For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi August 7th Episode: వాళ్లను ఒక్కటి చేసిన ప్రేమ్.. తులసికి సాయం చేస్తానన్న నందూ

  |

  దాదాపు కొన్ని దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పరందామయ్యను ఎలాగోలా ఒప్పించిన తులసి.. నందూను తీసుకొచ్చేందుకు లాస్య ఇంటికి వెళ్తుంది. అప్పుడు నందూతో మాట్లాడగా.. అతడు లాస్య కూడా ఉంటేనే వాస్తానని చెబుతాడు. ఇందుకోసం కొన్ని కండీషన్స్ పెడతాడు. దీనికి ఒప్పుకున్న తులసి అతడితో పాటు లాస్యను తీసుకొస్తుంది. ఇంట్లోకి వచ్చే సమయంలో లాస్య యాక్టింగ్ చేస్తూ ఏడుస్తుంది. అప్పుడు అనసూయ.. తులసి పని మనిషితో పోల్చుతుంది. ఆ తర్వాత లాస్యను ఇంటి నుంచి పంపించేందుకు ప్రేమ్ అదిరిపోయే ప్లాన్ వేస్తాడు.

  SR Kalyanamandapam Day 1 Collections: చిన్న మూవీకి ఊహించని కలెక్షన్లు.. సినీ పెద్దలే షాకయ్యేలా!

  వాళ్లందరిని ఏకతాటిపైకి తెచ్చిన ప్రేమ్

  వాళ్లందరిని ఏకతాటిపైకి తెచ్చిన ప్రేమ్

  లాస్య కుట్రలను బయట పెట్టి ఆయన నిజస్వరూపాన్ని అందరికీ తెలియజేయాలని ప్రేమ్ ప్లాన్ చేస్తుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అతడికి శృతి కూడా తోడై ‘ఆంటీ, అంకుల్‌ న్యాయ పరంగా విడిపోయారు కానీ, మనసులు విడిపోలేదు. సో.. వాళ్లు మళ్లీ కలుస్తారని నాకు నమ్మకం ఉంది' అంటుంది. అప్పుడు అభి సందేహాలు వ్యక్తం చేసినా ప్రేమ్ సరైన జావాబులు ఇస్తాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరినీ కలిపేందుకు అందరినీ ఏకతాటి మీదకు తీసుకొస్తాడు. అప్పుడు అంకిత కూడా వాళ్లతో కలిసినట్లు యాక్టింగ్ చేసినా.. దురుద్దేశంతోనే ఉంటుంది.

  తులసికి సతీష్ శుభవార్త.. సంతోషం

  తులసికి సతీష్ శుభవార్త.. సంతోషం

  ఇంట్లో పని చేసుకుంటోన్న తులసికి శృతి ఫోన్ వచ్చిందని మొబైల్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు మిశ్రా కంపెనీ మేనేజర్ మాట్లాడుతూ ‘తులసి గారూ మీకు ఎలాంటి అడ్వాన్స్ లేకుండా మెటీరియల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం కదా.. దానికి సంబంధించిన డాక్యూమెంట్స్ రెడీ చేయించాను. మీరు రేపు వస్తే వాటిని చూసి సంతకం చేయొచ్చు' అంటాడు. దీంతో తులసి, శృతి ఎంతగానో సంతోషిస్తుంటారు. అంతలో అక్కడకు వచ్చిన రాములమ్మ తులసిని పొగుడుతూ.. నందూ, లాస్యను విమర్శిస్తూ మాట్లాడుతుంది. దీంతో తులసి ఆమెను ఆపే ప్రయత్నం చేస్తుంది.

  Bigg Boss ఐదో సీజన్‌లో అతడికే ఎక్కువ: షో చరిత్రలో రికార్డు నమోదు.. ఆమెను వెనక్కి నెట్టేస్తూ!

  అదే తులసి ఆంటీని కాపాడుతుంది

  అదే తులసి ఆంటీని కాపాడుతుంది


  తులసితో రాములమ్మ మాట్లాడుతూ.. ‘మీరు వంటింటికే పరిమితం అవ్వాలని, మీకు ఏదీ చేతకాదని నందూ బాబు అన్నారు. అలాగే, లాస్యను గొప్పగా పొగిడారు. వాళ్లకు మీ ఎదుగుదల గుణపాఠం కావాలమ్మా' అంటుంది. దీనికి శృతి కూడా సపోర్టు చేస్తుంది. అలాగే, రాములమ్మ చెప్పినట్లు జరగాలిని కోరుతుంది. అప్పుడు తులసి అలా మాట్లాడకూడదు అని అంటోంది. దీనికి శృతి ‘మీరు మీ కాళ్లపై నిలబడాలి. ఎవరి కోసమో కాదు.. మీకోసం గొప్పగా జీవించాలి. అదైతే నేను కోరుకుంటున్నాను' అంటూ బదులిస్తుంది.

