For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi July 2nd Episode: తులసిని తప్పుబట్టిన మామ.. భర్తకు అందుకే దూరం.. చచ్చారా అంటూ!

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి తల్లిని అవమానించే ప్రయత్నం చేస్తుంది లాస్య. దీంతో అనకూడని మాటలు కూడా అంటుంది. అప్పుడు తులసి ఆమె చెంప చెల్లుమనిపిస్తుంది. ఆ సమయంలో భర్త లాస్య వైపు మాట్లాడడంతో.. అతడి నుంచి విడిపోతున్నట్లు చెబుతుంది. అలాగే, ఆడవాళ్ల గొప్పదనం వివరిస్తూ నందూపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె.

  మనిషిగా ఓడిపోయారు.. నేనలా కాదు

  మనిషిగా ఓడిపోయారు.. నేనలా కాదు

  ఫంక్షన్‌లో తులసి భర్తతో గొడవ పడుతోన్న సన్నివేశంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. ‘మిమ్మల్ని దారిలో పెట్టుకోవడంలో నేను ఓడిపోయి ఉండొచ్చు. కానీ, ఓ తల్లి, కోడలిగా ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ, మీరు మాత్రం వేరే ఆడదాని కోసం భార్య దగ్గర ఓడిపోయారు. పిల్లల్ని, తల్లిదండులను వదిలేసి తండ్రిగా, కొడుకుగా ఓడిపోయారు' అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది తులసి.

   నందూను లాక్కుంటూ తీసుకెళ్లిన లాస్య

  నందూను లాక్కుంటూ తీసుకెళ్లిన లాస్య

  తనకు జరుగుతున్న అన్యాయంపై అందరి ముందే భర్తను కడిగేసింది తులసి. దీంతో నందూలో ప్రశ్చత్తాపం కనిపించింది. ఆ సమయంలో లాస్య అతడిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయింది. ఆ సమయంలో తులసికి నందూ చేసిన చెడ్డ పనులన్నీ గుర్తుకు వచ్చాయి. అలాగే, నందూ కూడా తన భార్య తీసుకున్న నిర్ణయాన్ని ఊహించుకుని బాధ పడుతూ ఉంటాడు.

  తులసి తప్పు చేసిందన్న నందూ తండ్రి

  తులసి తప్పు చేసిందన్న నందూ తండ్రి

  ఆ గొడవ తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు బాధ పడుతోన్న తులసి దగ్గరకు వచ్చిన నందూ తండ్రి.. తొందరపడ్డావేమో అంటాడు. అప్పుడు మాధవి ‘ఏం చేసింది నాన్న. వదిన మంచి నిర్ణయమే తీసుకుంది' అంటుంది. అప్పుడు ఆయన ‘తులసి తన భర్తతో మంచి జీవితాన్ని కోరుకుంది. ఎన్నో కలలు కన్నది. అది నిజం కావాలంటే ఇలా చేయాల్సింది కాదు' అని చెబుతాడు.

  మీ కొడుకులా మధ్యలోనే వదిలేయను

  మీ కొడుకులా మధ్యలోనే వదిలేయను

  మామగారు అన్న మాటలకు తులసి సమాధానం చెబుతూ.. ‘నేను భర్తతో కలిసుండాలని కలలు కన్నది నిజమే. కానీ, అలా జరగదని తెలిసిన తర్వాత కూడా ఇంకేం చేయమంటారు. అయినా.. నాకు నా కుటుంబం మద్దతు ఉంది. ఇకపై మీకు కోడలిగా కాదు.. కూతురిగా ఉంటాను. మీ కొడుకులా మధ్యలోనే వదిలేస్తానని భయపడకండి మామయ్య' అంటూ ఎమోషనల్ అవుతుందామె.

  ఎవరైనా చచ్చిపోయారా? అలా ఉన్నారు

  ఎవరైనా చచ్చిపోయారా? అలా ఉన్నారు

  నందూ తన భార్య చేసిన పనిని గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంటాడు. అప్పుడు లాస్య వచ్చి బయటకు రమ్మనగా ఆమెను అక్కడి నుంచి వెళ్లమంటాడు. ఇక, తులసి బాధ పడుతుండడంతో ఇళ్లంతా ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అప్పుడు అనసూయ ‘ఎవరో చచ్చినట్లు అందరూ ఏడ్చుకుంటూ ఉన్నారేంటి' అంటుంది. దీనికి ఆమె భర్త సరైన సమాధానం ఇచ్చి నోరు మూయిస్తాడు.

  భయపడిన పిల్లలు.. ధైర్య చెప్పిన తాత

  భయపడిన పిల్లలు.. ధైర్య చెప్పిన తాత

  ఫంక్షన్‌లో గొడవ జరగడానికి తులసి తల్లే కారణమని అభితో అంటుంది అంకిత. దీనికి అతడు కోప్పడుతూ.. మళ్లీ వేరే గొడవలు పెట్టకు అని అంటాడు. అంతలో దివ్య అక్కడకు వచ్చి అమ్మని చూస్తే భయంగా ఉంది. రా మాట్లాడదాం అంటుంది. ఆ తర్వాత అందరూ ఆమె దగ్గరకు వెళ్లగా.. వాళ్ల తాతయ్య మాత్రం ‘తులసిని అలా వదిలేయండి. తన మనసు కుదుటపడనీయండి' అంటాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 361: Lasya Went Her Home with Nandu. After That Nandu Father Disagreed with Tulsi Decision. Then She Clarity about her Strength.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X