నామినేషన్లలో ఉన్నారు.

   బర్త్ డేకు అతిథిగా వెళ్లడంతో..

  బర్త్ డేకు అతిథిగా వెళ్లడంతో..

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అందులో డైరెక్టర్ రామ్ గోపాల్ ద్వారా పాపులర్ అయిన ఇనయా సుల్తానా ఒకరు. ఇనయా బర్త్ డేకు గెస్ట్ గా వెళ్లిన దర్శకుడు ఆర్జీవీ ఆమెతో కలిసి పార్టీలో చిందులేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయంది. అలాగే పలు విమర్శలు కూడా ఎదుర్కొంది. అదే ఆమెకు బిగ్ బాస్ ఎంట్రీకి అవకాశంగా మారిందని పలువురు భావించారు.

  ఎలాంటి అంచనాలు లేకుండా..

  ఎలాంటి అంచనాలు లేకుండా..

  బర్త్ డే పార్టీలో ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా సుల్తానా. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండు వారాళ్లో వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తనదైన ఆట తీరుతో ఇప్పటివరకు ఆకట్టుకోవడమే కాకుండా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన రేవంత్ కు గట్టి పోటీ అని ప్రేక్షకులు అనుకుంటూ వచ్చారు.

  ఆర్జే సూర్యతో బాండింగ్..

  ఆర్జే సూర్యతో బాండింగ్..

  బిగ్ బాస్ హౌజ్ లో ఇనయాకు తొలిసారిగా బాత్రూమ్ విషయంలో గీతూ రాయల్ తో గొడవ మొదలైంది. తర్వాత శ్రీహాన్ తో పిట్ట గొడవ కొద్ది రోజులు నడిచింది. ఈ క్రమంలోనే ఆరోహి రావు ఎలిమినేట్ అయ్యాక ఇనయా, ఆర్జే సూర్యల మధ్య బాండింగ్ పెరిగింది. తరచు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటివి జరిగాయి. దీంతో ఒక వారమంతా ఇనయాలో ఫైర్ లేకుండా పూర్తిగా కనిపించకుండా పోయింది.

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటి..

  ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటి..

  వీకెండ్ లో నాగార్జున చెప్పడం, ఆర్జే సూర్య ఎలిమినేట్ కావడంతో మళ్లీ పూర్తిగా గేమ్ ట్రాక్ లోకి వచ్చింది ఇనయా సుల్తానా. ఇక అప్పటినుంచి ప్రేక్షకుల మన్నలను పొందేలా తన ఆట తీరును మెరుగుపరుచుకుంది. ఫిజికల్ టాస్క్ ల్లో సైతం గట్టి పోటి ఇస్తూ అబ్బాయిలకు సరిసమానమనేలా లేడీ టైగర్ అనిపించుకుంది. టైటిల్ విన్నర రేస్ లో పరిగెడుతున్న రేవంత్ కు ఇనయా మాత్రమే గట్టి పోటి అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా.

  విన్నర్ మెటీరియల్ అని..

  విన్నర్ మెటీరియల్ అని..

  అయితే తాజగా 14వ వారం నామినేషన్లలో ఉన్నవాళ్లలో అనూహ్యంగా, మోస్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న లేడీ టైగర్ ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయినట్లు బీబీ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఇనయా ఎలిమినేషన్ పెను సంచలనంగా మారింది. ఎందుకంటే తనదైన శైలీలో గేమ్ ఆడుతూ విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాందించుకుంది ఇనయా. దీంతో ఆమె కచ్చితంగా టాప్ 2 లేదా టాప్ 3లో ఉంటుందని అంతా భావించారు. అంతేకాకుండా ఆమె విన్నర్ మెటిరీయల్ అని కూడా ఒక వర్గం ప్రేక్షకులు అనుకున్నారు.

   అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ..

  అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఏ లేడి కంటెస్టెంట్ సంపాదించుకోలేని ఫ్యాన్ బేస్ ను ఇనయా సాధించుకుంది. అయితే అనూహ్యంగా ఇనయా ఎలిమినేట్ కావడం ఆమె ఫ్యాన్స్ తీసుకోలేకపోతున్నారు. అలాగే ఇనయాకు ఓటింగ్ బాగానే పడిందని, కానీ బీబీ టీమ్ తమకు నచ్చిన, మెనేజ్ మెంట్ కోటా కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడం కోసమే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశారని టాక్ వినిపిస్తుంది. కానీ ప్రేక్షకులకు మాత్రం ఇనయా ఓటింగ్ తక్కువ ఉన్నట్లు ఫేక్ గా చూపించారని విమర్శలు చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu 6: Nagarjuna Eliminated Inaya Sultana On 14th Week
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X