For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 12 Episode: తులసి సూపర్ ప్లాన్.. విడాకుల వద్దన్న అనసూయ.. లాస్యకు షాక్

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  vPhotos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విడాకుల తర్వాత తమ్ముడితో వెళ్లిపోయిన తులసి.. ఆ తర్వాత ఇంటికి వస్తుంది. ఆ సమయంలో దీపక్ తులసి మామగారిని అన్ని అడుగుతాడు. ఆ తర్వాత నందూతో గొడవ పడిన దీపక్.. లాస్య వల్ల నీ జీవితం నాశనం అవడం గ్యారెంటీ అని జోష్యం చెబుతాడు. ఇక, తల్లి కోసం తండ్రిని వదులుకోవడం ఇష్టం లేదని తులసి పిల్లలు తేల్చి చెబుతారు.

  విడాకులకు ఒప్పుకోని అనసూయ

  విడాకులకు ఒప్పుకోని అనసూయ

  కొడుకు ఇంటికి వెళ్లడానికి పయనమైన ‘అనసూయకు విడాకులు ఇచ్చేస్తా.. శాశ్వతంగా అక్కడే ఉండు' అని భర్త అంటాడు. దీనికి ఆమె ‘విడాకులకు నేనెందుకు ఒప్పుకుంటాను. నేను ముత్తైదువులానే పోవాలి. అందుకే చివరి వరకూ మీతోనే ఉంటాను' అంటుంది. ఆ తర్వాత తులసి ఆమెను ‘మీ ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్లండి. మీకెవరూ అడ్డు చెప్పరు' అని పంపిస్తుంది.

   కొడుకు ఇంటికి వెళ్లడంతో ఆందోళన

  కొడుకు ఇంటికి వెళ్లడంతో ఆందోళన

  నందూ, లాస్య ఆఫీస్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. అనసూయ అక్కడకు వెళ్తుంది. ఆమెను చూసిన వెంటనే లాస్య లోలోపల తిట్టుకుంటూ మొహమాటంగా మాట్లాడుతుంది. తర్వాత అనసూయ.. లాస్యను కాఫీ అడగగా.. ‘ఆఫీస్‌కు ఆలస్యం అవుతుంది మీరే పెట్టుకోండి' అని బదులిస్తుంది. దీంతో బాధ పడినా.. తినడానికి పిజ్జా ఆర్డర్ ఇస్తానని చెప్పడంతో సంతోషిస్తుంది.

  నందూకు గుడ్ న్యూస్ చెప్పిన పీఏ

  నందూకు గుడ్ న్యూస్ చెప్పిన పీఏ

  నందూ, లాస్య ఆఫీస్‌లో కూర్చుని క్లయింట్ల నుంచి రావాల్సిన డబ్బుల గురించి మాట్లాడుతుంటారు. అంతలో పీఏ వచ్చి ‘సార్ మీకో గుడ్ న్యూస్. క్లయింట్లు అందరూ డబ్బులు పంపించేశారు. ఇంకోటి ఏమిటంటే.. తర్వాతి కాంట్రాక్టు కూడా మనకే ఇస్తానని చెప్పారు. దీని గురించి మెయిల్ కూడా పెట్టారు' అని అంటాడు. దీంతో లాస్య, నందూ సంతోష పడుతూ కంగ్రాట్ చెప్పుకుంటారు.

   తులసికి అనొద్దని తేల్చేసిన నందూ

  తులసికి అనొద్దని తేల్చేసిన నందూ

  ఒకదాని తర్వాత ఒకటి గుడ్ న్యూస్‌లు తెలుస్తుండగా.. లాస్య మాట్లాడుతూ.. ‘నందూ ఒక విషయం గమనించావా? మనకు వరుసగా అన్నీ శుభాలే జరుగుతున్నాయి. దీనికి కారణం నువ్వు తులసిని వదిలించుకోవడమే' అంటుంది. అప్పుడు నందూ ఆ మాటలకు చిరాకుగా అభ్యంతరం చెబుతాడు. దీంతో లాస్య ‘అవునులే పరాయి వాళ్ల గురించి మనకెందుకు' అని చెబుతుంది.

   తులసికి మరో డీల్.. బిజినెస్ ప్లాన్స్

  తులసికి మరో డీల్.. బిజినెస్ ప్లాన్స్


  చిన్న వ్యాపారం ప్రారంభించిన తులసి.. కాంట్రాక్టర్ దగ్గరకు వస్తుంది. అప్పుడాయన ‘తులసి గారు మీ వర్క్ క్లయింట్లకు బాగా నచ్చింది. మీరెందుకని బిజినెస్‌ను పెద్దగా చేసుకోకూడదు' అని అంటాడు. అంతలో అక్కడకు రామచంద్ర అనే ముసలాయన వస్తాడు. అప్పుడాయనకు డీల్ ఇవ్వడం కుదరదని చెబుతాడు. దీంతో నేను పేదల కోసమే ఈ వ్యాపారం చేస్తున్నా అని అంటాడాయన.

  శృతితో బిజినెస్ గురించి తులసి ఇలా

  శృతితో బిజినెస్ గురించి తులసి ఇలా

  రామచంద్ర పరిస్థితిని తెలుసుకున్న తులసి.. ఇంటికి వచ్చినప్పటి నుంచి అదే ఆలోచనలో ఉంటుంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని శృతితో చెబుతుంది. అప్పుడు ఆమె కూడా తులసిని మరింతగా ప్రోత్సహిస్తుంది. ‘మీరు అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది. మన బిజినెస్‌ను పెద్దది చేద్దాం' అని అంటుంది. దీంతో తులసి ఏం చేయాలన్న ఆలోచనలో పడుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!

  English summary
  Intinti Gruhalakshmi Episode 369: Anasuya Went to her Son Nandus House. That Time Lasya Feel Sad. After That Nandu and Lasya Received Contract Amount from Client
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X