For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi June 19th Episode: తల్లితో కలిసి అంకిత భారీ కుట్ర.. తులసి కుటుంబం ముక్కలైనట్లే

  |

  సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో రన్ అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మీ' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మీ' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరూ చూడండి!

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకిత అబార్షన్.. ఆ తర్వాత జరిగిన గొడవకు బాధ పడిన అభి.. ఆమెను శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం ఆమెకు చెప్పి ఇంటికి వస్తాడు. దీనిపై కోప్పడిన తులసి అతడిని కొట్టి మనసు మార్చేస్తుంది. అంతలో అంకిత ఆత్మహత్యాయత్నం చేస్తుంది. దీంతో కంగారుగా అక్కడికి వెళ్లిన అభి.. అంకితను తనతో వచ్చేయమంటాడు.

   తల్లితో కలిసి అంకిత ఊహించని కుట్ర

  తల్లితో కలిసి అంకిత ఊహించని కుట్ర

  తులసి చెప్పి పంపినట్లు తన భార్యను ఇంటికి రావాలని ఆర్డర్ ఇచ్చాడు అభి. దీనికి అంకిత వెంటనే ఓకే చెప్పేసింది. అయితే, అంతలోనే తల్లితో కలిసి ఆమె కన్నింగ్ ప్లాన్ వేసింది. ‘అభికి తన కుటుంబంపై ద్వేషం కలిగేలా చేసి.. శాశ్వతంగా ఇక్కడకు తీసుకొచ్చేయ్' అని గాయత్రి చెబుతుంది. దీనికి అంకిత ‘వెళ్లినప్పటి నుంచి అదే పనిలో ఉంటాను మామ్' అంటూ చెబుతుంది.

  అభి.. అంకిత కోసం తులసి ఏర్పాట్లు

  అభి.. అంకిత కోసం తులసి ఏర్పాట్లు

  అభి ఇంటికి వస్తాడో రాడో తెలియక పోయినా అతడి కోసం ఏన్నో ఏర్పాట్లు చేస్తుంది. పాయసం కూడా వండుతుంది. దివ్యను గేట్ దగ్గరకు వెళ్లి వెయిట్ చేయమంటుంది. అంతలో అనసూయ అక్కడకు వచ్చి పాత కాలం నాటి సామెతలు చెబుతూ.. నిరాశ పరుస్తుంది. దీంతో తులసి ‘అభి ఎలాగైనా తన భార్యను తీసుకొని వస్తాడు. చూస్తూ ఉండండి' అంటూ ధీటుగా బదులు ఇస్తుంది.

   అందరికీ సారీ చెప్పి.. అంకిత యాక్టింగ్

  అందరికీ సారీ చెప్పి.. అంకిత యాక్టింగ్

  అనుకున్నట్లుగానే అంకితను తీసుకుని అభి తన ఇంటికి వచ్చేస్తాడు. ఈ విషయాన్ని దివ్య తన తల్లికి చెబుతుంది. అప్పుడు అంకిత తన అత్తగారిని క్షమించమని అడుగుతుంది. అలాగే, శృతికి కూడా సారీ చెబుతుంది. అప్పుడు తప్పు నాదే అంటే నాదే అంటూ వీళ్లిద్దరూ పోటీ పడుతుండగా.. ఇవన్నీ ఇకపై మర్చిపోండి.. తర్వాత ఓ మనవడిని ఇవ్వండి అని తాత గారు అంటాడు.

  గాయత్రి ప్లాన్‌ను బయటపెట్టిన లాస్య

  గాయత్రి ప్లాన్‌ను బయటపెట్టిన లాస్య

  తులసి ఇంటికి అభి తన భార్యను తీసుకొచ్చిన విషయాన్ని భాగ్య.. లాస్య చెబుతుంది. అయినా ఆమె ఏమాత్రం చలించదు. దీంతో ‘ఏంటి.. పగ నాదా నీదా.? ఇంత కూల్‌గా ఉన్నావేంటి' అని ప్రశ్నిస్తుంది. దీనికి లాస్య ‘అంకిత వచ్చింది సంతోషంగా ఉండడానికి కాదు. ఆ ఫ్యామిలీని ముక్కలు చేయడానికి. గాయత్రి నాకు అన్ని విషయాలు చెప్పింది' అని అంటూ బాంబ్ పేల్చేస్తుంది.

   తల్లితో మాట్లాడుతూ దొరికిన అంకిత

  తల్లితో మాట్లాడుతూ దొరికిన అంకిత

  ఇంట్లోకి ఎంటర్ అయిన కాసేపటికి అంకిత తన తల్లి గాయత్రికి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో ‘ప్లాన్ ప్రకారమే అంతా జరుగుతోంది. వీళ్లంతా నా మీద ప్రేమ ఉన్నట్లు నటించారు. నేను కూడా నటించలేక చచ్చిపోయాను. అన్నీ అనుకున్నట్లు చేసి అభిని శాశ్వతంగా మన ఇంటికి తీసుకొచ్చేస్తాను' అంటుంది. అప్పుడు శృతి పక్కనే ఉంటుంది. దీంతో అంకిత షాక్‌కు గురవుతుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతిపై ద్వేషాన్ని బయటపెట్టిన అంకిత

  శృతిపై ద్వేషాన్ని బయటపెట్టిన అంకిత


  అంకితకు ఏ డిష్ తయారు చేయాలో అడగడానికి వచ్చిన శృతికి భారీ షాక్ తగులుతుంది. ‘నీకు అబార్షన్ అయింది కదా.. ఏమి తింటావ్' అని ఆమె అనగానే.. ‘నేను వారసుడిని చంపేశానని గుర్తు చేస్తున్నావా? లేకపోతే నా తప్పును గుర్తు చేస్తున్నావా? నేను ఇలాగే ఉంటా.. నువ్వు చేసిన అవమానం మర్చిపోలేదు' అంటూ తన కుట్రను బయట పెడుతుంది. దీంతో శృతి భయపడిపోతుంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 350: Abhi Came to his Home With Ankitha. Then his wife do Cunning plan with her Mother. After This Ankita Told Truth to Shruthi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X