For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 1st Episode: తులసి సంచలన నిర్ణయం.. తొలిసారి భర్తతో అలా.. కథలో కీలక మలుపు

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తల్లి తెచ్చిన బట్టలను తీసుకోడానికి అనసూయ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కానీ, లాస్య తెచ్చిన వాటిని మాత్రం తీసుకుంటానని చెబుతుంది. అప్పుడు లాస్య.. తులసి తల్లిని అవమానించే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత పెళ్లి గురించి అనసూయ, ఆమె భర్త స్పీచ్ ఇవ్వడంతో పాటు పాటలకు డ్యాన్సులు కూడా చేస్తూ సందడి చేస్తారు.

  భార్యభర్తల బంధంపై నందూ తండ్రి స్పీచ్

  భార్యభర్తల బంధంపై నందూ తండ్రి స్పీచ్

  పెళ్లిరోజు ఫంక్షన్‌లో భార్య భర్తల అనుబంధం గురించి నందూ తండ్రి చెప్పే మాటలతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. ‘భార్య భర్తలు రెండు కాళ్లు లాంటి వాళ్లు. ఒక కాలు ముందు వెళ్తే.. రెండోది దాన్ని అనుసరిస్తుంది. భార్య భర్తలు కూడా ఒకరినొకరు అనుసరిస్తూ వెళ్తే వాళ్ల జీవితం సుఖమయ ప్రయాణం అవుతుంది' అని చెబుతాడు. దీంతో అందరూ చప్పట్లు కొడుతారు.

  ఆయన మాటలపై తులసి తల్లి కామెంట్

  ఆయన మాటలపై తులసి తల్లి కామెంట్

  నందూ తండ్రి స్పీచ్ అయిన వెంటనే తులసి తల్లి స్పందిస్తుంది. ‘మీరు చెప్పింది బాగానే ఉంది అన్నయ్య గారు. కానీ, ఈరోజుల్లో అలా ఎవరు ఉంటున్నారు. వాళ్ల వాళ్ల సుఖాల కోసం భార్య భర్తల బంధాన్ని కాదనుకుంటున్నారు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారు' అంటూ చెబుతుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న లాస్య.. నందూని అంటుందని గొడవకు దిగుతుంది.

  తులసి తల్లితో మళ్లీ గొడవకు దిగిన లాస్య

  తులసి తల్లితో మళ్లీ గొడవకు దిగిన లాస్య

  తులసి తల్లి మాట్లాడుతుండగా అడ్డొచ్చిన లాస్య ‘ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మీరు ఇన్‌డైరెక్టుగా నందూను తిడుతున్నారు' అంటూ వాగ్వాదానికి దిగుతుంది. దీంతో అక్కడున్న వాళ్లు మాత్రం లాస్యకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందరికీ సమాధానం చెప్పిన తర్వాత.. తులసి తల్లిని ఉద్దేశించి లాస్య ‘మొగుడు లేని దానివి నీకేం తెలుసు' అంటూ నోరు జారి మాట్లాడుతుంది.

  లాస్య చెంపను చెల్లుమనిపించిన తులసి

  లాస్య చెంపను చెల్లుమనిపించిన తులసి

  తల్లిని అంత మాట అనడంతో కోపంగా వచ్చిన తులసి.. లాస్య చెంపను చెల్లుమనిపిస్తుంది. అలాగే, తన తల్లి గురించి చెడుగా మాట్లాడితే చెప్పుతో కొడతా అంటుంది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తురాలైన ఆమె.. ధీటుగా సమాధానాలిస్తూ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు. అంతలో తనకు సపోర్ట్ చేయాలంటూ నందూను రెచ్చగొట్టేలా ప్రేరేపిస్తుంది.

  అమ్మాయిల గొప్పదనం చెప్పిన తులసి

  అమ్మాయిల గొప్పదనం చెప్పిన తులసి

  లాస్య కోరిక మేరకు నందూ వణుకుతూనే ‘ఇందులో లాస్య తప్పేముంది తులసి.. ఆమె ఏదైనా అనొచ్చు కానీ నువ్వు కొట్టడం మాత్రం తప్పు' అంటాడు. దీంతో తులసి ‘నేను చేసింది తప్పా. ఆమె మా అమ్మను అంత మాట అంటే కరెక్టా. అయినా ఆడవాళ్లకు ఇలాంటి పరిస్థితులు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం మీలాంటి మగాళ్లే' అంటూ అదిరిపోయే డైలాగ్స్ చెబుతుంది.

   తులసి సంచలన నిర్ణయం.. భర్తతో అలా

  తులసి సంచలన నిర్ణయం.. భర్తతో అలా

  ఈ సమయంలోనే తులసి మాట్లాడుతూ.. ‘లాస్య అన్నది ఎవరిని? మీ అత్తను. నన్ను మీకిచ్చి కన్యాదానం చేసిన మీ అత్తగారిని. ఇప్పుడు చెబుతున్నా వినండి.. విడాకులు మీరు ఇవ్వడం కాదు.. మానసికంగా నేనే ఇస్తున్నా. నన్ను మీరు వద్దనుకోవడం కాదు.. నేనే మిమ్మల్ని వద్దనుకుంటున్నా. ఈ క్షణం నుంచి మనకు ఎటువంటి సంబంధం లేదు' అంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.

  మొత్తం నేను చేసిన తప్పే అన్న తులసి

  మొత్తం నేను చేసిన తప్పే అన్న తులసి

  ఈ సందర్భంలో కోపంతో పాటు ఆవేదనతో మాట్లాడిన తులసి.. ‘పరాయి దాన్ని ఏలుకుంటానన్నా.. విడాకులకు సంతకం పెట్టమన్నా సైలెంట్‌గా ఉన్నాను. భర్తను సరిగా దారిలో పెట్టుకోవడంలో నేను విఫలం అయ్యాను. అంటే ఇది మొత్తం నా తప్పే. మీరెప్పటికైనా మారతారని చూడడం నా తప్పే. దాన్ని నేనే సరిదిద్దుకుంటున్నా. అందుకే మీకు దూరం అవుతున్నా' అని అంటుంది.

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  English summary
  Intinti Gruhalakshmi Episode 360: Lasya Criticised Tulasi's Mother. Then Tulasi Came and Slap Her In Front of Nandu. After That Tulasi Decieded to Breakup to Nandu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X