»   » 'బాహుబలి': విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిజైనర్‌ ఇంటర్వూ (తెలుగు వీడియో)

'బాహుబలి': విజువల్‌ ఎఫెక్ట్స్‌ డిజైనర్‌ ఇంటర్వూ (తెలుగు వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' చిత్రం విజువల్ ఎఫెక్టుల గురించి మాట్లాడుకోని వారు ఉండరు. అంతలా ఆ ఎఫెక్టులు తన మాయా జాలంతో ప్రపంచ ప్రేక్షకులను కట్టిపారేసాయాయి. ఇంతకీ ఆ ఎఫెక్టులు రూపొందించింది మరెవరో కాదు ఓ తెలుగువాడు..ఆయన పేరు శ్రీనివాస మోహన్. ఈ రోజు ఇండియా లో టాప్ దర్శకులు ఈయనతో పనిచేయాలనుకుంటున్నారు. ఇంతటి ప్రతిభాశాలి..పదవ తరగతి కూడా చదవలేదు. ఆయనతో ఈటీవి తెలంగాణా వారు ముచ్చటించారు. ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ వీడియో చూడాల్సిందే.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక బాహుబలి టీమ్ విషయానికి వస్తే..


ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.


Vincent Tabaillon గతంలో.."The Incredible Hulk", "Clash of the Titans", "Taken 2" and most recently, "Now You See Me" చిత్రాలకు పనిచేసారు. మొదట్లో ఫ్రెంచ్ చిత్రాలకు పనిచేసిన ఆయన ఇప్పుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. ఆయన ఎడిట్ చేసే ఈ చిత్రం ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్తుంది. అలాగే ఇక్కడ ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. ఒరిజనల్ చిత్రానికి దీనికి తేడా ఉంటుంది.


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


Interview With 'BAAHUBALI' Visual Effects Designer Srinivasa Mohan

 
బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.200 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం 5 రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.

మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.


మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.

English summary
ETV Exclusive Interview With 'BAAHUBALI' Visual Effects Designer Srinivasa Mohan.
Please Wait while comments are loading...