For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 16th Episode: తులసికి నందూ సహాయం.. అంతలోనే బిగ్ షాక్.. చెంపపై కొట్టి మరీ!

  |

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అబార్షన్ విషయం చెప్పకండా అభిని మోసం చేస్తున్నందుకు అంకిత తన తల్లితో గొడవ పడుతుంది. ఆ తర్వాత తన మామగారు నందూతో మాట్లాడడంపై తులసి కోప్పడుతుంది. అంతేకాదు, నాకు ఆయనతో కలిసి వెళ్లడం ఇష్టం లేదని తెగేసి చెబుతుంది. ఆ విషయం నందూకు చెబుతాడు తండ్రి. దీంతో ఒక్కడే వెళ్లాలని డిసైడ్ అయిపోతాడు.

   నందూను రెచ్చగొట్టి పంపించిన లాస్య

  నందూను రెచ్చగొట్టి పంపించిన లాస్య

  అభి ఇంటికి నందూ వెళ్తానని చెప్పిన తర్వాత భాగ్య.. లాస్య మధ్య సీరియస్ డిస్కర్షన్ జరుగుతుంది. ‘నువ్వు ఇలాగే ఉంటే బావగారు మళ్లీ తులసక్క దగ్గరకు వెళ్లిపోవడం ఖాయం. ఆయన నీ మాట వినడం లేదు' అని భాగ్య అంటుంది. అప్పుడు లాస్య ‘నేను ఆయనను బ్రతిమాలను అనుకుంటున్నావా? లేదు అక్కడికెళ్లి అవమానపడేలా రెచ్చగొట్టాను' అంటూ భారీ షాక్ ఇస్తుంది.

   తులసికి సహాయం చేసి వెళ్లిన నందూ

  తులసికి సహాయం చేసి వెళ్లిన నందూ

  అభి కోరిక మేరకు నందూ.. తులసి వేరు వేరు కార్లలో గాయత్రి ఇంటికి వెళ్తారు. కారు దిగిన వెంటనే ఇద్దరూ ఎదురు పడతారు. అప్పుడు తులసి చేతిలో బాస్కెట్‌ను తీసుకుని సహాయం చేస్తాడు నందూ. అలా ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. అప్పుడు అభి వచ్చి తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. అనంతరం అక్కడికి వచ్చిన కోడలి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు అడుగుతుంది తులసి.

   అబార్షన్ విషయం చెప్పిన అంకిత తల్లి

  అబార్షన్ విషయం చెప్పిన అంకిత తల్లి

  అభితో తులసి, నందూ మాట్లాడుతుండగా.. అంకిత ఏడుస్తూ ‘మీ అందరూ నన్ను క్షమించాలి. మీ దగ్గర పెద్ద నిజం దాచాను' అంటుంది. అప్పుడు ఏమైందని అందరూ ప్రశ్నిస్తారు. ఆ సమయంలో అభి కోపంతో అరుస్తుండగా.. గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రావడం రావడమే అంకిత అబార్షన్ చేయించుకుందని చెబుతుంది. దీంతో అభితో పాటు నందూ.. తులసి కూడా షాక్‌కు గురవుతారు.

   భార్యను కొట్టి.. అత్తమామలపై అభి ఫైర్

  భార్యను కొట్టి.. అత్తమామలపై అభి ఫైర్

  అబార్షన్ చేయించుకున్న అంకితపై అభి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. ఆ వెంటనే ఆమెను చెప్పదెబ్బ కొడతాడు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ‘మా ముందే మా కూతురిపై చేయి చేసుకుంటావా' అంటూ అభిపై కోప్పడతారు. అప్పుడతను ‘మీరు చేసిన పనికి ముందు మిమ్మల్ని కొట్టాలి. నా బిడ్డను చంపడానికి మీరెవరు? అసలెందుకు ఇలా చేశారు' అంటూ వాళ్లిద్దరిపై ఆగ్రహిస్తాడు.

   నందూ, తులసి ఘోరమైన అవమానం

  నందూ, తులసి ఘోరమైన అవమానం

  అభి తిడుతుండగా నందూ కూడా కొడుకును సమర్ధిస్తాడు. దీంతో గాయత్రి భర్త ‘నువ్వు మాట్లాడడానికి సిగ్గుండాలి. పెళ్లాం ఉండగానే ఇంకోదానితో కులికే నువ్వా విలువల గురించి మాట్లాడేది' అంటాడు. తర్వాత తులసి మాట్లాడగా.. గాయత్రి ‘భర్తను అదుపులో పెట్టుకోలేని దానివి నువ్వు కూడా మాట్లాడేదానివి అయ్యావా? నువ్వేమైనా సతీ అనసూయవా?' అంటూ అవమానిస్తుంది.

  'Aranya' Movie Motion Poster Released
   ఇంట్లో తులసికి ప్రశ్నలు.. సైలెంట్‌గానే

  ఇంట్లో తులసికి ప్రశ్నలు.. సైలెంట్‌గానే

  అనాల్సిన మాటలన్నీ అన్న తర్వాత అభి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే తులసి.. నందూ కూడా ఓ బాధాకరమైన బ్యాగ్రౌండ్ సాంగ్‌తో ఇంటికి చేరుకుంటారు. తన ఇంటికి చేరుకున్న వెంటనే తులసి ఏడుస్తుంటుంది. అప్పుడు అందరూ వచ్చి అభి గురించి.. అంకిత గురించి ప్రశ్నిస్తుంటారు. దీనికి ఆమె సమాధానం చెప్పదు. దీంతో అందరిలో అయోమయం కనిపిస్తుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 347: Tulasi and Nandu went Ankita House for Abhi. Then Gayathri Revealed About Ankita Abortion. After That Abhi Slapped her Wife.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X