For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాత్రూంలో అడ్డంగా దొరికిన హరితేజ, అర్చన.. దీక్షతో శివబాలాజీ.. దొంగచాటుగా డాష్ డాష్..

  By Rajababu
  |
  Bigg Boss Telugu : Hariteja And Archana Caught In Bathroom Red Handed

  తెలుగు బిగ్'బాస్ హౌస్‌లో సెలబ్రీటీలే కాదు.. సినీ ప్రముఖులు కూడా టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో వైవిధ్యాన్ని చూపుతున్నారు. శుక్రవారం 61వ ఎపిసోడ్‌లో సినీ హీరో సునీల్ సందడి చేశారు. తన చిత్రం ఉంగరాల రాంబాబు చిత్రం విడుదల సందర్భంగా గురువారం నాటి ఎపిసోడ్‌లోనే సునీల్ ఇంటిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఇంటి విషయాలకు వస్తే దీక్షాను మిగితా ఐదుగురు కంటెస్టెంట్లు ఆటలో భాగంగా కార్నర్ చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ వారం దీక్షా, హరితేజ, ఆదర్శ్, అర్చన్ ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగిన సంగతులు ఏమిటో ఓసారి చూద్దాం..

   సరదాగా సునీల్

  సరదాగా సునీల్

  బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో హీరో సునీల్ చాలా సరదాగా గడిపారు. సునీల్ కోసం వేడి వేడి పకొడీలు చేసి ఆతిథ్యం ఇచ్చారు. పకొడీలను చూసి చిన్నతనంలో తన అమ్మమ్మ చేసే పకొడీలను ఈ సందర్భంగా సునీల్ గుర్తు చేసుకొన్నారు. ఇంటికి సంబంధించిన రేషన్ గురించి అడిగి తెలుసుకొన్నారు. ఉంగరాల రాంబాబు సినిమాకు సంబంధించిన విశేషాలను వారికి వివరించారు.

   దీక్షను ఆటపట్టించిన..

  దీక్షను ఆటపట్టించిన..

  ఇంటి సభ్యుల మనసులోని భావాలు, ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయాలను ఓ టాస్క్ రూపంలో సునీల్ అడిగి తెలుసుకొన్నారు. ఇంటి సభ్యులు తమ పోటీదారుల గురించి మంచి చెడులను వివరించారు. ముఖ్యంగా దీక్షను మిగితా వారంతా ఆటపట్టించేందుకు ప్రయత్నించారు. ఆటపై స్పష్టమైన వైఖరిని కనబరచని దీక్షా మిగితా సభ్యుల కామెంట్లను వినుకుంటూ కూర్చున్నది. ఆ తర్వాత కొద్ది సేపటికి సునీల్ ఇంటి నుంచి నిష్క్రమించారు.

  దీక్ష ఎలిమినేట్ అవ్వడం..

  దీక్ష ఎలిమినేట్ అవ్వడం..

  సునీల్ నిష్క్రమణ తర్వాత ఇంటిలో దీక్షా, అర్చన మధ్య ఎప్పటిలానే చిన్న వాగ్వాదం చోటుచేసుకొన్నది. దీక్షా వేసే ప్రశ్నలకు, అడిగే వివరణలకు అందరూ చిరాకు పడి ఆమె కామెంట్లు చేయడం కనిపించింది. ఈ వారం దీక్షా ఎలిమినేట్ కావడం తథ్యమనే ఫీలింగ్ అందరిలో కనిపించింది. చిన్న చిన్న పోట్లాటలు, జోక్‌లతో ఎపిసోడ్ ఫర్వాలేదనిపించే విధంగా నడిచింది.

  నచ్చిన ప్రదేశాలు ఇవే..

  నచ్చిన ప్రదేశాలు ఇవే..

