twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi July 8th Episode: దానికి తులసి నిరాకరణ.. విడాకులు మంజూరు.. కథలో ఊహించని మలుపు

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

    Photos Courtesy: Star MAA and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కోర్టుకు వెళ్లడానికి రెడీ అయిన తులసిని నోటికొచ్చిన మాటలు అని బాధ పెడుతుంది అత్తగారు అనసూయ. ఆ సమయంలో మాధవి, మోహన్ తులసికి అండగా నిలబడతారు. ఆ తర్వాత భాగ్య, విడాకుల విషయంలో లాస్యను అలెర్ట్ చేస్తుంది. అప్పుడు వగలమారి ఏడుపులతో నందూను విడాకులు తీసుకునేందుకు ప్రోత్సహిస్తుంది లాస్య.

    తల్లిని బయటకు వెళ్లిపోమన్న తులసి

    తల్లిని బయటకు వెళ్లిపోమన్న తులసి

    తన కోసం కోర్టుకు వచ్చిన తల్లితో తులసి మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. తన భవిష్యత్ గురించి బాధ పడుతోన్న తల్లికి ధైర్యం చెప్పిన తులసి.. ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది. అప్పుడు తల్లి 'నిన్ను మన ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చా' అని అంటుంది. దీనికి తులసి 'ఇంటికి వస్తాను. కానీ, నా విడాకులను నువ్వు చూడడం నాకిష్టం లేదు' అంటుంది.

     వానర సైన్యాన్ని తీసుకొచ్చావా తులసి

    వానర సైన్యాన్ని తీసుకొచ్చావా తులసి

    విడాకుల కోసం ముందే కోర్టుకు చేరిన నందూ, లాస్య.. తులసి కోసం వేచి చూస్తుంటారు. అప్పుడే మాధవి, మోహన్, ప్రేమ్‌లతో కలిసి ఆమె అక్కడకు వస్తుంది. ఆ సమయంలో 'ఏంటి వానర సైన్యాన్ని తీసుకొస్తున్నావా? ఇక్కడేం రాద్దాం చేద్దామని ప్లాన్ చేశారు' అంటుంది. దీనికి తులసి 'వానర సైన్యమే సముద్రాన్ని దాటింది. దీన్ని అంత తక్కువ అంచనా వేయకు' అని బదులిస్తుంది.

    నీ చెల్లిని కూడా కొట్టమంటావా నందూ

    నీ చెల్లిని కూడా కొట్టమంటావా నందూ

    లాస్య మాట్లాడుతుండగా.. మాధవి, మోహన్ ఆమెపై ఫైర్ అవుతారు. అప్పుడు నందూ 'నువ్వు ఎవరు లాస్యను అనడానికి. తనకు నీకు ఎలాంటి సంబంధం లేదు' అని మోహన్‌తో అంటాడు. అప్పుడు 'నేను ఇప్పుడే మాధవిని కొడతా' అని ఆమెను లాగుతాడు మోహన్. దీంతో నందూ అతడిపై ఫైర్ అవగా.. 'మాధవి నా భార్య. నా కుటుంబంలోకి రాడానికి నువ్వెవరు' అని బదులిస్తాడు.

    నువ్వు లేకపోతే మేమంతా హ్యాపీగానే

    నువ్వు లేకపోతే మేమంతా హ్యాపీగానే

    మోహన్ మాట్లాడుతుండగా లాస్య ఎంటరై నోటికొచ్చినట్లు మాట్లాడకు అంటుంది. అప్పుడు ప్రేమ్ 'ఎవరు ఎలా మాట్లాడుతున్నారు. నువ్వనేదానికి లేకపోతే మేమంతా హ్యాపీగా ఉండేవాళ్లం' అని ఫైర్ అవుతాడు. అప్పుడు లాస్య 'నేను మీ జీవితంలోకి రాలేదు. కావాలంటే మీ నాన్ను అడుక్కో' అంటుంది. అప్పుడు ప్రేమ్ అడిగినా నందూ మాత్రం నీళ్లు నములుతూ సైలెంట్‌గా ఉండిపోతాడు.

     నందూను సూటిగా ప్రశ్నించిన జడ్జ్

    నందూను సూటిగా ప్రశ్నించిన జడ్జ్

    కోర్టులోకి వెళ్లిన తర్వాత జడ్జ్ 'తులసి తన కాళ్లపై తాను నిలబడలేదని విడాకులు వాయిదా వేయమన్నారు. ఇప్పుడామె పరిస్థితి బాగానే ఉందా? విడాకులు కోరుతున్నారు' అని సూటిగా ప్రశ్నిస్తారు. అప్పుడు నందూ 'తను ఎలా పోయినా ఇప్పుడు నాకు సంబంధం లేదు' అని బదులిస్తాడు. అదే సమయంలో జడ్జ్‌ ముందే తులసిపై కొన్ని అభియోగాలను సైతం చేస్తాడతను.

    ఇద్దరి మధ్య వాదన.. తులసి ఆవేదన

    ఇద్దరి మధ్య వాదన.. తులసి ఆవేదన

    నందూ తనపై ఆరోపణలు చేస్తుండగా స్పందించిన తులసి 'నేను మారాను మారాను అంటున్నారే.. అసలు ఎవరి వల్ల మారాను. మీ వల్ల కాదా? 25 ఏళ్ల కాపురంలో నేను ఎన్నిసార్లు ఏడ్చాను. దానికి కారణం మీరు కాదా? బంధాలకు విలువనివ్వని మీరు నాపై అభియోగాలు చేస్తారా' అంటూ ప్రశ్నిస్తుంది. దీనికి నందూ గట్టిగా కేకలు వేస్తాడు. దీంతో జడ్జ్ ఇద్దరినీ మందలిస్తారు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    నందూ, తులసికి విడాకులు మంజూరు

    నందూ, తులసికి విడాకులు మంజూరు

    ఇద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జ్ మాట్లాడుతూ.. 'నందూ.. తులసి.. మీరిద్దరూ ఏడాది క్రితం విడాకులకు అప్లై చేసుకున్నారు. ఈ మధ్యలో మీరు కలుస్తారని మేము ఆశించాం. కానీ, విడాకులే కావాలని కోరుతున్నారు. కాబట్టి కోర్టు మీకు విడాకులు మంజూరు చేస్తుంది' అని చెబుతారు. దీంతో తులసి కన్నీటి పర్యంతం అవగా.. నందూ, లాస్య మాత్రం సంతోషంగా కౌగిలించుకుంటారు.

    English summary
    Intinti Gruhalakshmi Episode 366: Nandu and Tulasi Went To Court for Divorce Case Hearing. That Time Big Fight Placed Between Teo Groups. After So Many Clashes.. Court Granted Divorce to Nandu and Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X