For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 16 Episode: అది తులసికే సొంతమన్న నందూ.. శశికళ రాకతో లాస్య కొత్త ప్లాన్

  |

  మిగిలిన భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోండి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. డబ్బుల కోసం వచ్చిన దివాకర్‌తో లాస్య గొడవకు దిగుతుంది. ఆ తర్వాత తులసి ప్రమాదంలో చిక్కుకున్న రామచంద్రను కాపాడుతుంది. అప్పుడు ఆయనతో ఆమెకు సత్సంబంధం ఏర్పడుతుంది. ఇక, దివ్యను తన తండ్రి దగ్గరకు వెళ్లమన్న అనసూయతో అందరూ గొడవకు దిగుతారు. నందూ లాస్యకు కారును సర్‌ప్రైజ్ గిఫ్టుగా తీసుకుని వస్తాడు.

  తన మీద నిందలు వేసుకున్న తులసి

  తన మీద నిందలు వేసుకున్న తులసి

  పాత కారు తీసుకొచ్చి నందూ ఇంట్లో గొడవ పెడతాడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ బయటకు వస్తారు. అప్పుడు నందూ.. తులసిని తప్పుబడుతూ మాట్లాడతాడు. దీనికి అనసూయ కూడా తోడవుతుంది. అప్పుడు తులసి ‘అవును.. నేనే కావాలని అన్నీ చేశాను' అంటూ నిందలు వేసుకుంటుంది. ‘నిజం చెబితే ఎవరూ నమ్మనప్పుడు అబద్ధాన్నే ఒప్పుకోవాలి' అని చెబుతుంది.

   తులసికి పిల్లల అండ... మర్చిపోలేము

  తులసికి పిల్లల అండ... మర్చిపోలేము

  గొడవ జరుగుతున్నప్పుడు పిల్లలు తులసికి సపోర్ట్ చేస్తారు. ముందుగా దివ్య ‘అమ్మ ఎప్పుడూ మీ గురించి చెడుగా మాట్లాడలేదు. మరి మీరెందుకు ఎప్పుడూ తనను తిడతారు' అని నందూను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత అభి ‘మాకు ఇద్దరూ సమానమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు' అని అంటాడు. దీంతో అనసూయ అభి, దివ్యను తిడుతుంది.

  నందూను సెంటిమెంట్‌తో కొట్టిన ప్రేమ్

  నందూను సెంటిమెంట్‌తో కొట్టిన ప్రేమ్

  చివర్లో ప్రేమ్ మాట్లాడుతూ.. ‘మీరు అవసరం తీరిందని ఇస్తున్నారో.. ధ్వేషంతో ఇస్తున్నారో తెలియదు కానీ.. ఆ కారు అభి, దివ్య నాకు ఓ మధుర జ్ఞాపకం. మీరు మమ్మల్ని ఆ కారులోనే ఊరంతా తిప్పారు. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేము' అంటాడు. అప్పుడు తాత కలుగజేసుకుని.. ‘మీ నాన్నకు కొత్త వాటి మీద మోజు పెరిగి పాత వాటిని దూరం చేసుకుంటున్నాడురా' అని అంటాడు.

  నందూకు శశికళ వార్నింగ్... చంపుతా

  నందూకు శశికళ వార్నింగ్... చంపుతా

  తులసి ఇంట్లో జరిగిన గొడవను గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంటాడు నందూ. అంతలో అక్కడికి అప్పు ఇచ్చిన శశికళ వస్తుంది. ‘ఏం తంబీ.. కారు కొనడానికి డబ్బులు ఉన్నాయి కానీ, నా అప్పు తీర్చడానికి లేవా? అయినా నీ ఆఫీస్ దివాళా తీసిన విషయం.. నీ భార్యకు విడాకులు ఇచ్చింది నాకు తెలుసు. నా డబ్బు గురించి తేడా వస్తే నీ ప్రాణాలు తీస్తా' అంటూ వార్నింగ్ ఇస్తుంది.

  గొడవపై నందూకు లాస్య మరో సలహా

  గొడవపై నందూకు లాస్య మరో సలహా

  ముందు రోజు దివాకర్ వచ్చి గొడవ చేయడం.. తాజాగా శశికళ వార్నింగ్ ఇవ్వడంతో లాస్య కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ మేరకు నందూతో ‘ఆ ఇంటిపై మనకు ఎలాగో హక్కు లేదు. కాబట్టి మనం ఇంకో ఇల్లు కొనుక్కుందాం. అది ఉంటే ఇలాంటి వాళ్లు గొడవలు చేసే అవసరం ఉండదు' అంటుంది. అప్పుడు నందూ ‘డబ్బులు లేవు.. అప్పులున్నాయి ఇప్పుడు ఇల్లేంటి' అని బదులిస్తాడు.

  తులసికి రామచంద్ర ఫోన్... మామతో

  తులసికి రామచంద్ర ఫోన్... మామతో

  ఇంట్లో ఒంటరిగా ఉన్న తులసికి రామచంద్ర ఫోన్ చేస్తాడు. అప్పుడామె ‘చెప్పండి బాబాయ్ గారూ' అంటుంది. దీనికి ఆయన ‘ఇంత ఆప్యాయంగా పిలిపించుకుని ఎన్నో రోజులు అయిందమ్మా. రేపు ఉదయం ఒక్కసారి నా దగ్గరకు వస్తావా? నీతో మాట్లాడాలి' అంటాడు. అప్పుడు తులసి.. మామగారికి విషయం చెబుతుంది. దీంతో ఇద్దరూ దీనిపై ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసుకుంటారు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   అనసూయను బుట్టలో పడేసిన లాస్య

  అనసూయను బుట్టలో పడేసిన లాస్య

  నందూ దగ్గర ఉన్న అనసూయ కోసం లాస్య మామిడికాయలు తీసుకొస్తుంది. ఆ తర్వాత ఇల్లు కొందామన్న ప్రస్థావన తీసుకొస్తుంది. దీనికి అనసూయ కూడా సపోర్ట్ చేస్తూ తులసి లేకపోతే ఆ ఇల్లు మనదే అంటుంది. అప్పుడు నందూ ‘అది తులసికి సొంతం దాని గురించి మాట్లాడొద్దు' అంటాడు. మనసులో తిట్టుకుంటూనే నందూ తల్లికి మామిడికాయలు తినమంటుంది లాస్య.

  English summary
  Intinti Gruhalakshmi Episode 373: Divya, Abhi and Prem Supported Tulasi. Then Shashikala Warned to Nandu In Front of Lasya. After That Lasya Forced Nandu to Buy a House.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X