  లాస్యకు ప్రేమ్ ప్లాన్ చెప్పిన అంకిత

  లాస్యకు ప్రేమ్ ప్లాన్ చెప్పిన అంకిత


  నందూ, తులసిని కలపడానికి ప్రయత్నిస్తానని చెప్పిన అంకిత.. అక్కడ జరిగిన విషయాలను లాస్యతో వివరంగా చెబుతుంది. దీనికి ఆమె మాత్రం పెద్దగా భయపడదు. ఆ సమయంలో అంకిత ‘పరిస్థితి చేయి దాటేలా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండడమే మంచిది ఆంటీ' అని లాస్యను హెచ్చరిస్తుంది. అంతేకాదు, ‘నాదొక్కటే కోరిక ఆంటీ. ఎలాగైనా అభి మనసు విరిచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. అయితే, నేను మీకు సపోర్ట్ చేస్తాను. కానీ అందరి ముందు అలా ఉండలేను' అంటుంది. దీనికి లాస్య కూడా ఓకే చెబుతుంది.

  తులసికి రామచంద్ర మంచి సలహా

  తులసికి రామచంద్ర మంచి సలహా

  అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి రామచంద్రతో కలిసి తులసి.. మిశ్రా ఆఫీస్‌కు వెళ్తుంది. అక్కడ సతీష్ ఆమెతో సంతకాలు చేయిస్తాడు. అక్కడి నుంచి వస్తున్న సమయంలో రామచంద్ర ‘అమ్మా తులసి నిన్ను ఎక్కువగా పొగిడే వాళ్లను అస్సలు నమ్మకమ్మా. మన వెనకే ఉంటూ గోతులు తీస్తారు' అని సలహా ఇస్తాడు. కానీ, దీనికి తులసి అంగీకరించదు. ‘బిజినెస్‌లో నమ్మకంతోనే పని ఉంటుంది బాబాయ్. మీరు కూడా నన్ను నమ్మే.. కంపెనీ బాధ్యతలను నా చేతిలో పెట్టారు. కాబట్టి నేను నమ్మకంతోనే ముందుకు వెళ్లగలను' అని అంటుంది.

  తులసికి జాగ్రత్తలు చెప్పిన నందూ

  తులసికి జాగ్రత్తలు చెప్పిన నందూ

  మిశ్రా కంపెనీతో ఒప్పందం చేసుకున్న తులసి ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టడానికి రెడీ అవుతుంది. ఈ విషయాన్ని ఇంటికొచ్చి అందరికీ చెబుతుంది. అప్పుడు దివ్య ‘డాడ్ మీరు మామ్‌కు బిజినెస్ విషయంలో ఏదైనా సలహాలు ఇవ్వండి' అంటూ నందూను తీసుకొస్తుంది. అప్పుడతను ‘నువ్వు ఇంత కాలం వంటగదిలో ఉప్పు కారం తక్కువ వేసినా కూరే పాడైంది. ఇప్పుడు తేడాగా ఏం చేసినా పెద్ద ప్రమాదం ఎదురవుతుంది. తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా సలహాలు కావాలంటే నన్ను అడుగు. తప్పకుండా చెబుతాను' అని అంటాడు.

  సింగర్ సునీత పర్సనల్ ఫొటోలు: హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా.. ఆమెను మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  తులసిని నిరుత్సాహపరిచిన లాస్య

  తులసిని నిరుత్సాహపరిచిన లాస్య

  నందూ తులసితో మాట్లాడుతుండగా ప్రేమ్, పరందామయ్య అడ్డు పడతారు. ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహ పరుస్తావా అంటూ ప్రశ్నిస్తారు. అంతలో కలుగజేసుకున్న లాస్య ‘నందూ అన్న దాంట్లో తప్పేముంది? తులసికి ఏం తెలుసని ఫ్యాక్టరీ నడుపుతుంది? మా లాగా చదువుకుందా? ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతుందా?' అని అంటుంది. అప్పుడామెకు అంకిత కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో అభి ఆమెపై కోప్పడతాడు. ‘అమ్మను ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇలా అంటారా' అని అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 392: Sathish Said Good News to Tulasi. Then She Went Office and Signed on the Agreement. After That Nandu and Lasya Discouraged Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X