For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 15th Episode: నందూను ఛీ కొట్టిన తులసి.. ఫోన్ చేసి ఆ మాట చెప్పడంతో షాక్!

  |

  కొంత కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతికి తల్లిగా ఉంటానని ధైర్యం చెబుతుంది తులసి. ఆ తర్వాత అంకిత ఇంటికి రాగానే అభి ఆమెను ఎత్తుకుని తిప్పేశాడు. ఆ తర్వాత తన భార్యకు ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు. అనంతరం తన తల్లికి ఫోన్ చేసి శుభవార్త చెప్పడంతో పాటు తండ్రిని తీసుకుని రమ్మని కోరతాడు. దీంతో నందూకి తన తండ్రి ఫోన్ చేసి తులసి వెళ్లమని చెబుతాడు.

   ఆ విషయంలో తల్లితో అంకిత వాగ్వాదం

  ఆ విషయంలో తల్లితో అంకిత వాగ్వాదం

  అబార్షన్ గురించి తలుచుకుంటూ అంకిత బాధ పడుతుండడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. అభిని మోసం చేశానని గ్రహించిన అంకిత.. కోపంతో తల్లి దగ్గరకు వచ్చి ‘నువ్వు పెద్దదానివేగా.. నీకు అమ్మతనం గురించి తెలుసు కదా.. అయినా నాకు అబార్షన్ ఎందుకు చేయించావ్' అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు ‘ఏం చేసినా నీ మంచికే' అని ఆమె బదులిస్తుంది.

   కొడుకు గురించి మురిసి పోయిన తులసి

  కొడుకు గురించి మురిసి పోయిన తులసి

  కొడుకు తండ్రి కాబోతున్నాడన్న శుభ సందర్భంలో తులసి అభి ఫొటోను చూసి మురిసిపోతూ ఉంటుంది. ‘నువ్వు ఇంట్లో నడిచిన క్షణాలు నాకింకా గుర్తున్నాయి. స్కూల్‌కు వెళ్లడానికి మారాం చేసిన రోజులూ గుర్తున్నాయి. అలాంటిది ఇప్పుడు నువ్వే ఓ బిడ్డకు తండ్రివి కాబోతున్నావు. ఎంత ఎదిగిపోయావు నాన్న' అంటూ తెగ సంబర పడిపోతూ ఆనందభాష్పాలు రాలుస్తుంది.

  మామకు షాకిచ్చిన తులసి.. వెళ్లనంటూ

  మామకు షాకిచ్చిన తులసి.. వెళ్లనంటూ

  తులసి అలా ఆలోచిస్తుండగా.. మామ గారు అక్కడకు వస్తాడు. అప్పుడు కాసేపు వీళ్లిద్దరి మధ్య అభి గురించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత నందూతో మాట్లాడిన విషయాన్ని చెబుతాడు. అయితే, తులసి మాత్రం భర్తతో కలిసి వెళ్లడానికి నిరాకరిస్తుంది. అప్పుడు మామగారితో ‘మీరు ఆయనను అడిగారు. నీకు వాడితో వెళ్లడం ఇష్టమేనా అని నన్నెందుకు అడగలేదు' అని అంటుంది.

   అభి కోరికపై నందూ లాస్య మధ్య గొడవ

  అభి కోరికపై నందూ లాస్య మధ్య గొడవ


  ఇక, తులసి వెళ్లమని అడిగిన తండ్రికి ఆలోచించి చెబుతానన్నాడు నందూ. దీనిపై లాస్య కోపంగా ఉంటుంది. ‘తులసితో వెళ్లడానికి ఇష్టపడుతున్నావు కాబట్టే మీ నాన్నకు కుదరదు అని చెప్పలేదు. ఏం చేసినా నువ్వు తులసి వైపే ఉంటున్నావు' అంటూ గొడవకు దిగుతుంది. అప్పుడు నందూ ‘నేను వెళ్తానని చెప్పలేదు కదా' అంటూ ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు.

   తులసి ఛీ కొట్టిందని చెప్పిన నందూ తండ్రి

  తులసి ఛీ కొట్టిందని చెప్పిన నందూ తండ్రి

  మామగారితో చాలా సేపు సంభాషణ జరిపిన తర్వాత నందూతో అభికి ఇంటికి వెళ్లనని తేల్చి చెబుతుంది తులసి. మరోవైపు.. లాస్యతో నందూ గొడవ పెట్టుకుంటుండగానే తండ్రి ఫోన్ చేస్తాడు. అప్పుడు ‘తులసి నీతో రావడానికి సిద్ధంగా లేదురా. భార్య భర్తను ఛీ కొట్టిందంటే వాడు ఫెయిల్ అయ్యాడని అర్థం' అని అంటాడు. అప్పుడు నందూ నేనొక్కడినే అక్కడకు వెళ్తా అంటాడు.

  Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
  తల్లి నిర్ణయంపై భయపడుతున్న దివ్య

  తల్లి నిర్ణయంపై భయపడుతున్న దివ్య


  మరోవైపు.. దివ్య ఇంట్లో ఒక్కదే ఉండి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శృతి అక్కడకు వచ్చి ఏమైందని ప్రశ్నిస్తుంది. ‘మామ్ అభి అన్న దగ్గరకు వెళ్తుందని భయంగా ఉంది. అంకిత వదిన వాళ్ల ఇంట్లో వాళ్లు డబ్బు మనుషులు. మనకు అస్సలు విలువను ఇవ్వరు. డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు' అని బాధ పడుతుంది. అప్పుడు శృతి.. దివ్యకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 346: Ankita Fired on her Mother about Abortion. Tulasi Not Happy with Her Father-In-Law for Calls Nandu. And She Denied to Go with Nandu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X