For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 18th Episode: అంకిత సూసైడ్ యత్నం.. తండ్రిలా మారిన అభికి షాకిచ్చిన తల్లి

  |

  చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  నైనా గంగూలీ మరోసారి రెచ్చిపోయిందిగా

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గాయత్రి ఇంట్లో జరిగిన గొడవ గురించి తులసి ఇంట్లోని వాళ్లందరికీ చెబుతుంది. ఆ సమయంలో అనసూయ శృతిని నిందిస్తూ గొడవ పడుతుంది. ఆ తర్వాత అభి.. తన భార్యపై మరోసారి కోప్పడతాడు. దీంతో అంకిత అబార్షన్ చేయించుకోడానికి అభి చేతకానితనమే కారణం అని చెబుతుంది. ఇక, తనకు జరిగిన అవమానంపై నందూ బాధపడతాడు.

   భార్యను వదిలేయాలని అభి నిర్ణయం

  భార్యను వదిలేయాలని అభి నిర్ణయం

  అబార్షన్ గురించి అడగగా అంకిత తనను అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధ పడతాడు అభి. ఈ క్రమంలోనే ఆమెను శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ వెంటనే భార్య దగ్గరకు వెళ్లి ఈ విషయం చెబుతాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా సంభాషలను జరుగుతాయి. అంకిత ఎంత చెప్పినప్పటికీ అభి మాత్రం వదిలేయాలని డిసైడ్ అవుతాడు.

   వదిలేయడానికి కారణం చెప్పిన అభి

  వదిలేయడానికి కారణం చెప్పిన అభి

  ఆ సమయంలోనే అభి మాట్లాడుతూ.. ‘నిన్ను వదిలేయడానికి అబార్షన్ ఒక్కటే కారణం కాదు. నన్ను చేతగాని వాడిని అన్నావుగా.. నా పిల్లలు కూడా అలాగే తయారవుతారని అన్నావుగా. అందుకే వదిలేస్తున్నా' అంటాడు. అప్పుడు గాయత్రి మీ ఇంట్లో వాళ్లంతా ఇంతే అంటుంది. దీనికి అభి ‘మా వాళ్ల బంధాలు విలువ ఇవ్వకపోవచ్చు. ప్రాణాలు మాత్రం తీయలేదు' అని బదులిస్తాడు.

  ఇంటికొచ్చిన అభి... తల్లి కాళ్లపై పడి

  ఇంటికొచ్చిన అభి... తల్లి కాళ్లపై పడి

  అక్కడి నుంచి బయటకు వచ్చేసిన అభి.. నేరుగా తన ఇంటికి వస్తాడు. అతడు రాగానే అందరూ బయటకు వస్తారు. ఆ సమయంలో అభి తన తల్లి తులసి కాళ్లపై పడిపోతాడు. ‘నువ్వు ఎంత చెప్పినా వినకుండా.. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా వెళ్లిపోయాను. అందుకు అక్కడ నాకు ఎన్నో అవమానాలు జరిగాయి. చాలా తప్పు చేశాను. క్షమించు మామ్' అంటూ ప్రాధేయ పడతాడు.

  కొడుకును కొట్టిన తులసి.. ఆయనలా

  కొడుకును కొట్టిన తులసి.. ఆయనలా

  ఇది జరిగిన కొద్ది సేపటికి తులసి.. ‘అంకిత ఎక్కడుంది నాన్న. కనిపించడం లేదేంటి' అని అడుగుతుంది. దీనికి అభి ‘తను ఇక్కడికి రాదమ్మా. ఆమెను శాశ్వతంగా వదిలేసి వచ్చాను' అని చెబుతాడు. దీంతో వెంటనే అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. ‘కట్టిన తాళికి విలువ లేకుండా చేస్తావా? నువ్వు కూడా మీ నాన్నలా తయారయ్యావా?' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది.

   అంకిత సూసైడ్ యత్నం.. తల్లి అలా

  అంకిత సూసైడ్ యత్నం.. తల్లి అలా

  వీళ్ల మధ్య సంభాషణ జరుగుతుండగానే గాయత్రి అభికి ఫోన్ చేస్తుంది. ‘అభి నువ్వు చెబితే వినకుండా వెళ్లిపోయావు. ఇప్పుడు చూడు అంకిత ఆత్మహత్యాయత్నం చేసింది. మేము చూడకపోయి ఉంటే ఘోరం జరిగిపోయేది' అని అంటుంది. దీంతో కంగారు అభి వెళ్లిపోతాడు. ఆ సమయంలో ‘అభి మళ్లీ వస్తాడు. ఈ సారి అంకితను వెంటబెట్టుకుని తీసుకొస్తాడు' అని చెప్పి అతడిని పంపిస్తుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  వాళ్ల ముగ్గురికీ భారీ షాకిచ్చిన అభి

  వాళ్ల ముగ్గురికీ భారీ షాకిచ్చిన అభి

  ఇంటికి వెళ్లగానే అంకిత చేయితి కట్టుతో కనిపిస్తుంది. ఆ తర్వాత భార్యతో చాలా సేపు దీని గురించి మాట్లాడుతాడు అభి. అనంతరం ‘పద.. బట్టలు సర్దుకో. మన ఇంటికి వెళ్లిపోదాం' అని అంటాడు. దీంతో ఆమెతో పాటు అత్తమామలు కూడా షాక్ అవుతారు. ఆ సమయంలో అభిని వారించినా అతడు అస్సలు వినడు. ‘మీరు ఎన్ని చెప్పినా నేను నిర్ణయించుకున్నా' అని తేల్చి చెబుతాడు.

  English summary
  Intinti Gruhalakshmi Episode 349: Abhi Went his Home Without Ankitha. Then his wife done Suicide Attempt. After This Tulasi Told her son to Bring back Ankitha to our Home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X