Intinti Gruhalakshmi July 6 Episode: విడాకులపై షాకింగ్ విషయం చెప్పిన లాయర్.. నందూ మనసు మార్చేసి!

ఎంతో కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన దగ్గర ఉన్న డబ్బులతో సెకెండ్ హ్యాండ్ స్కూటీ కొనుక్కుంటుంది తులసి. దాన్ని డ్రైవింగ్ చేయడం నేర్చుకునే సమయంలో కింద పడిపోతుంది. అప్పుడు లాస్యకు ఆమెకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక, భాగ్య లాస్యను రెచ్చగొట్టి నందూను కాక పట్టమని సలహాలు ఇస్తుంది. అందుకు అనుగుణంగానే ఆమె నందూతో మాట్లాడుతుంది.

నందూ మనసును మార్చేసిన లాస్య

నందూ మనసును మార్చేసిన లాస్య

మందు తాగుతూ బాధ పడుతోన్న నందూ దగ్గరకు వచ్చి లాస్య మాట్లాడుతుండడంతో ఈరోజు ఎపిసోడ్ మొదలైంది. ఆ సమయంలో లాస్య 'ఎందుకు నందూ ఇలా చేస్తున్నావు. తులసి ఎంతో సంతోషంగా ఉంది. అయినా నీకు అవమానం జరిగితే.. దానికి కారణమైన వాళ్లు కుళ్లుకునేలా మారాలి. వాళ్ల ముందే సంతోషంగా తిరగాలి' అంటూ ఎన్నో మాటల చెప్పి నందూ మనసు మార్చింది.

షాకింగ్ విషయాన్ని చెప్పిన లాయర్

షాకింగ్ విషయాన్ని చెప్పిన లాయర్

తర్వాత రోజు ఉదయాన్నే తులసి ఇంటికి లాయర్ వచ్చాడు. అప్పుడు ఇంట్లో వాళ్లందరి ముందే 'తులసి గారూ మీరు కోరినట్లే జడ్జ్‌గారిని రిక్వెస్ట్ చేశాను. రేపే మీ విడాకుల కేసు విచారణకు వచ్చేలా చేశాను. పది గంటల సమయంలో కోర్టుకు వస్తే చాలు.. మీకు విడాకులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది' అని షాకింగ్ విషయం చెబుతాడు. దీంతో అందరూ గాబరా పడిపోతారు.

మళ్లీ ఆలోచించుకోమన్న మామగారు

మళ్లీ ఆలోచించుకోమన్న మామగారు

లాయర్ మాట్లాడుతుండగానే మామగారు తులసితో 'నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగానే ఉంటుంది. కానీ, ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించుకో' అని అంటాడు. దానికి తులసి 'ఎప్పటికైనా జరిగేది ఇదే కదా మావయ్య. ఇన్ని రోజులూ పడిన బాధల కంటే ఇదేం ఎక్కువ కాదు' అంటుంది. తల్లి అన్న మాటలకు అభి కూడా మద్దతివ్వగా.. తాత అతడిని మందలిస్తాడు.

అత్త ముందే లాయర్‌కు తేల్చి చెప్పింది

అత్త ముందే లాయర్‌కు తేల్చి చెప్పింది

అప్పుడే అనసూయ అక్కడకు వస్తుంది. 'లాయర్ గారూ ఇప్పుడైనా విడాకులు వస్తాయా లేదా. ఈ మహాతల్లి అందరి ముందూ యాక్టింగ్ చేసి మళ్లీ వాయిదా వేయడానికి ప్లాన్ చేస్తుంది' అంటుంది. అప్పుడు తులసి 'విడాకులు వాయిదా వేసింది మీ కొడుకు. ఇప్పుడు నేను అడుగుతున్నా. కచ్చితంగా వస్తాయి' అంటుంది. అదే జరిగితే వేయి కొబ్బరికాయలు కొడతా అంటుంది అనసూయ.

నందూను మరింతగా రెచ్చిగొట్టిన లాస్య

నందూను మరింతగా రెచ్చిగొట్టిన లాస్య

లాయర్‌తో 'ఈ సారి వాయిదా వేసే ఆలోచన ఉంటే మానుకోమని చెప్పండి' అని చెప్పి నందూ దగ్గరకు పంపుతుంది తులసి. ఈ మాటను అక్కడికెళ్లి నందూకు చెబుతాడు. అలాగే, పది గంటలకు కోర్టుకు రమ్మంటాడు. అతడు వెళ్లిపోగానే లాస్య మళ్లీ నందూ బ్రెయిన్ వాష్ చేస్తుంది. తులసి మీద కోపం పెరిగేలా మాట్లాడడంతో పాటు విడాకులు కచ్చితంగా తీసుకుంటానని చెప్పిస్తుంది.

బాధను దాచుకుని రెడీ అయిన తులసి

బాధను దాచుకుని రెడీ అయిన తులసి

రాత్రి సమయంలో తులసి తన భర్తను తలుచుకుని బాధ పడుతుంది. అప్పుడు శృతి అక్కడకు రావడంతో ఆమెను చూసి కన్నీటి పర్యంతం అవుతుంది. ఆ తర్వాత ఉదయాన్నే లేచి అన్నీ రెడీ చేసేస్తుంది. టిఫిన్ రెడీగా పెట్టి అందరికీ తినమని చెబుతుంది. అలాగే, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. దీంతో అంతా బాధ పడతారు.ఇప్పుడు కూడా అదంతా నాటకం అంటుంది అనసూయ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X