  బిగ్‌బాస్ హౌస్‌లో 61 రోజులు గడిపిన సెలబ్రిటీలను ఇంటిలో వారికి నచ్చిన ప్రదేశాల గురించి వివరించమని బిగ్‌బాస్ కోరారు. అయితే వారు తమకు నచ్చిన ప్రదేశాల గురించి ప్రతి ఒక్కరు వివరించారు. ఎక్కువ మంది తమకు కిచెన్ ఇష్టం అని తెలుపారు. బాత్రూం నాకు నచ్చిన ప్లేస్ అని ఆదర్శ్, బెడ్ రూం నాకు చాలా ఇష్టం అని అర్చన తెలిపారు. ఇక శివబాలాజీ నాకు స్కోక్ రూమ్ అంటే ఇష్టం అని తెలుపడం గమనార్హం.

   అర్చనకు బత్తాయిలతో మసాజ్

  అర్చనకు బత్తాయిలతో మసాజ్

  బిగ్‌బాస్ హౌస్‌లో శివ బాలాజీ, అర్చన మధ్య ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అర్చన వీపు మీద శివబాలాజీ బత్తాయిలతో మసాజ్ చేయడం గమనార్హం. మసాజ్ చేసుకొంటూ అర్చన ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ ఎపిసోడ్‌లో శివబాలాజీ చేసిన చిలిపి పనులు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.

   షాక్ ఇచ్చిన శివబాలాజీ

  షాక్ ఇచ్చిన శివబాలాజీ

  బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి పనుల్లో వారు ఉండగా హరితేజ, అర్చన బాత్రూంలో దూరారు. ఇది గమనించిన శివ బాలాజీ, దీక్ష వారు ఏమి చేస్తున్నారో అనే విషయం తెలుసుకోవడానికి కర్టెన్ చాటున నిలబడి ఆసక్తిగా గమనించారు. హరితేజ, అర్చన ఇద్దరూ దీక్ష గురించి చాడీలు చెప్పుకోవడం ప్రారంభించారు. అలా కాసేపు మాట్లాడుకొన్న తర్వాత కర్టెన్ వెనుక ఉన్న శివబాలాజీని, దీక్షను చూసి హరితేజ షాక్ అయింది.

   ముఖం తేలేసిన హరితేజ

  ముఖం తేలేసిన హరితేజ

  శివబాలాజీ దొంగచాటుగా తమ సంభాషణను వినడంపై హరితేజ, అర్చన ముఖం తేలేశారు. ఏంటీ శివ అలా చేస్తావా? దీక్ష మా మాటలను విన్నదా అని అడుగుతూ కంగారు పడ్డారు. వారి కంగారును చూసి శివబాలాజీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. కాసేపు వారిని ఆటపట్టించేందుకు శివ ప్రయత్నించాడు.

  నొచ్చుకొన్న దీక్ష

  నొచ్చుకొన్న దీక్ష

  హరితేజ, అర్చన బయటకు కనిపించే విధంగా ఓ పక్క సన్నిహితంగా ఉంటూనే తనపై కామెంట్లు చేసిన తీరుకు దీక్ష నొచ్చుకొన్నది. తనపై చూపిస్తున్న ప్రేమ అంతా ఉత్తిదే అనే భావనకు దీక్ష్ వచ్చింది. వారిద్దరి ప్రవర్తను దీక్ష నొచ్చుకొని నిద్రకు ఉపక్రమించింది. శనివారం జరిగే ఎపిసోడ్‌లో ఎవరు బిగ్‌బాస్ ఇంటి నుంచి నిష్క్రమిస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.

   చివరి ఘట్టానికి బిగ్‌బాస్

  చివరి ఘట్టానికి బిగ్‌బాస్

  టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ తెలుగు కార్యక్రమం తుది అంకానికి చేరుకొన్నది. గ్రాండ్ ఫినాలే వారం మొదలైంది. వచ్చేవారం ప్రారంభంలో విజేత ఎవరో అనే విషయం తేలుతుంది. 50 లక్షల బంపర్ ప్రైజ్ ఎవరిని వరిస్తుందో అనే అంశం ప్రేక్షకుల్లో చర్చనీయాంశమవుతున్నది.

  English summary
  Tollywood hero Sunil enjoyed in Biggboss house in 61th episode. He came to promote his Ungarala Rambabu movie which released on September 15th. Few interesting things happen in house between Hariteja, Archana, Deeksha and Shiva Balaji. Deeksha upset over Hariteja, Archana behaviour towards her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X