twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ ...ఎలా సాగుతుంది? సామాన్యులకు చోటు లేదా?

    తెలుగు వెర్షన్ ‘బిగ్ బాస్’ త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్లో సానమాన్యలకు చోటు లేదని తెలుస్తోంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ త్వరలో 'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక భిన్నమైన రియాల్టీ షో కాబట్టి అసలు ఈ షో ఎలా ఉంటుంది? ఏ విధంగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తుంది? అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు.

    ఈ షోను అఫీషియల్ గా లాంచ్ చేస్తూ స్టార్ మా టీవీ వారు షోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ షో నిర్వహణ ఎలా ఉంటుంది? ఎంత మంది ఈ షోలో పాల్గొంటారు అనే విషయాలను వివరించే ప్రయత్నం చేసింది.

    మొత్తం 12 మంది పోటీదారు

    మొత్తం 12 మంది పోటీదారు

    ఈ రియాల్టీ షోలో మొత్తం 12 మంది పోటీ దారులు ఉంటారు. వీరందరినీ ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి పంపించి తాళం వేస్తారు. వారి కదలికలను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు.

    భిన్నమై వాతావరణం

    భిన్నమై వాతావరణం

    బిగ్ బాస్ హౌస్ లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. అందులో వాళ్లు బ్రతకడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ సెల్‌ఫోన్ లు, టీవీలు, దినపత్రికలు వంటివి కూడా వారికి అందుబాటులో ఉండవు. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు ఉండవు.

    వారి భావోద్వేగాలే ఎంటర్టెన్మెంట్

    వారి భావోద్వేగాలే ఎంటర్టెన్మెంట్

    ఒక భిన్నమైన పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ లో గడుపుతున్న వారి.... భావోద్వేగాలు ఎలా ఉంటాయో గమనించడమే ప్రేక్షకలు ఎంటర్టెన్మెంట్. విభిన్న రంగాలకు చెందిన, భిన్నమైన అభిరుచులు కలిగిన పలువురు సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే చోట ఎలా ఉంటారన్నదే ఈ షోలో ఆసక్తికరం.

    సామాన్యలకు చోటు లేదు

    సామాన్యలకు చోటు లేదు

    హిందీ బిగ్ బాస్ లో సామాన్యులు, సెలబ్రిటీలు కలిసి పాల్గొనే వారు. తెలుగులో ఇదే మొదటి సీజన్ కాబట్టి ప్రస్తుతానికి సామాన్యులకు అవకాశం లేదు. కేవలం సెలబ్రిటీలతోనే తొలి సీజన్ నిర్వహించబోతున్నారు.

    ఎన్టీఆర్ హెస్ట్

    ఎన్టీఆర్ హెస్ట్

    ఎన్టీఆర్ ఈ షోకు హెస్ట్‌గా వ్యవహరించనున్నారు. హిందీ వెర్షన్ బిగ్ బాస్ షోకు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించినట్లుగా తెలుగులో ఎన్టీఆర్ చేయబోతున్నారు.

    భారీ రెమ్యూనరేషన్

    భారీ రెమ్యూనరేషన్

    'బిగ్ బాస్' తెలుగు వెర్షన్ రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న జూ ఎన్టీఆర్..... ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర రంగంలో ఎవరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్.

    అందరికంటే ఎక్కువ

    అందరికంటే ఎక్కువ

    రెమ్యూనరేషన్ విషయంలో జూ ఎన్టీఆర్ అందరినీ కొట్టేసారని ప్రచారం జరుగుతోంది. నాగార్జున, చిరంజీవిలు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని, అయితే జూ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోకు రూ. 7 కోట్ల తీసుకుంటున్నట్లు టాక్.

    ఇదే తొలిసారి

    ఇదే తొలిసారి

    తెలుగు బెల్లితెర రంగంలో ఒక హోస్ట్ కు రూ. 7 కోట్ల భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జూ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

    ఎన్నో వివాదాలు

    ఎన్నో వివాదాలు

    హిందీలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్' షోపై ఎన్నో వివాదాలున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రెటీల ప్రవర్తన చాలా వివాదస్పదంగా ఉండటమే అందుకు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    తెలుగులో

    తెలుగులో

    హిందీలో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో తెలుగులో కూడా ఈ షోకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

    English summary
    In line with its commitment of “Sarikotha Uttejam”, STAR Maa is all set to bring to its viewers an unprecedented and explosive viewing experience with one of the biggest reality shows, Bigg Boss. And hosting this show will be none other than the sensational and talented Junior NTR. Bigg Boss is the Indian version of the international format Big Brother, one of the most successful reality television series ever. The Endemol owned format BIG BROTHER has had 10 blockbuster seasons in Hindi with Salman Khan as the host.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X